By: ABP Desam | Updated at : 06 Sep 2022 01:49 PM (IST)
Edited By: nagavarapu
విరాట్ కోహ్లీ (Photo Credit: Twitter)
Asia Cup 2022: ఆసియా కప్ 2022లో మొదటి 3 మ్యాచ్ లలో చూపిన ఫామ్ ను భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగించాలని గౌతం గంభీర్ అన్నాడు. నెల రోజుల విరామం తర్వాత బ్యాట్ పట్టిన విరాట్ బాగా ఆడుతున్నాడని ప్రశంసించాడు. లీగ్ దశ 2 మ్యాచుల్లో, సూపర్- 4 లో పాక్ తో మ్యాచులో కోహ్లీ జట్టు కోసం విలువైన పరుగులు సాధించాడు.
లీగ్ దశ మొదటి మ్యాచ్ లో 34 బంతుల్లో 35 పరుగులు చేసిన కోహ్లీ, హాంకాంగ్ తో మ్యాచ్ లో అర్థశతకం సాధించాడు. సూపర్- 4 లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో మిగతా బ్యాటర్లు విఫలమైనా 44 బంతుల్లో 60 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. కోహ్లీ ఆటపై గౌతం గంభీర్ స్టార్ స్పోర్ట్ ఛానల్ తో మాట్లాడాడు.
కోహ్లీ ఫామ్ భారత్ కు ప్లస్ అవుతుంది
విరాట్ కోహ్లీ ప్రస్తుతం మంచి టచ్ లో కనిపిస్తున్నాడని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. మొదటి రెండు మ్యాచుల్లో చేసిన పరుగులతో అతని ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు. దాంతో పాకిస్థాన్ తో మ్యాచ్ లో బాగా ఆడాడని ప్రశంసించాడు. రోహిత్, రాహుల్ బాగా ఆడారని.. అలాగే కుర్రాళ్లయిన హుడా, పంత్ ఆకట్టుకున్నారని అన్నాడు. అయితే కోహ్లీ ఇంకా బాగా పరుగులు చేశాడని అభినందించాడు. ఇదే ఫాంను కొనసాగించాలని ఆకాంక్షించాడు. విరాట్ ఫాం టీ20 ప్రపంచకప్ లో భారత్ కు పెద్ద సానుకూలాంశంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు.
పూర్తిస్థాయి జట్టుంటే మెరుగైన ప్రదర్శన
భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ భారత జట్టు ప్రదర్శనపై మాట్లాడాడు. రోహిత్ శర్మ జట్టును చాలా బాాగా నడిపిస్తున్నాడని అభిప్రాయపడ్డాడు. తనకు పూర్తిస్థాయి జట్టు అందుబాటులో ఉన్నప్పుడు మరింత బాగా నాయకత్వం చేయగలడని రోహిత్ కెప్టెన్సీని మెచ్చుకున్నాడు. బుమ్రా, హర్షల్ పటేల్ లాంటి ఆటగాళ్లు జట్టుతో చేరినప్పుడు భారత్ ఇంకా మెరుగైన ప్రదర్శన చేస్తుందన్నాడు.
A #TeamIndia performance that gave us plenty of reasons to #BelieveInBlue despite the defeat!@IrfanPathan & @GautamGambhir 🔎 the positives in the #GreatestRivalry Round 2.#INDvPAK | DP World #AsiaCup2022 pic.twitter.com/Rb9BHEuFX1
— Star Sports (@StarSportsIndia) September 5, 2022
32 T20I fifties for Virat Kohli 👏
— ICC (@ICC) September 5, 2022
Read More 👉 https://t.co/aAlFic3Vvy pic.twitter.com/ZWfDyLMSN9
Also Read: Suresh Raina Retirement: క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై, సోషల్ మీడియాలో కీలక ప్రకటన
Also Read: Team India Main Problem: టీమిండియాకు లెఫ్ట్ సమస్య - ఆ నలుగురే ఆప్షన్!
ODI World Cup 2023 : వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసింది వీళ్లే - టాప్-5లో ఇద్దరూ మనోళ్లే
Nortje-Magala Ruled Out: తలచినదే జరిగినది! - సఫారీ జట్టుకు వరుస షాకులు
ODI World Cup 2023: నెదర్లాండ్స్ టీమ్‌కు నెట్ బౌలర్‌గా స్విగ్గీ డెలివరీ బాయ్ - పెద్ద ప్లానింగే!
Asian Games 2023: వర్షంతో మ్యాచ్ రద్దు - సెమీస్‌కు చేరిన భారత్ - పతకం పక్కా
ODI World Cup 2023: ఆ నలుగురు - వరల్డ్ కప్‌లో ఈ యంగ్ స్టార్స్ మీదే కళ్లన్నీ!
TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టైఫాయిడ్‌తో రిమాండ్ ఖైదీ మృతి- చంద్రబాబు భద్రతపై లోకేష్ అనుమానం
Kalki 2898 AD Movie: షేర్ చేస్తే చర్యలే, లీకు వీరులకు వైజయంతి మూవీస్ సీరియస్ వార్నింగ్
Ayyanna : జనసేనతో పొత్తు కోసం త్యాగానికి రెడీ - పోలీసుల తీరుపై అయ్యన్న కీలక వ్యాఖ్యలు !
/body>