News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Rohit Sharma: మతిమరుపు కెప్టెన్ - హిట్‌మ్యాన్ విషయంలో కోహ్లీ చెప్పింది కరెక్టే!

టీమిండియా సారథి రోహిత్ శర్మకు మతిమరుపు ఉందా..? కీలక వస్తువులను వదిలేసుకోవడంలో భారత జట్టులో అతడి తర్వాతే ఎవరైనా...

FOLLOW US: 
Share:

Rohit Sharma:  ఆసియా కప్ గెలిచిన ఆనందంలో రోహిత్ శర్మ తన వీక్‌నెస్‌ను మరోసారి బయటపెట్టుకున్నాడు. లంకపై ఏకపక్ష విజయం సాధించిన తర్వాత కొలంబో నుంచి ముంబై బయల్దేరేందుకు అక్కడ్నుంచి బయల్దేరిన హిట్‌మ్యాన్ ఎప్పటిలాగానే   మతిమరుపుతో ఇబ్బందిపడ్డాడు. కొలంబోలోని హోటల్ రూమ్‌లోనే తన పాస్‌పోర్టును మరిచిపోయాడు.  ఈ విషయాన్ని టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గతంలోనే వెల్లడించాడు.  

2017లో విరాట్ కోహ్లీ ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ కపూర్ షో లో మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మ మరిచిపోయినన్ని థింగ్స్ (వస్తువులు)  ఎవరూ మరిచిపోయారు.  ఒక్కటని కాదు.. ఐపాడ్, ఫోన్, వాలెట్ వంటివి చాలాసార్లు మరిచిపోయాడు. రెండు మూడు సార్లు అయితే  హోటల్ రూమ్‌లోనే ఏకంగా పాస్‌పోర్ట్‌ను కూడా మరిచిపోయాడు. దానిని వెతికిపట్టుకోవడానికి మాకు తలప్రాణం తోకకు వచ్చింది. చిన్నచిన్న వస్తువులు, డైలీ యూజ్ చేసే వాటి గురించి రోహిత్ అస్సలు పట్టించుకోడు..’ అని  కోహ్లీ వ్యాఖ్యానించాడు. తాజాగా లంక నుంచి భారత్ తిరిగివస్తుండగా రోహిత్   తన పాస్‌పోర్టును మరిచిపోవడంతో కోహ్లీ వీడియో వైరల్ అయింది. 

పాస్‌పోర్ట్ మరిచిపోయిన రోహిత్..  బస్ ‌లోనే ఉండి వెంటనే  హోటల్ గదిలోకి  సపోర్ట్ స్టాఫ్‌ను పంపి  దానిని తీసుకొచ్చుకున్నాడు.  రోహిత్ వల్ల బస్ కూడా ఆపాల్సి వచ్చింది.  రోహిత్ పాస్‌పోర్ట్ మరిచిపోయిన విషయాన్ని  తెలిసిన భారత క్రికెటర్లు  హిట్‌మ్యాన్‌ను  ట్రోల్ చేశారు.

ఇక భారత్ -  శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ విషయానికొస్తే..  టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ తీసుకుంది. కానీ వారి నిర్ణయం తప్పని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్ విశ్వరూపంతో లంక.. 15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 6.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (27: 19 బంతుల్లో, ఆరు ఫోర్లు), ఇషాన్ కిషన్ (23: 18 బంతుల్లో, మూడు ఫోర్లు) వికెట్ పడనివ్వకుండానే టార్గెట్ ఫినిష్ చేశారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 18 Sep 2023 02:49 PM (IST) Tags: Virat Kohli Rohit Sharma IND vs SL Asia Cup viral video Asia Cup 2023

ఇవి కూడా చూడండి

Ind vs Aus 3rd odi: రోహిత్‌ వచ్చేశాడు! టాస్ గెలిచిన ఆసీస్‌

Ind vs Aus 3rd odi: రోహిత్‌ వచ్చేశాడు! టాస్ గెలిచిన ఆసీస్‌

IND Vs AUS, 3rd ODI: ఆఖరి ఆట అదరాలి! - క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను - పరువు కోసం ఆసీస్ పాకులాట

IND Vs AUS, 3rd ODI: ఆఖరి ఆట అదరాలి! - క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను - పరువు కోసం ఆసీస్ పాకులాట

ODI World Cup 2023: ఐదు మ్యాచ్‌లే ఆడతా, అలా అయితే రాజీనామా చేస్తా! - బంగ్లా జట్టులో షకిబ్ వర్సెస్ తమీమ్

ODI World Cup 2023: ఐదు మ్యాచ్‌లే ఆడతా, అలా అయితే రాజీనామా చేస్తా! - బంగ్లా జట్టులో షకిబ్ వర్సెస్ తమీమ్

ODI World Cup 2023: సరే రండి! - పాక్ క్రికెట్ టీమ్‌‌కు వీసాలు మంజూరుచేసిన భారత్ - హైదరాబాద్‌కు పాక్ జట్టు

ODI World Cup 2023: సరే రండి! - పాక్ క్రికెట్ టీమ్‌‌కు వీసాలు మంజూరుచేసిన భారత్ - హైదరాబాద్‌కు పాక్ జట్టు

ODI World Cup 2023: కపిల్ దేవ్ కిడ్నాప్ కథ సుఖాంతం - ఎందుకోసమంటే!

ODI World Cup 2023: కపిల్ దేవ్ కిడ్నాప్ కథ సుఖాంతం - ఎందుకోసమంటే!

టాప్ స్టోరీస్

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్‌లో

Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

Ram Skanda Movie : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, నేడే చివరి రోజు - సభ ముందుకు కీలక బిల్లులు