Rahul Dravid: ఇందిరానగర్ గూండా తర్వాత కొత్త అవతారంలో టీమిండియా హెడ్‌కోచ్ - బిగ్ బీని దించేశాడుగా!
టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ కొత్త అవతారం ఎత్తాడు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను అచ్చు గుద్దినట్టుగా దింపేశాడు.
![Rahul Dravid: ఇందిరానగర్ గూండా తర్వాత కొత్త అవతారంలో టీమిండియా హెడ్‌కోచ్ - బిగ్ బీని దించేశాడుగా! After Indiranagar Gunda, Team India Head Coach Rahul Dravid Emerges in new avatar, Watch Viral Video Rahul Dravid: ఇందిరానగర్ గూండా తర్వాత కొత్త అవతారంలో టీమిండియా హెడ్‌కోచ్ - బిగ్ బీని దించేశాడుగా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/02/5ecccd7a68fbdb9d01a128f0dfe802ad1693657599744689_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rahul Dravid: కొన్నాళ్ల కిందట ముంబైలో ‘ఇందిరానగర్ గూండా’ అంటూ క్రెడ్ యాడ్‌లో అలరించిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కొత్త అవతారమెత్తాడు. టీమిండియాకు ఆడినప్పుడు కూల్ అండ్ కామ్‌గా ఉండే ద్రావిడ్.. ప్రచార చిత్రాల్లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఫార్మ్‌లీ (Farmley) అనే సంస్థ రూపొందించిన యాడ్‌లో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను అచ్చుగుద్దినట్టు దించేశాడు.
డ్రై ఫ్రూట్స్‌ను ప్రాసెస్ చేసి అమ్మే ఫార్మ్‌లీకి ద్రావిడ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా ఆసియా కప్ ఆడేందుకు శ్రీలంకలో ఉండగా ఫార్మ్‌లీ ఈ యాడ్‌ను విడుదల చేసింది. యాడ్‌లో ద్రావిడ్.. అమితాబ్ బచ్చన్ క్లాసిక్ హిట్ ‘దీవార్’ గెటప్ వేసి ఆకట్టుకున్నాడు.
దీవార్ సినిమాలో అమితాబ్ మాదిరిగానే ద్రావిడ్ కూడా కుర్చీలో ఆయన స్టైల్‌లోనే కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చాడు. భుజానికి తాడు.. నోట్లో అగ్గిపుల్ల, చేతికి కూలీలు కట్టుకునే బిల్లతో 80లలో అమితాబ్ హెయిర్ స్టైల్‌తో అచ్చం ఆయనను దింపేశాడు. హావభావాల్లోనే గాక డైలాగ్ డెలివరీలో కూడా ద్రావిడ్.. అమితాబ్‌ను కాపీ కొట్టాడు. అమితాబ్ మాదిరిగానే బిగ్గరమైన వాయిస్‌తో యాడ్‌లో డైలాగులు కుమ్మేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
Aaj khush toh bhot hoge tum? Mujhe is andaaz mein dekh ke?! pic.twitter.com/6A55eUNeAU
— Farmley (@FarmleyIn) September 1, 2023
ఈ వీడియో నెట్టింట వైరల్ కాగానే క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ద్రావిడ్ గతంలో నటించిన క్రెడ్ యాప్ యాడ్‌ను రీపోస్ట్ చేస్తూ దాంతో దీనిని పోలుస్తున్నారు. ఎప్పుడూ కామ్‌గా ఉండే ద్రావిడ్.. యాడ్స్‌లో మాత్రం ఇలా తనలోని ఫ్రస్ట్రేషన్‌ను బయటపెడుతున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు.
Difficult to top this 🥲 pic.twitter.com/DWwSRC1Hgd
— Garv (ਗਰਵਿਤ) (@imgarvmalik) September 2, 2023
— Altamash Iqbal (@altamashi25) September 2, 2023
Looking good 👏 He looks good in these kind of character
— Himanshu dubey (@Himansh08921913) September 2, 2023
ప్రస్తుతం ఆసియా కప్‌లో భాగంగా టీమిండియాతో ఉన్న ద్రావిడ్.. గతేడాది మిస్ అయిన టోర్నీని ఈసారి సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పల్లెకెలె వేదికగా పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్.. బ్యాటింగ్‌లో తడబడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 25 ఓవర్లు ముగిసేసరికి నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (4), శ్రేయాస్ అయ్యర్ (14), శుభ్‌మన్ గిల్ (10) దారుణంగా విఫలమయ్యారు. పాక్ పేసర్ షహీన్ అఫ్రిది రెండు కీలక వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీశాడు. హరీస్ రౌఫ్ అయ్యర్‌తో పాటు గిల్‌ను ఔట్ చేశాడు.
— Kamina (@bittu7664) September 2, 2023
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)