ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్స్ టేబుళ్లలో టీమిండియా టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ టెస్టు ఛాంపియన్ షిప్ ఎడిషన్‌లో భారత్ 11 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం భారత్ దగ్గర 98 పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టేబుల్‌లో పాయింట్స్ పర్సంటేజ్ మాత్రం 74.24గా ఉంది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా దగ్గర 90 పాయింట్లు ఉన్నాయి. 12 మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా ఎనిమిది విజయాలు సాధించింది. టెస్టు ఛాంపియన్ షిప్‌లో భారత్ రెండు సార్లు ఫైనల్ చేరినా గెలవలేకపోయింది. కనీసం ఈసారి అయినా గెలవాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆశపడుతున్నారు. 2025 జూన్ 11వ తేదీన ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో ఈ ఫైనల్ జరగనుంది.