Asia cup 2022: టీమిండియా డ్రెస్సింగ్ రూంలో హాంకాంగ్ ఆటగాళ్లు.. ఎందుకొచ్చారంటే?
Asia cup 2022, India vs Hongkong :హాంకాంగ్ టీం భారత డ్రెస్సింగ్ రూం సందర్శనకు వచ్చింది. కరచాలనాలు, సంభాషణలు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు ఇలా ఎన్నో దృశ్యాలు అక్కడ ఆకట్టుకున్నాయి.
Asia cup 2022, India vs Hongkong : టీమిండియా డ్రెస్సింగ్ రూములో గురువారం కొన్ని అద్భుతమైన దృశ్యాలు దర్శనమిచ్చాయి. హాంకాంగ్ టీం భారత డ్రెస్సింగ్ రూం సందర్శనకు వచ్చింది. అక్కడ గుర్తుంచుకునే సంభాషణలు, ఆటకు సంబంధించిన పాఠాలు, మరపురాని ముచ్చట్లు ఇలా ఎన్నో జ్ఞాపకాలు పోగుపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పంచుకుంది.
హాంకాంగ్ ఆటగాళ్లు భారత ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించారు. సెల్ఫీలు దిగారు. ఆటోగ్రాఫ్ లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఒకరితో ఒకరు ఆత్మీయంగా సంభాషించుకున్నారు. ఇలా ఎన్నో జ్ఞాపకాలను ప్రోది చేసుకున్నారు.
ఇంతకుముందు విరాట్ కోహ్లీకి హాంకాంగ్ టీం మొత్తం మంచి బహుమతిని ఇచ్చింది. తమ జట్టు సభ్యులందరూ సంతకాలు చేసిన జెర్సీని కోహ్లీకి కానుకగా ఇచ్చారు. కోహ్లీ ఒక తరానికి స్ఫూర్తిగా నిలిచాడని.. ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటామని ఆ జెర్సీపై రాశారు. అలాగే రాబోయే రోజులు అద్భుతంగా ఉంటాయంటూ సందేశాన్ని చేర్చారు. దీనిపై విరాట్ స్పందిస్తూ.. హాంకాంగ్ క్రికెట్ కు ధన్యవాదాలు తెలిపాడు. ఇలాంటి బహుమతి అందుకోవడం ప్రత్యేకమని అన్నాడు.
Such a heartwarming Gesture from the Hong Kong team ❤️#ViratKohli #INDvsHK #IndvsHkg pic.twitter.com/bQfuBeEasT
— Shivangi Singh (@Shivang72708448) September 1, 2022
ఆసియా కప్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో హాంకాంగ్ పై భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 192 పరుగులు చేయగా.. ఛేదనలో హాంకాంగ్ 152 పరుగులకే పరిమితమైంది.
Conversations to remember, memories to cherish and lessons for the taking! 👍 👍
— BCCI (@BCCI) September 1, 2022
Wholesome scenes in the #TeamIndia dressing room when Team Hong Kong came visiting. 👏 👏#AsiaCup2022 | #INDvHK pic.twitter.com/GbwoLpvxlZ