అన్వేషించండి

Ashes 2023: నాటో సమ్మిట్‌లో యాషెస్ లొల్లి - ట్రోల్ చేసుకున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్రధానులు

ENG vs AUS: పలు వివాదాలతో యాషెస్ ఊహించినదానికంటే సూపర్ సక్సెస్ అవుతున్నది. తాజాగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా ప్రధానులూ యాషెస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు.

Ashes 2023: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న  యాషెస్ సిరీస్ రసవత్తరంగా సాగుతున్న  విషయం తెలిసిందే. మూడు టెస్టులు ముగిసిన ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ మొదలైనప్పట్నుంచి ఏదో ఒక వివాదంలో చర్చలో ఉంటుంది.  స్టీవ్ స్మిత్ క్యాచ్, జానీ బెయిర్ స్టో రనౌట్,  లార్డ్స్‌లో మెరిల్‌బోన్ క్రికెట్  క్లబ్ (ఎంసీసీ) సభ్యులే  ఆసీస్ ఆటగాళ్లపై వ్యవహరించిన తీరు, క్రీడా స్ఫూర్తి.. ఇలా పలు వివాదాలతో యాషెస్ ఊహించినదానికంటే సూపర్ సక్సెస్ అవుతున్నది. తాజాగా  ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా ప్రధానులు కూడా యాషెస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. అది కూడా ఓ అంతర్జాతీయ సమావేశంలో కావడం గమనార్హం. 

లిథుయానియా లోని విల్నియస్ నగరంలో రెండ్రోజుల పాటు జరిగిన నాటో సమ్మిట్‌లో భాగంగా యూకే ప్రధాని రిషి సునక్, ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ కూడా  పాల్గొన్నారు. ఈ ఇద్దరి చర్చకు సంబంధించి  అల్బనీస్  ట్వీట్ చేస్తూ.. ‘నాటో సమ్మిట్‌లో భాగంగా  రిషి సునక్‌తో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూఎస్ఎ (AUKUS) తో పాటు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, ఆర్థిక సవాళ్లు, అలాగే ఆస్ట్రేలియా - యూకే వాణిజ్య ఒప్పందం గురించి చర్చించా..‘ అని ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. 

ఇదే ట్వీట్‌లో కింద.. ‘అఫ్‌కోర్స్.. మేం యాషెస్ గురించి కూడా చర్చించుకున్నాం’అని ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.   వీడియోలో అల్బనీస్.. ఆయన వెంట తెచ్చుకున్న ఫైల్స్  నుంచి యాషెస్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యంలో (2-1) ఉందన్న  విషయాన్ని సూచిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.  దీనికి కౌంటర్‌గా రిషి సునక్ కూడా.. ‘లీడ్స్‌లో మేం గెలిచాం’అన్నట్టుగా  క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ విన్నింగ్ మూమెంట్ ఫోటోను  పట్టుకున్నారు.  దీంతో వెంటగనే ఆసీస్ పీఎం..  రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో ఔటైన ఫోటోను  చూపించారు. దీనికి సునక్  నవ్వుతూ.. ‘అరరె.. నేను సాండ్‌పేపర్ గేట్ ఫోటో తీసుకురావడం మరిచిపోయాను’అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 

 

కాగా యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ టెస్టు ముగిసిన తర్వాత  బెయిర్ స్టో రనౌట్ వివాదంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. బెయిర్ స్టో ఔట్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఇంగ్లాండ్ వాదించగా.. లేదు, లేదు అది నిబంధనల్లోనే ఉందని  ఆస్ట్రేలియా   కౌంటర్ ఇచ్చింది. ఈ చర్చ ఆస్ట్రేలియా పత్రికల్లో ఇంగ్లాండ్ సారథిని, ఆ జట్టుపై కార్టూన్లు వేసి కౌంటర్లు వేసేదాకా వెళ్లింది. అప్పుడు కూడా రిషి సునక్, అల్బనీస్‌లు స్పందించిన విషయం తెలిసిందే.   

సాండ్‌పేపర్ గేట్ అంటే.. 

ఇక సాండ్‌పేపర్ గేట్ విషయానికొస్తే.. 2018లో  దక్షిణాఫ్రికాతో జోహన్నస్‌బర్గ్ వేదికగా  జరిగిన టెస్టు సందర్భంగా  ఆసీస్ ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ బంతిని  సాండ్‌పేపర్ ముక్కతో రుద్దడం వివాదాస్పదమైంది. కామెరూన్‌ను అలా ప్రోత్సహించింది అప్పటి ఆసీస్  కెప్టెన్, వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లే అని తేలింది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా..  బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించింది.  వార్నర్, స్మిత్ ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నారు. నిషేధం తర్వాత స్మిత్.. విలేకరుల సమావేశంలో కన్నీరుమున్నీరయ్యాడు.  ఇటీవల లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లీష్ జట్టు ఫ్యాన్స్ కొంతమంది  స్మిత్ ఏడుస్తున్న ఫేస్ మాస్కులను ధరించి  అతడిని టీజ్ చేసిన విషయం తెలిసిందే. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget