అన్వేషించండి
Advertisement
Rocky Flintoff: వాడి కొడుకు వచ్చాడని చెప్పు, భవిష్యత్తులో " సలాం రాకీ భాయ్ అనాల్సిందేనా "
Rocky Flintoff: ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్ ఇంగ్డాండ్ కు మరో కీలక ఆటగాడిగా మారుతాడని భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే రాకీ 16 ఏళ్ళ అతిచిన్న వయస్సులో లంకాషైర్ కౌంటీ తరపున అరంగేట్రం చేశాడు.
Rocky Flintoff becomes Lancashire's youngest county debutant: ఆండ్రూ ఫ్లింటాఫ్(Rocky Flintoff) గుర్తున్నాడు కదా... అదేనండీ.. టీ 20 ప్రపంచకప్(T20 World Cup) లో ప్రశాంతంగా ఉన్న యువరాజ్ సింగ్(Yuvaraj singh) ను రెచ్చగొట్టి... ఒకే ఓవర్లో ఆరు సిక్సులతో చెలరేగేలా చేసి.. బౌలర్ స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) ను బలిచేశాడే అతడే. ఫ్లింటాఫ్ మంచి ఆల్ రౌండర్ గా ఇంగ్లండ్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు కూడా అందించాడు. అప్పట్లో యాషెస్ సిరీస్ లో ఒంటరి పోరాటం చేసి ఆస్ట్రేలియాపై జట్టును గెలిపించాడు కూడా. ఇప్పుడు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఫ్లింటాఫ్ వారసుడు క్రికెట్ లో రాజ్యమేలుందుకు సిద్ధమయ్యాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్(Rocky Flintoff) కౌంటీల్లో అరంగేట్రం చేశాడు. అరంగేట్రం చేస్తే ప్రత్యేకత ఏముంటుంది అనుకుంటున్నారు.. కౌంటీల్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డును నెలకొల్పాడు. ఈ జూనియర్ ఫ్లింటాఫ్ ఇంగ్డాండ్ కు మరో కీలక ఆటగాడిగా మారుతాడని భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో తండ్రికి తగ్గ తనయుడంటూ రాకీ ఫ్లింటాఫ్ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. రాకీ ఫ్లింటాఫ్ కేవలం 16 సంవత్సరాల 137 రోజుల వయస్సులో లంకాషైర్ కౌంటీ తరపున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఆగష్టు 22, 2024న ది ఓవల్‌లో సర్రేతో జరిగిన మ్యాచులో రాకీ ఫ్లింటాఫ్ అరంగేట్రం చేశాడు.
Rocky Flintoff, the 16-year-old son of England cricketer Andrew, became the 10th youngest debutant in the County Championship when playing for Lancashire against Surrey at the Oval... all on his GCSE results day 🏏🤯
— SPORTbible (@sportbible) August 22, 2024
A proud day in the Flintoff household 🥹❤️ pic.twitter.com/yQScmeT7rS
కౌంటీ వరకు సాగిన రాకీ ఫ్లింటాఫ్ క్రికెట్ ప్రయాణం శరవేగంగా సాగింది. దేశవాళీ క్రికెట్ లో రాకీ అద్భుత ఆటతీరుతో అలరించాడు. అండ్రూ ఫ్లింటాఫ్ వారసుడిగా ముద్రపడినా రాకీ ఫ్లింటాఫ్ తన ఆటతీరుతో తనదైన ముద్ర వేశాడు. లంకాషైర్ తరపున ఇప్పటికే సెంచరీ చేసేశాడు. లిస్ట్ ఏ మ్యాచుల్లో అరంగేట్రం చేశాడు. రాకీ వయసు తక్కువగా ఉన్నా అద్భుత ఆటతీరు, సానుకూల బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. రాకీ ఆటతీరును తరుచుగా తండ్రితో పోల్చుతున్నారు. కానీ బ్రిటీష్ జట్టుకు రాకీ ఫ్లింటాఫ్ భవిష్యత్తు ఆశా కిరణంగా కనిపిస్తున్నాడు.
అరవీర భయంకర బౌలర్లను ఎదుర్కొని...
రాకీ ఫ్లింటాఫ్ తన అరంగేట్ర మ్యాచులోనే సమర్థులైన బౌలర్లు ఉన్నా సర్రే కౌంటీ జట్టును ఎదుర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగిన రాకీ... 32 పరుగులతో పర్వాలేదనిపించాడు. అతని ఇన్నింగ్స్లో భారీ పరుగులు లేకపోయినా... రాకీ ఆడిన తీరు ఆకట్టుకుంది. స్టైలిష్ కవర్ డ్రైవ్ లతో అలరించాడు. తన కొడుకు బ్యాటింగ్ ను బౌండరీ లైన్ నుంచి చూస్తూ ఆండ్రూ ఫ్లింటాఫ్ పరవశించి పోయాడు.
రాకీ అరంగేట్రం కేవలం పరుగుల గురించి కాదని ... ఇంగ్లండ్ జట్టు భవిష్యత్తు గురించని పలువురు మాజీ బ్రిటీష్ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
రాకీ ఫ్లింటాఫ్ ప్రదర్శనతో క్రికెట్ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. సోషల్ మీడియాలో కూడా రాకీ బ్యాటింగ్ తీరు వైరల్ గా మారింది. #Cricket, Flintoff హ్యాష్‌ట్యాగ్లు ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఆండ్రూ ఫ్లింటాఫ్ ఆరంగేట్రం కూడా 29 సంవత్సరాల క్రితం ఇదే నెలలో జరిగింది. ప్రొఫెషనల్ క్రికెట్‌లో రాకీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు అందరి దృష్టి అతనిపైనే ఉంటుంది. ప్రతీ విషయాన్ని తన తండ్రితో పోలుస్తూ ఉంటారు. ఆ ఒత్తిడి నుంచి బయట పడితే రాకీ క్రికెట్ లో మరో రాక్ స్టార్ కాగలడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement