Asia Cup 2023 Points Table: సూపర్ 4 టీమ్స్ కన్ఫమ్ - మళ్లీ భారత్, పాక్ పోరు ఎప్పుడంటే!
శ్రీలంక - అఫ్గాన్ మధ్య ఉత్కంఠగా ముగిసిన పోరులో అఫ్గానిస్తాన్ నిష్క్రమించడంతో ఆసియా కప్ రెండో దశ పోటీలలో పాల్గొనే జట్లు, షెడ్యూల్‌పై ఓ స్పష్టత వచ్చింది. ఆ వివరాలు మీకోసం..
Asia Cup 2023 Points Table: ఏకపక్ష మ్యాచ్‌లు, వర్షం కారణంగా చప్పగా సాగుతున్న ఆసియా కప్‌కు మంగళవారం శ్రీలంక - అఫ్గానిస్తాన్ మ్యాచ్ ఉత్కంఠగా ముగిసింది. శ్రీలంక గెలిచి సూపర్ - 4కు అర్హత సాధించినా అఫ్గాన్ పోరాటం కొన్ని ఏండ్ల పాటు గుర్తుంటుంది. తృటిలో గెలుపుతో పాటు సూపర్-4 ఛాన్స్ కూడా కోల్పోయిన అఫ్గాన్ నిష్క్రమణతో ఆసియా కప్ రెండో దశ పోటీలలో పాల్గొనే జట్లు, షెడ్యూల్‌పై ఓ స్పష్టత వచ్చింది. ఆ వివరాలు మీకోసం..
లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా అత్యంత ఆసక్తిగా ముగిసిన శ్రీలంక - అఫ్గానిస్తాన్ మ్యాచ్ లో అఫ్గాన్‌ను రెండు పరుగుల తేడాతో ఓడించడంతో లంక జట్టు గ్రూప్ - బి నుంచి అగ్రస్థానం సంపాదించి సూపర్ - 4కు ముందంజ వేసింది. ఇదే గ్రూప్ నుంచి రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ కూడా అర్హత సాధించింది. గ్రూప్ - ఎ నుంచి పాకిస్తాన్, భారత్ ఇదివరకే క్వాలిఫై అయ్యాయి. నేపాల్ నిష్క్రమించింది.
సూపర్ -4కు అర్హత సాధించిన జట్లు..
గ్రూప్ - ఎ : పాకిస్తాన్, భారత్
గ్రూప్ - బి : శ్రీలంక, బంగ్లాదేశ్
సూపర్ - 4 షెడ్యూల్..
నేటి నుంచి మొదలుకాబోయే రెండో దశలో తొలి మ్యాచ్ గ్రూప్ - ఎలో ఎ1గా ఉన్న పాకిస్తాన్.. గ్రూప్-బిలో బి2గా ఉన్న బంగ్లాదేశ్‌ను ఢీకొననుంది. గ్రూప్ స్టేజ్‌లో గత శనివారం భారత్ -పాకిస్తాన్ మధ్య వర్షం కారణంగా అర్థాంతరంగా ముగిసిన మ్యాచ్‌తో నిరాశచెందిన అభిమానులకు మరోసారి దాయాదుల పోరును చూడొచ్చు. ఈనెల 10న ఇరు జట్ల మధ్య మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. అయితే ఆసియాకప్ ఆతిథ్య దేశంగా ఉన్న పాకిస్తాన్‌లో ఇదే ఆఖరు మ్యాచ్. పాక్ - బంగ్లా తర్వాత టోర్నీ పూర్తిగా శ్రీలంకలోనే జరుగుతుంది. షెడ్యూల్ కింది విధంగా ఉంది.
సెప్టెంబర్ 6 : పాకిస్తాన్ - బంగ్లాదేశ్ - లాహోర్
సెప్టెంబర్ 9 : శ్రీలంక - బంగ్లాదేశ్ - కొలంబో (ప్రేమదాస స్టేడియం)
సెప్టెంబర్ 10 : పాకిస్తాన్ - ఇండియా - కొలంబో
సెప్టెంబర్ 12 : ఇండియా - శ్రీలంక - కొలంబో
సెప్టెంబర్ 14 : పాకిస్తాన్ - శ్రీలంక - కొలంబో
సెప్టెంబర్ 15 : ఇండియా - బంగ్లాదేశ్ - కొలంబో
సెప్టెంబర్ 17 : ఫైనల్ - కొలంబో
* మ్యాచ్‌లు అన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతాయి.
(భారత్ - పాక్‌లు ఫైనల్‌కు అర్హత సాధిస్తే దాయాదుల పోరును సెప్టెంబర్ 17న కూడా చూసే అవకాశం ఉంది)
Schedule of Super 4 matches in Asia Cup 2023:
— Johns. (@CricCrazyJohns) September 6, 2023
Sept 6 - PAK vs BAN
Sept 9 - SL vs BAN
Sept 10 - IND vs PAK
Sept 12 - IND vs SL
Sept 14 - PAK vs SL
Sept 15 - IND vs BAN
Which teams will play in the finals of the Asia Cup? pic.twitter.com/tmgOLmaBys
ఇదిలాఉండగా.. కొలంబోలో వర్షాల నేపథ్యంలో మ్యాచ్‌లను అక్కడ్నుంచి హంబన్‌టోటాకు మారనున్నట్టు సమాచారం. అయితే దీనిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఇంకా అధికారిక ప్రకటన వెలువరించలేదు.
- ఆసియా కప్ మ్యాచ్‌ల లైవ్ ప్రసారాలను టెలివిజన్‌లో అయితే స్టార్ నెట్‌వర్క్ లోని ఛానెళ్లలో చూడొచ్చు. మొబైల్స్‌లో డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో ఉచితంగానే వీక్షించొచ్చు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial