అన్వేషించండి

Team India: టీమిండియా ఆటగాళ్లను చూసి, అనంత్ సంగీత్ వేడుకలో నీతా అంబానీ కన్నీళ్లు!

Anant Ambani sangeet ceremony : ముకేశ్ అంబానీ చిన్న‌ కుమారుడు అనంత్ అంబానీ పెండ్లి సంబరంలో నీతా అంబానీ ఎమోషనల్ అయ్యారు. ఐసీసీ ట్రోఫీతో వ‌చ్చిన క్రికెట్ హీరోలను చూసి భావోద్వేగానికి గురయ్యారు.

Nita Ambani Gets Emotional By Seeing Rohit, Surya And Hardhik:  టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) గెలిచి విశ్వ విజేతలుగా నిలిచిన భారత ఆటగాళ్లకు అపూర్వ స్వాగతాలు లభిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు... క్రికెటర్లను సన్మానించగా... తాజాగా అంబానీ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలోనూ టీమిండియా క్రికెటర్లు ప్రత్యేక గౌరవం దక్కింది. పొట్టి ప్రపంచ కప్ ఛాంపియన్లు ఆకర్షణగా నిలిచారు. అనంత్‌ అంబానీ వివాహ వేడుకలో రోహిత్‌ శర్మ(Rohit Sharma), హార్దిక్ పాండ్యా(Hardic Pandya), సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లులో తడిసి ముద్దయ్యారు. భారత జట్టును విశ్వ విజేతగా నిలపడంపై నీతా అంబానీ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.  
 
భారత్‌ను ఛాంపియన్‌గా నిలవడంలో ముంబైకర్లు కీలక పాత్ర పోషించారంటూ నీతా అంబానీ అన్నారు. టీమిండియా విశ్వ విజేతలుగా నిలవడంలో సారధి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా  కీలక పాత్ర పోషించారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ సంగీత్‌లో రోహిత్ శర్మ, హార్దిక్, సూర్యకుమార్‌లను  ఘనంగా సత్కరించారు.
 
సంగీత్‌ వేడుకలో కంటతడి
ముంబై ఇండియన్స్ యజమాని.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సహ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ... తన కుమారుడు అనంత్‌ అంబానీ సంగీత్‌ వేడుకలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పొట్టి ప్రపంచకప్ గెలిచిన సభ్యులు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్‌ పాండ్యా సహా టీమిండియా సాధించిన ఘనతకు నీతా అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ మనమందరం కుటుంబసభ్యులమని... కానీ తనకు మరో కుటుంబం ఉందని స్టేజిపై నీతా అంబానీ మాట్లాడారు. ఆ మరో కుటుంబం ఇవాళ దేశాన్ని గర్వపడేలా చేసిందని... ప్రతి ఒక్కరి హృదయం గర్వంతో ఉప్పొంగేలా చేసిందని.. వారి వల్లే ప్రారంభమైన ఈ వేడుకల ఇప్పట్లో ఆగవని నీతా అన్నారు. ఈ విజయం తనకు గొప్ప అనుభూతినో పంచిందో చెప్పలేనని నీతా అంబానీ అన్నారు.
ఇవాళ ముంబై ఇండియన్స్ కుటుంబం మాతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు అమితానాందాన్ని ఇస్తోందని నీతా అంబానీ అన్నారు. 2011 తర్వాత తొలిసారిగా ప్రపంచకప్ ట్రోఫీని భారత్‌కు తీసుకొచ్చినందుకు ముకేశ్ అంబానీ కూడా అభినందించారు. సంగీత్ వేడుకకు హాజరైన వారు లేచి నిలబడి, ప్రపంచ కప్ గెలిచిన హీరోలకు గౌరవాన్ని ఇచ్చారు. ఈ సంగీత్‌ వేడుకలో మాజీ కెప్టెన్ ధోని, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కృనాల్ పాండ్యా కూడా పాల్గొన్నారు.
 
ముగ్గురు ముగ్గరే
టీ 20 ప్రపంచకప్‌లో రోహిత్ 257 పరుగులతో టోర్నమెంట్‌లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్‌లో అద్బుత క్యాచ్‌తో మ్యాచ్‌ గమనాన్నే మార్చేశాడు. చివరి ఓవర్‌లో హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ను మరికొంతకాలం మనం మర్చిపోలేం.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget