అన్వేషించండి
Advertisement
Shubman Gill: అక్కడ ఇక్కడ అదే కుక్క - సారా-గిల్ ప్రేమకు చిహ్నమా?
Shubman Gill And Sara Tendulkar: దిగ్గజ క్రికెటర్ సచిన్ కుమార్తె సారా టెండూల్కర్, స్టార్ బ్యాటర్ శుభ్ మన్ గిల్ పై తాజాగా ఓ ఫోటోతో సోషల్ మీడియాలో మరోసారి రూమర్లు మొదలయ్యాయి.
Saras Insta post with a dog sparked dating rumors with Gill: టీమిండియా దిగ్గజ ఆటగాడు, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్( Sara Tendulkar) గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అలాగే అటు టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) గురించి కూడా పరిచయం అవసరం లేదు . వీరిద్దరూ సోషల్ మీడియాలో గిల్, సారా టెండూల్కర్ ఒకరినొకరు ఫాలో కావటం, పోస్టులకు కామెంట్స్ కూడా పెడుతూ రావటంతో వారిద్దరిపై రూమర్లకి కొదువ లేదు.
ఇప్పుడు తాజాగా బయటపడిన ఓ ఫోటో చూసిన తర్వాత రిలేషన్ షిప్ విషయంలో అభిమానుల్లో ఉన్న అయోమయం తొలగిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నసారా ఫోటోలో, ఓ కుక్కతో ఉంది. ఇక కొద్ది రోజుల క్రితం శుభ్‌మన్ గిల్ కూడా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ ఫోటోలో అతని పక్కనే ఓ కుక్క కూర్చుంది. దీంతో వారిద్దరి దగ్గర ఉన్నది ఒకే కుక్క అని, నిజంగానే వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని మరోసారి రూమర్లు మొదలయ్యాయి. ఇటీవల సారా టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లకు హాజరయ్యేందుకు జామ్‌నగర్ చేరుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో చివరి రోజున ఫెయిర్ థీమ్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం సారా టెండూల్కర్ ఎరుపు రంగు లెహంగా ధరించి ఫోటోను క్లిక్ మనిపించింది. ఈ ఫోటోల్లో ఒకదానిలో, ప్రజలు సారాను పెంపుడు కుక్కతో చూశారు. దీని తర్వాత, సోషల్ మీడియాలో శుభమన్, సారాల సంబంధం గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. నిజానికి గిల్ చుట్టూ చాలా కుక్కలు ఉన్న ఫోటోలు కూడా అతని ఇన్ స్టాలో ఉన్నాయి, దీంతో గిల్ ఒక డాగ్ లవర్ అనో, తన ప్రేమ జ్ఞాపకంగా ఓ కుక్కని ఇచ్చి ఉంటాడని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు
గతేడాది క్రితం వరకు వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందని, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్(Sara Ali Khan)తో శుభ్‌మన్ గిల్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు కొత్త ప్రచారం తెరిపైకి వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి ఓ కాఫీ షాప్‌లో కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. దాంతో సారా టెండూల్కర్-శుభ్‌మన్ గిల్ లవ్‌కు సంబంధించిన గాసిప్స్‌కు బ్రేక్ పడింది. కొత్త గాసిప్ మొదలయ్యింది. అయితే తరువాత మళ్లీ సారా టెండూల్కర్-శుభ్‌మన్ గిల్ ఇద్దరు కలిసిపోయారన్న వార్తలు మొదలయ్యాయి. తర్వాత ప్రపంచ కప్ మ్యాచ్ లకి సారా హాజరు అవ్వటం, గిల్ ఫోర్ లు, సిక్స్ లు కొట్టిన ప్రతిసారీ గట్టిగా చప్పట్లు కొడుతూ అతన్ని ఎంకరేజ్ చేయటం మీడియా కంట పడింది. ఇంకేముంది ఆ వీడియో క్లిప్ మరోసారి సోషల్ మీడియాను దున్నేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆటో
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion