By: ABP Desam | Updated at : 21 Jun 2023 09:50 AM (IST)
ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ( Image Source : Twitter )
Ashes Series 2023: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్‌కు ఆస్ట్రేలియా షాకిచ్చింది. 280 పరుగుల లక్ష్యంతో ఐదో రోజు బరిలోకి దిగిన కంగారూలు.. ఆట ఆఖరుదాకా పోరాడి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (197 బంతుల్లో 65, 7 ఫోర్లు) నిలకడకు తోడు ఆఖర్లో సారథి పాట్ కమిన్స్ (73 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నాథన్ లియాన్ (28 బంతుల్లో16 నాటౌట్, 2 ఫోర్లు) ల పోరాటంతో మరో నాలుగు ఓవర్ల ఆట మిగిలుండగానే కంగారూలు చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. విజయానికి 53 పరగుల దూరంలో ప్రధాన బ్యాటర్లందరూ నిష్క్రమించినా కమిన్స్, లియాన్‌లు ఓ చిన్నపాటి యుద్ధమే చేసి తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంతో నిలిచింది.
ఆసీస్ ఎదురీత..
ఇంగ్లాండ్ నిర్దేశించిన 280 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఓవర్ నైట్ స్కోరు 107-3తో ఐదో రోజు ఆరంభించిన ఆసీస్‌కు ఏదీ కలిసిరాలేదు. బర్మింగ్‌హోమ్‌లో ఉదయం వర్షం కారణంగా ఫస్ట్ సెషన్ తుడిచిపెట్టుకుపోయింది. లంచ్ తర్వాత ఆట మొదలుకాగా ఆసీస్ లక్ష్యం 67 ఓవర్లలో 174 పరుగులు ఛేదంచాల్సిందిగా వచ్చింది. ఓవర్ నైట్ బ్యాటర్ స్కాట్ బొలాండ్ (40 బంతుల్లో 20, 2 ఫోర్లు) కలిసి ఉస్మాన్ ఖవాజా ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 32 పరుగులు జోడించారు. అయితే ఆట నాలుగో రోజు లబూషేన్, స్మిత్‌లను ఔట్ చేసిన బ్రాడ్.. బొలాండ్‌ను ఔట్ చేయడంతో ఆసీస్ వికెట్ల పతనం మొదలైంది. కంగారూలు భారీ ఆశలు పెట్టుకున్న ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 16, 3 ఫోర్లు) ను మోయిన్ అలీ మరోసారి బోల్తా కొట్టించాడు. అతడు స్లిప్స్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఖవాజాతో కలిసి కాసేపు ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించిన కామెరూన్ గ్రీన్ (66 బంతుల్లో 28, 2 ఫోర్లు)ను రాబిన్సన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
సహచర ఆటగాళ్లు నిష్క్రమిస్తున్నా పట్టుదలతో 197 బంతులు ఆడి 65 పరుగులు చేసిన ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసేందుకు బెన్ స్టోక్స్ రంగంలోకి దిగాడు. అతడు వేసిన 72వ ఓవర్లో ఆఖరి బంతికి ఖవాజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికీ ఆసీస్ స్కోరు 209-7. విజయానికి మరో 71 పరుగులు కావాలి.
కమిన్స్ ఖతర్నాక్..
అలెక్స్ కేరీ (50 బంతుల్లో 20, 2 ఫోర్లు) తో పాటు పాట్ కమిన్స్ కూడా క్రీజులో ఉండటంతో ఆసీస్ విజయంపై ధీమాగానే ఉంది. కానీ కేరీని జో రూట్ తన స్పిన్ ఉచ్చులో బంధించాడు. 227 పరుగుల వద్ద ఆసీస్ 8వ వికెట్ కోల్పోయింది. అప్పుడు ఆసీస్ సారథి కమిన్స్.. తన అనుభవన్నంతా రంగరించి క్రీజులో నిలిచాడు. బెన్ స్టోక్స్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగిస్తున్నా నిలబడ్డాడు. రాబిన్సన్, బ్రాడ్, రూట్, స్టోక్స్.. బౌలర్లు మారినా కమిన్స్ మాత్రం క్రీజులో పెవిలియన్ పోసినట్టుగా అతుక్కుపోయాడు. అలా అని డ్రా కోసం ఆడలేదు. జో రూట్ వేసిన 83వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. నాథన్ లియాన్ ను మరో ఎండ్‌లో నిలబెట్టి ఆసీస్‌ను గెలుపు దిశగా నడిపించాడు.
ఇద్దరూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో లక్ష్యం కరుగుతూ పోయింది. ఒక్కో పరుగు కూడబెట్టుకుంటూ చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ సాగిన కమిన్స్ - లియాన్ పోరాటం కచ్చితంగా చాలాకాలం పాటు గుర్తుంటుంది. 8 వికెట్లు పడగొట్టిన ఇంగ్లాండ్ బౌలర్లు.. కంగారూల తోకను కత్తిరించకపోవడం గమనార్హం.
సంక్షిప్త స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 393-8 డిక్లేర్డ్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 386 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 273 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 282-8
ఫలితం : రెండు వికెట్ల తేడాతో ఆసీస్ విజయం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Team India: దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారత్ , ఘన స్వాగతం పలికిన అభిమానులు
Mushfiqur Rahim: అలా జరిగిపోయిందంతే , కావాలని చేతితో బంతిని ఆపలేదు
Rishabh Pant: ఐపీఎల్ బరిలో రిషభ్ పంత్ , తీవ్రంగా శ్రమిస్తున్న స్టార్
Brian Lara : రాసిపెట్టుకోండి... గిల్ ఒక్కడికే సాధ్యం, లారా ప్రశంసల జల్లు
BAN vs NZ, 2nd Test: తొలి రోజే నేలకూలిన 15 వికెట్లు , ఆసక్తికరంగా బంగ్లా-కివీస్ రెండో టెస్ట్
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
/body>