News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AUS vs ENG 4th Test: ఇంగ్లాండ్ విజయానికి వరుణుడి అడ్డంకి - లబూషేన్ పోరాటంతో గట్టెక్కిన ఆసీస్

నాలుగో టెస్టును నాలుగో రోజే ముగించి యాషెస్ సిరీస్‌ను 2-2తో సమం చేయాలన్న ఇంగ్లాండ్ దూకుడుకు వరుణుడు అడ్డుకట్ట వేశాడు.

FOLLOW US: 
Share:

AUS vs ENG 4th Test: స్వదేశంలో  ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్  నాలుగో టెస్టును నాలుగు రోజుల్లోనే ముగించి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని భావించిన ఇంగ్లాండ్ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.  మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో  భాగంగా ఆట నాలుగో రోజు వరుణుడు అడ్డుకోవడం ఇంగ్లాండ్‌కు చికాకు తెప్పించింది.  వరుణుడి స్పెషల్ అప్పీయరెన్స్‌కు తోడు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబూషేన్ (173 బంతుల్లో  111, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో విసిగించి ఇంగ్లాండ్‌ విజయాన్ని అడ్డుకున్నాడు. 

ఓవర్ నైట్ స్కోరు  113-4తో  నాలుగో రోజు ఆట ఆరంభం కావాల్సి ఉండగా మాంచెస్టర్‌లో తొలి మూడు రోజులు ఆటను అడ్డుకోని వరుణుడు నాలుగో రోజు మాత్రం ఆసీస్‌కు అండగా నిలిచాడు. వర్షం కారణంగా   తొలి సెషన్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.  

వర్షం  కాస్త తెరిపినివ్వడంతో లంచ్ తర్వాత ఆట ఆరంభమైంది. 44 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ స్టార్ బ్యాటర్  లబూషేన్.. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా అడ్డుకున్నాడు. ఈ సిరీస్‌లో  ఇప్పటివరకూ  చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోయిన లబూషేన్.. ఆసీస్‌కు అత్యంత కీలక సమయంలో  ఆడటం గమనార్హం. బెన్ స్టోక్స్ తన బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా  లబూషేన్ వికెట్‌ను కాపాడుకున్నాడు. మిచెల్ మార్ష్  (107 బంతుల్లో 31 నాటౌట్, 4 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 103 పరుగులు జోడించాడు. ఈ జోడీ  జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, మోయిన్ అలీ‌లను సమర్థవంతంగా ఎదుర్కుంది.  

సెంచరీ తర్వాత లబూషేన్.. జో రూట్  బౌలింగ్‌లో వికెట్ కీపర్ జానీ బెయిర్  స్టో కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  లబూషేన్ స్థానంలో   కామెరూన్ గ్రీన్ (15 బంతుల్లో 3 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు.  అయితే టీ విరామానికి ఆస్ట్రేలియా.. 71 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. టీ తర్వాత మాంచెస్టర్‌లో మళ్లీ వరుణుడు తన ప్రతాపాన్ని చూపెట్టాడు.   దీంతో మూడో సెషన్‌లో ఒక్క బంతి కూడా పడలేదు. నిన్న రోజు మొత్తం 30  ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం మార్ష్, గ్రీన్ క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్..  ఇంకా 61 పరుగులు వెనుకబడి ఉంది. 

నాలుగో రోజుతో పాటు ఆట చివరిరోజైన నేడు కూడా మాంచెస్టర్‌లో వర్షం తప్పేలా లేదు.  వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఆదివారం కూడా మాంచెస్టర్‌లో  మధ్యాహ్నం 12- 2 గంటల వరకూ.. సాయంత్రం నాలుగింటి నుంచి రాత్రి 8 గంటల వరకూ వర్షం కురిసే అవకాశాలున్నాయి. ఆదివారం కూడా ఆట సాగేది కష్టమేనని తెలుస్తున్నది.  ఇది  ఆస్ట్రేలియాకు గుడ్ న్యూసే అయినా ఇంగ్లాండ్‌ను మాత్రం తీవ్రంగా నిరాశపరిచేదే.  ఈ సిరీస్‌లో వరుసగా రెండు టెస్టులు ఓడి  తర్వాత  లీడ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో గెలిచి.. మాంచెస్టర్ టెస్టు కూడా గెలుచుకునేందుకు బాటలు వేసుకున్న ఇంగ్లాండ్‌ను ఇది తీవ్రంగా నిరాశపరిచేదే..!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 23 Jul 2023 12:26 PM (IST) Tags: Ben Stokes Ashes Marnus Labuschagne England vs Australia The Ashes 2023 AUS vs ENG 4th Test

ఇవి కూడా చూడండి

MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్‌! టీమ్‌ఇండియాకు నెర్వస్‌ ఫీలింగ్‌!

MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్‌! టీమ్‌ఇండియాకు నెర్వస్‌ ఫీలింగ్‌!

Samson Post Viral: సంజూ శాంసన్‌ పోస్ట్‌! టీమ్‌ఇండియాపై 'బాహుబలి' ఇంటర్వెల్‌ సీన్‌ రిపీట్‌!

Samson Post Viral: సంజూ శాంసన్‌ పోస్ట్‌! టీమ్‌ఇండియాపై 'బాహుబలి' ఇంటర్వెల్‌ సీన్‌ రిపీట్‌!

ICC ODI World Cup 2023: ఈ ఐదుగురికీ ఇదే తొలి ప్రపంచకప్‌! క్రీజులో నిలిస్తే రికార్డులు బద్దలే!

ICC ODI World Cup 2023: ఈ ఐదుగురికీ ఇదే తొలి ప్రపంచకప్‌! క్రీజులో నిలిస్తే రికార్డులు బద్దలే!

ICC ODI Cricket World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, వ‌న్డే వరల్డ్ క‌ప్ 2023 ప్రారంభ వేడుక‌లు ర‌ద్దు!

ICC ODI Cricket World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, వ‌న్డే వరల్డ్ క‌ప్ 2023 ప్రారంభ వేడుక‌లు ర‌ద్దు!

Yashasvi Jaiswal: బాబోయ్‌ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్‌ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్‌

Yashasvi Jaiswal: బాబోయ్‌ ఏంటీ విధ్వంసం! యంగెస్ట్ టీ20 సెంచూరియన్‌గా గిల్‌ రికార్డు బద్దలు కొట్టిన జైశ్వాల్‌

టాప్ స్టోరీస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Vastu Tips in telugu: పసుపుతో ఈ 3 వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంటికి సంపద, శ్రేయస్సు!

Vastu Tips in telugu: పసుపుతో ఈ 3 వాస్తు చిట్కాలు పాటిస్తే మీ ఇంటికి సంపద, శ్రేయస్సు!