బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఊహించని ఊచకోత కోసింది.
టెస్టుల్లో వేగంగా 50, 100, 150, 200, 250 పరుగులు సాధించిన జట్టుగా నిలిచింది.
కేవలం మూడు ఓవర్లలోనే 50 పరుగుల మార్కును టీమిండియా అందుకుంది.
10.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును టీమిండియా అందుకుంది.
18.2 ఓవర్లలోనే 150 పరుగుల మార్కును టీమిండియా అందుకుంది.
24.2 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును టీమిండియా అందుకుంది.
30.1 ఓవర్లలోనే 250 పరుగుల మార్కును టీమిండియా అందుకుంది.
కేవలం ఒక్క టెస్టులోనే టీమిండియా ఈ ఐదు రికార్డులను సాధించడం విశేషం.
బజ్‌బాల్ మెథడ్‌లో వేగంగా ఆడుతుందని ఇంగ్లండ్‌కు పేరుంది. కానీ ఇంగ్లండ్ వల్ల కూడా కానిది టీమిండియా చేసింది.