అన్వేషించండి

BAN vs SL, Highlights: ఉత్కంఠ పోరులో బంగ్లాపై విజయం - సూపర్-4 కు లంక

Asia Cup 2022, BAN vs SL: ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. ఈ విజయంతో శ్రీలంక సూపర్- 4 కు అర్హత సాధించింది.

ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో లంక గెలిచింది. ఈ విజయంతో శ్రీలంక సూపర్- 4 కు అర్హత సాధించింది. ఆడిన రెండు గేమ్ లలో ఓడిన బంగ్లా ఇంటిబాట పట్టింది. 

మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆఫిఫ్ హొస్సేన్ 39 పరుగులు, హసన్ మిరాజ్ 38 పరుగులతో రాణించారు. షకీబుల్ హసన్ (24), మహ్మదుల్లా (27), మొసద్దిక్ హొస్సేన్(24) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగ, చమిక కరుణరత్నే రెండేసి వికెట్లు పడగొట్టారు. మదుశంక, మహేశ్ తీక్షణ, అషిత ఫెర్నాండో ఒక్కో వికెట్ తీశారు. 

184 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు నిశాంక, కుశాల్ మెండిస్ శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్ కు 45 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో లంక నిశాంక, వన్ డౌన్ బ్యాటర్ చరిత్ అసలంక వికెట్లు కోల్పోయింది. అయితే మెండిస్ మాత్రం బంగ్లా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. కేవలం 37 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు.  అయితే మిగిలిన బ్యాట్స్ మెన్ అంతగా రాణించలేకపోవటంతో లంక కష్టాల్లో పడింది. చివర్లో దసున్ శనక 45 పరుగులతో జట్టును విజయానికి చేరువ చేశాడు. 17వ ఓవర్లో అతను ఔటయ్యాడు. 

చివర్లో ఉత్కంఠ

చివరి 2 ఓవర్లలో విజయానికి 25 పరుగులు అవసరమైన వేళ లంక మ్యాచ్ గెలవడం కష్టమే అనిపించింది. అయితే 19వ ఓవర్లో ఒక వికెట్ కోల్పోయిన లంక 17 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో 8 పరుగులు చేయాల్సిరాగా తొలి బంతికి ఒక పరుగు వచ్చింది. రెండో బంతికి ఫెర్నాండో ఫోర్ కొట్టాడు. మూడో బంతికి నో బాల్ సహా 3 పరుగులు రావటంతో లంకను విజయం వరించింది. బంగ్లా బౌలర్లలో హొస్సేన్ 3 వికెట్లతో రాణించాడు. 

ఈ విజయంతో శ్రీలంక సూపర్- 4 లో అడుగుపెట్టింది. గ్రూప్- బీ నుంచి ఇప్పటికే అఫ్ఘనిస్థాన్ సూపర్- 4 కు క్వాలిఫై అయ్యింది. గ్రూప్- ఏ నుంచి భారత్ సూపర్- 4 కు చేరుకుంది. ఇంక పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఎవరు క్వాలిఫై అవుతారో తెలియాల్సి ఉంది. 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
T Rajaiah vs Kadiyam: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Embed widget