భారత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
మూడు క్యాలెండర్ ఇయర్స్‌లో 40 సిక్సర్లు కొట్టిన మొదటి కెప్టెన్‌గా నిలిచాడు.
కేవలం భారత కెప్టెన్లలోనే కాదు... అంతర్జాతీయంగా కూడా ఈ ఫీట్ సాధించింది రోహితే.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్‌తో రోహిత్ 2024లో 40 సిక్సర్లు దాటాడు.
2022 సంవత్సరంలో రోహిత్ శర్మ 45 సిక్సర్లు కొట్టాడు.
2023లో ఊహకందని ఊచకోత కోస్తూ ఏకంగా 80 సిక్సర్లు బాదేశాడు.
ప్రపంచ క్రికెట్‌లో ఏ కెప్టెన్ కూడా ఇంతవరకు ఈ ఘనత సాధించలేదు.
రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా టీ20 వరల్డ్ కప్‌ను కూడా గెలుచుకుంది.
ధోని తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మనే.