Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వరల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగపాటు.. సత్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన ఆసీస్.. ప్రపంచ విజేతగా నిలిచింది. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండానే ఆసీస్ టోర్నీ విన్నర్ గా నిలవడం విశేషం.

AUS VS ENG W T20 World Cup Final Result Update: మహిళా టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా హవా కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో ఏడోసారి ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్ పై ఏక పక్షంగా జరిగిన ఫైనల్లో 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్ లో ఇంగ్లాండ్ పై కంగారులకిది నాలుగో ప్రపంచకప్ ఫైనల్ విజయం కావడం విశేషం. క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. నాట్ స్కీవర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్ (53 బంతుల్లో 58 నాటౌట్,5 ఫోర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచింది. అనంతరం ఛేజింగ్ ను కేవలం 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి, ఈజీగా పూర్తి చేసింది. వెటరన్ ప్లేయర్ బేత్ మూనీ స్టన్నింగ్ ఫిఫ్టీ (49 బంతుల్లో 64, 10 ఫోర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచింది. బౌలర్లలో ఎకిల్ స్టోన్, లారెన్ బెల్, డీన్ కు తలో వికెట్ దక్కింది. ప్రపంచకప్ ఫైనల్లో ఇదే అత్యధిక ఛేజ్ కావడం విశేషం. ఇక టీ20 ఫార్మాట్ లో ఇంగ్లాండ్ పై ఆసీస్ కిది నాలుగో ప్రపంచకప్ ఫైనల్ విజయం కావడం విశేషం. వన్డేల్లో మరో మూడుసార్లు ఇంగ్లాండ్ పై కంగారులూ గెలిచారు. ఇక ఈ టోర్నీలో అజేయంగా నిలిచి, కప్పును ఆసీస్ సొంతం చేసుకుంది.
Australia reign supreme once again to seal the Women's #T20WorldCup title in emphatic fashion 👏
— T20 World Cup (@T20WorldCup) July 5, 2026
📝: https://t.co/qtC3GGwbCM pic.twitter.com/UkfJxkEhbL
ఆరంభంలోనే షాక్..
ఓ మాదిరి టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసీస్ కు రెండో ఓవర్లోనే దెబ్బ తగలింది. ఫామ్ కోల్పోయిన ఓపెనర్ జార్జియా వాల్ (9)ను లారెన్ బెల్ పెవిలియన్ కు పంపింది. అయితే ఆ దశలో మూనీ.. తన క్లాస్ ను చూపించింది. అనుభవన్నంతా రంగరించుకుని, అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. వన్ డౌన్ బ్యాటర్ ఫోబ్ లీచ్ ఫీల్డ్ (35 బంతుల్లో 48, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి ఆతిథ్య బౌలర్లను ఎదుర్కొంది. చకచకా పరుగులు సాధిస్తూ, ఒత్తిడి నెలకుండా చూసింది. వేగంగా స్ట్రైక్ రొటేట్ చేయడంతోపాటు కొన్ని రిస్కీ షాట్లు ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించింది.
విన్నింగ్ పార్ట్నర్ షిప్..
క్రీజులో కుదురుకున్నాక మూనీ- లీచ్ ఫీల్డ్ జంట అదరగొట్టింది. రెండో వికెట్ కు 59 బంతుల్లోనే సరిగ్గా వంద పరుగులును జోడించింది. దీంతో మ్యాచ్ ఇంగ్లాండ్ నుంచి చేజారి పోయింది. ఈ క్రమంలో 38 బంతుల్లో మూనీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు ఫిఫ్టీకి చేరువైన లీచ్ ఫీల్డ్ ను డీన్ పెవిలియన్ కు పంపింది. కాసేపటికే మూనీ వెనుదిరిగినా, ఎలీస్ పెర్రీ (13 నాటౌట్), యాష్లీ గార్డెనర్ (3 నాటౌట్) తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. దీంతో రికార్డు స్థాయిలో ఆసీస్ ఏడోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. ఇక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ ఒక ప్రపంచకప్ ఫైనల్లో ఒడిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. అద్భుతమైన ఫిఫ్టీతో సత్తా చాటిన మూనీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డులు దక్కాయి.
ట్రెండింగ్ వార్తలు



















