అన్వేషించండి

Womens T20 World Cup: టీ 20 ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియా ! టోర్నీ నుంచి పాక్ అవుట్ ?

India-W Vs Australia-W: మహిళల  టీ 20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా పాకిస్థాన్ పై ఘన విజయం సాధించి సత్తా చాటింది. దాదాపు సెమీస్ కు చేరువైంది.

Australia beat Pakistan with ease: మహిళల  టీ 20 ప్రపంచకప్(Womens T20 World Cup 2024) లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా(Australia జోరు కొనసాగుతోంది. ఛాంపియన్ ఆటతీరుతో అలరిస్తున్న కంగారు జట్టు... వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. పాకిస్థాన్(Pakistan) పై ఘన విజయం సాధించి సత్తా చాటింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా దాదాపు సెమీస్ కు చేరువైంది. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బంతితో పాక్ పని పట్టిన ఆస్ట్రేలియా.. తర్వాత బ్యాటుతోనూ రాణించి సునాయస విజయాన్ని సాధించింది. ఈ విజయం తర్వాత గ్రూప్ ఏలో కంగారు జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియా(India) రెండో స్థానంలో ఉంది.
 
 
పాక్ పోరాటం లేకుండానే..
పాకిస్థాన్ తో జరిగిన మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకుంది. ఆరంభం నుంచే కంగారు బౌలర్లు... పాక్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. పదునైన బంతులతో పరుగులు రాకుండా కట్టడి చేశారు. ఏ పాకిస్థాన్ బ్యాటర్ కనీసం 30 పరుగుల మార్కును కూడా దాటలేకపోయారు. 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పాక్.. ఆ తర్వాత వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఆష్లీ గార్డ్ నర్ నాలుగు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించింది. నాలుగు ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చిన గార్డ్ నర్... నాలుగు వికెట్లు తీసింది. అలియా రియాజ్ 26 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. మిగిలిన బ్యాటర్లు కనీసం 15 పరుగులు కూడా చేయలేదు. ఏడుగురు బ్యాటర్లు కనీసం రెండంకెల పరుగులు కూడా చేయలేదు. దీంతో పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 83 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారు జట్టు కేవలం ఒకే వికెట్ కోల్పోయి.. 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ అలీసా హెలీ 23 బంతుల్లోనే 37 పరుగులు చేసి కంగారుల విజయాన్ని తేలిక చేసేసింది. ఈ ఓటమితో పాకిస్థాన్ దాదాపుగా సెమీస్  రేసు నుంచి నిష్క్రమించింది. 
 
న్యూజిలాండ్ కు ప్రాణ సంకటం
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులు ఘోర ఓటమి ఏదుర్కొన్న న్యూజిలాండ్.. శ్రీలంకతో కీలక మ్యాచుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆడిన మూడు మ్యాచుల్లో పరాజయం పాలైన లంక సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. కానీ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలావల్సిన మ్యాచులో కివీస్ నేడు బరిలోకి దిగనుంది. లంకపై భారీ విజయం సాధించి మళ్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకాలని కివీస్ భావిస్తోంది. ఈ మ్యాచులో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని లంక చూస్తోంది. ప్రస్తుత ఫామ్ ను చూస్తే లంకపై న్యూజిలాండ్ గెలుపు అంత కష్టమేమీ కాదు. కానీ శ్రీలంక జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలీదు.ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టుకు లంక షాక్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి లంక సమష్టిగా రాణిస్తే కివీస్ ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Viral Video: 'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Pamban Rail Bridge: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
Embed widget