అన్వేషించండి
Advertisement
Will Pucovski: వార్నర్ అవుతాడనుకుంటే, 26 ఏళ్లకే రిటైర్ అయ్యాడు!
Australia Player Pucovski : ఆస్ట్రేలియా యువబ్యాటర్ విల్ పుకోవ్స్కీ 26 ఏళ్ల వయసులో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పలుమార్లు బంతి తలపై తగలడంతో పుకోవ్స్కీవైద్యుల సలహాతో క్రికెట్‌కు దూరం అయ్యాడు.
Australia Cricketer Will Pucovski To Retire From Professional Cricket At 26 Age: క్రికెట్ ప్రపంచంలో మరో ఆటగాడి కెరీర్ అర్ధారంతంగా ముగిసింది. ఆస్ట్రేలియా(Australia Cricketer)లో దిగ్గజ ఆటగాడు డేవిడ్ వార్నర్ స్థానాన్ని భర్తీ చేస్తాడని భారీ ఆశలు పెట్టుకున్న ఆటగాడు విల్ పుకోవ్‌స్కీ(Pucovski) 26 ఏళ్లకే తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. భారత్‌తో జరిగిన అరంగేట్రం టెస్టులోనే అర్ధ శతకంతో మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాడిగా గుర్తింపు పొందిన విల్ పుకోవ్‌స్కీ... వరుసగ గాయాలతో తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ అనూహ్య ప్రకటనతో క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు క్రికెట్ ప్రపంచం కూడా విస్తుపోయింది.
26 Years Old Will Pucovski set to retire from cricket due to medical reasons. (9News).
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 29, 2024
- He's had several concussions in the past! pic.twitter.com/oBIgNCWAFW
ఆ ఇన్నింగ్స్‌తో వెలుగులోకి...
ఆస్ట్రేలియాతో 2021లో సిడ్నీ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో విల్ పుకోవ్‌స్కీ అరంగేట్రం చేశాడు. తొలి టెస్ట్‌లోనే 72 పరుగులు చేసి సత్తా చాటి భవిష్యత్తు స్టార్‌గా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో ఆ స్థానాన్ని విల్ పుకోవ్‌స్కీ భర్తీ చేస్తాడని అంతా భావించారు. అయితే ఈ ప్రతిభగల క్రికెటర్‌ను గాయాలు వేధించాయి. ఆడిన తొలి టెస్ట్‌లోనే విల్ పుకోవ్‌స్కీ గాయపడ్డాడు. తొలి టెస్ట్‌లో గాయంతో దాదాపు ఆరు నెలలపాటు ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకున్న వరుస గాయాలు వవిల్ పుకోవ్‌స్కీని తీవ్రంగా వేధించాయి. వరుస గాయాలతో జాతీయ జట్టులోకి రాలేకపోయాడు. 2024 మార్చిలో ఆస్ట్రేలియా దేశవాళీ పోటీల్లో మరోసారి విల్ పుకోవ్‌స్కీ గాయపడ్డాడు. బౌన్సర్ విల్ పుకోవ్‌స్కీ హెల్మెట్‌కి తాకడంతో కంకషన్‌కి గురయ్యాడు. ఆ తర్వాత పుకోవ్‌స్కీ నాలుగేళ్ల వ్యవధిలో ఏకంగా పదిసార్లుపైగా పుకోవ్ స్కీ కంకషన్‌కి గురయ్యాడు. దాంతో అతని మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింది. వరుస గాయాలతో కంకషన్‌కు గురవ్వడం... ఈ గాయాలతో అతని మానసిక స్థైర్యం దెబ్బతినడంతో అతడు కెరీర్‌ను ముగించాలని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సంప్రదింపుల తర్వాత 26 ఏళ్లకే తన కెరీర్‌ను ముగిస్తున్నట్లుగా ప్రకటించాడు.
దేశవాళీల్లో పరుగుల వరద
ఆస్ట్రేలియా దేశవాళీల్లో విక్టోరియా తరఫున 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన విల్ పుకోవ్‌స్కీ 45.19 సగటుతో ఏడు శతకాలు చేశాడు. దేశవాళీల్లో 2,350 పరుగులు చేసి సత్తా చాటాడు. షెఫీల్డ్ షీల్డ్‌లో విక్టోరియా తరఫున రెండు డబుల్ సెంచరీలు సాధించి విల్ పుకోవ్‌స్కీ.. దేశవాళీలో ప్రకంపనలు సృష్టించాడు. కానీ దురదృష్టం అతడ్ని వెంటాడింది. విల్ కెరీర్‌లో 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 14 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో2350 పరుగులు చేశాడు. 45 సగటు తో ఏకంగా ఏడు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు కొట్టిపడేశాడు. ఇక లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 27 సగటుతో ఓ శతకం, రెండు అర్ధశతకాలు సాధించాడు. 333 పరుగులు చేశాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion