అన్వేషించండి

Australia vs New Zealand: టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌.. బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్‌

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్‌ ఎంచుకుంది. ఆస్ట్రేలియాను  తక్కువ పరుగులకే కట్టడి చేయాలని కివీస్‌ భావిస్తోంది.

ప్రపంచకప్‌లో ధర్మశాల వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్‌ ఎంచుకుంది. ఆస్ట్రేలియాను  తక్కువ పరుగులకే కట్టడి చేయాలని కివీస్‌ భావిస్తోంది. పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలతో న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఆస్ట్రేలియాలో మాస్కస్‌ స్టోయినిస్‌ ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. కివీస్‌ సారధి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు.  ప్రపంచకప్‌లో వరుస విజయాలతో మళ్లీ గాడినపడిన ఆస్ట్రేలియా... అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. కివీస్‌పై గెలిచి తమ విజయాల జోరును కొనసాగించాలని కంగారులు పట్టుదలగా ఉన్నారు. బ్యాటర్లు ఫామ్‌లోకి రావడంతో ఆసిస్‌ విజయంపై ధీమాగా ఉంది. కానీ ఈ ప్రపంచకప్‌లో ఒకే ఒక్క ఓటమితో న్యూజిలాండ్‌ కూడా మంచి ఫామ్‌లో ఉంది. ఈ రెండు జట్ల మధ్య భీకర పోరు ఖాయమని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. ఈ మహా సంగ్రామంలో పేలవ ఆరంభం నుంచి పుంజుకున్న ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ చేరడమే లక్ష్యంగా దూసుకుపోతుంది. భారత్‌, దక్షిణాఫ్రికాపై ఓటముల తర్వాత బౌన్స్‌ బ్యాక్‌ అయిన కంగారులు వరుసగా మూడు విజయాలతో మళ్లీ గాడిన పడ్డారు. చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను 309 పరుగులతో ఓడించి ప్రత్యర్థులకు కంగారు జట్టు గట్టి హెచ్చరికలు పంపింది. టోర్నమెంట్‌లో కీలక దశలో ఐదుసార్లు ప్రపంచకప్‌ ఛాంపియన్‌ అయిన ఆస్ట్రేలియా... పాయింట్ల పట్టికలో ఇప్పుడు నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి నాకౌట్‌ చేరే నాలుగు జట్లలో ఒకటిగా నిలవాలని కమ్మిన్స్ నేతృత్వంలోని కంగారులు పట్టుదలగా ఉన్నారు. 
 
ఆసిస్‌ బ్యాటర్లు నిలిస్తే....
పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌ మూడో స్థానంలో ఉండగా.... ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచ కప్‌లలో ఇప్పటివరకు ఆసిస్‌-ప్రొటీస్‌ 11 మ్యాచ్‌ల్లో తలపడగా ఆస్ట్రేలియా ఎనిమిది విజయాలు సాధించగా న్యూజిలాండ్‌ కేవలం మూడు మ్యాచుల్లోనే  గెలిచింది. మొత్తం 141 వన్డేల్లో ఈ రెండు జట్లు తలపడగా... 95 వన్డేల్లో కంగారులు... 39 వన్డేల్లో కివీస్‌ విజయం సాధించాయి. ఆరేళ్ల క్రితం 2017లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ చివరి వన్డే విజయం సాధించడం గమానార్హం. నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసి బ్యాటింగ్‌లో దుర్భేద్యంగా కనిపిస్తోంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా 34వ ఓవర్‌లో వికెట్ నష్టపోకుండా 259 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (332 పరుగులు) వరుసగా రెండు సెంచరీలు చేసి ఈ ప్రపంచకప్‌లో టాప్‌ రన్‌స్కోరర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ కొంచెం ఆందోళనకరంగా ఉంది. స్టీవ్ స్మిత్, లబుషేన్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడితే న్యూజిలాండ్‌కు కష్టాలు తప్పకపోవ‌చ్చు. ప్రపంచకప్‌ చరిత్రలో గ్లెన్ మాక్స్‌వెల్ యొక్క వేగవంతమైన సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి రావడం కంగారులు కలిసి రానుంది. కానీ కెమరూన్ గ్రీన్ ఫామ్ ఆసిస్‌ను ఆందోళన పరుస్తోంది. మిచెల్ స్టార్క్ (7 వికెట్లు), జోష్ హేజిల్‌వుడ్ (6 వికెట్లు), కమిన్స్ (6 వికెట్లు) బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తున్నారు. ఆడమ్ జంపా అద్భుతంగా రాణిస్తుండడం ఆస్ట్రేలియాకు బలంగా మారింది. 
 
పటిష్టంగా న్యూజిలాండ్‌ 
న్యూజిలాండ్‌ ఈ ప్రపంచకప్‌లోనూ పటిష్టంగా ఉంది. టీమిండియాపై తప్ప మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉంది. డెవాన్ కాన్వే (249 పరుగులు) నుంచి కివీస్‌ మరో భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. కేన్ విలియమ్సన్  గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో  మిడిలార్డర్‌లో డారిల్ మిచెల్ (268 పరుగులు), రచిన్ రవీంద్ర (290 పరుగులు) బాధ్యతలను పంచుకోవలసి ఉంది. విలియమ్సన్ గైర్హాజరీలో, వికెట్ కీపర్ టామ్ లాథమ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. మిచెల్ శాంట్నర్ (12) వికెట్లతో ఈ మెగా టోర్నీలో సత్తా చాటుతున్నాడు. పేసర్లు మాట్ హెన్రీ (10 వికెట్లు), లాకీ ఫెర్గూసన్ (8 వికెట్లు) ఇప్పటివరకు ఆకట్టుకున్నారు. బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్  కూడా రాణిస్తే కంగారులకు తిప్పలు తప్పవు.
 
ఆస్ట్రేలియా ఫైనల్‌ 11: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, అష్టన్ అగర్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
 
న్యూజిలాండ్ ఫైనల్‌ 11: ట్రెంట్ బౌల్ట్,  డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (కెప్టెన్‌), డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్,  విల్ యంగ్
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget