Aus vs Ind Final News: ఆస్ట్రేలియాను మోదీ అవమానించారా? కావాలనే ఇదంతా చేశారా? ట్రోఫీ ప్రజంటేషన్ సెర్మనీ పై వివాదం
Pat Cummins Alone: ఆరోసారి విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ట్రోఫీ ప్రజంటేషన్ సెర్మనీ పై వివాదం నెలకొంది.
భారత్ తో జరిగిన ఫైనల్ లో జయభేరి మోగించటం ద్వారా ఆస్ట్రేలియా ఆరోసారి సగర్వంగా వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రిచర్డ్ మార్లెస్ హాజరై విజేతలైన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు వరల్డ్ కప్ ను అందించారు.
ఇదే టైమ్ లో జరిగిన ఓ సన్నివేశంపై ఆస్ట్రేలియా మీడియా, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. సాధారణంగా వరల్డ్ కప్ లాంటివి అందుకున్న వెంటనే మిగిలిన టీమ్ అంతా స్టేజ్ మీదకు వెంటనే పరుగు పరుగున వచ్చేస్తుంది. ఆ తర్వాత కప్పును చూస్తూ వాళ్లంతా ఛాంపియన్ మూమెంట్స్ ను ఎంజాయ్ చేస్తారు.
కానీ ఆదివారం అలా జరగలేదు. ట్రోఫీని మోదీ అందించిన తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను అప్రిషియేట్ చేశారు. చాలా సేపు మాట్లాడారు. ఆ తర్వాత మోదీ, రిచర్డ్ మార్లెస్ ఇద్దరూ స్టేజ్ దిగి కిందకు వెళ్లారు. కానీ ఆస్ట్రేలియా టీమ్ ను మాత్రం స్టేజ్ మీదకు సెక్యూరిటీ పంపించలేదు. మోదీ పూర్తిగా ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయిన తర్వాతే టీమ్ ను స్టేజ్ మీదకు వదిలారు. అప్పటివరకూ కమిన్స్ అలా ఒంటరిగా నిలబడిపోయి తన టీమ్ కోసం చూస్తూ ఉన్నాడు.
Caption this .....pic.twitter.com/Wt9LjsDw9a
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 19, 2023
ఇది క్రీడా స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని..గెలిచిన జట్టు సంబరాలను ఓ రాజకీయనాయకుడి కోసం అలా అడ్డుకోవటం సరికాదంటూ ఆస్ట్రేలియా మీడియా, ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ప్రపంచకప్ ను ఇంత అద్భుతంగా హోస్ట్ చేసిన భారత్..ట్రోఫీ సెర్మనీ ని వరస్ట్ గా ప్లాన్ చేసిందని మండిపడుతున్నారు. అయితే దీనికి ఓ రీజన్ కూడా కనపడుతోంది.
2006 ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ లోనే జరిగింది. అప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న శరద్ పవార్..ఆస్ట్రేలియాకు ట్రోఫీని అందించారు. కానీ అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్ స్టేజ్ దిగిపోవాలని శరద్ పవార్ ను నెట్టిన ఘటన ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేదు. అలాంటిదే మోదీకి ఎదురుకావొచ్చని..ఆటగాళ్లు దూసుకురావటం...షాంపేన్ చిమ్మటం లాంటివి చేస్తారు కనుక సెక్యూరిటీ రీజన్స్ తో మోదీ వెళ్లే వరకూ టీమ్ సెలబ్రేషన్స్ ను సెక్యూరిటీ అడ్డుకుని ఉండొచ్చని మరో వెర్షన్ వినిపిస్తోంది. మొత్తంగా ఈ ట్రోఫీ ప్రజెంటేషన్ సెర్మనీ చుట్టూ ఓ వివాదం అయితే మొదలైంది.