Mohammed Siraj News : సిరాజ్ మొబైల్‌కు బెట్టింగ్ మెసేజులు- పోలీసుల అదుపులో నిందితుడు
బెట్టింగ్ కు సంబంధించి ఇండియన్ యంగ్ పేసర్, నంబర్ వన్ వన్డే బౌలర్ మహ్మద్ సిరాజ్ ను అప్రోచ్ అయ్యారు.
ఎస్... బెట్టింగ్ కు సంబంధించి ఇండియన్ యంగ్ పేసర్, నంబర్ వన్ వన్డే బౌలర్ మహ్మద్ సిరాజ్ ను అప్రోచ్ అయ్యారు. రీసెంట్ గా ఐపీఎల్ స్టార్ట్ అవడానికి ముందు ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ జరిగింది కదా. ఆ సందర్భంగా జరిగిన ఘటన ఇది.
మార్చి 19వ తేదీన వైజాగ్ లో రెండో వన్డేకు ముందు..... సిరాజ్ కు వాట్సాప్ లో ఓ మెసేజ్ వచ్చింది. బెట్టింగ్ కు అలవాటు పడ్డ హైదరాబాద్ కు చెందిన డ్రైవర్ నుంచి వచ్చిన మెసేజ్ అది. దాంట్లో ఏముందంటే.... బెట్టింగ్ లో బాగా నష్టపోయానని, రెండో వన్డేకు సంబంధించి ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్ కావాలని సిరాజ్ కు మెసేజ్ చేశాడు.
అతను బెట్టింగ్ కు అలవాటు పడ్డ వ్యక్తే తప్ప..... బుకీ కాదని తేలింది. తనకు మెసేజ్ రాగానే అలెర్ట్ అయిన మహ్మద్ సిరాజ్.... బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ కు వెంటనే సమాచారం అందించాడు.
పోలీసులను ఆశ్రయించిన ACU అధికారులు.... మెసేజ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. 2013లో శ్రీశాంత్ సహా ఇతరుల స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం నుంచి బీసీసీఐ..... యాంటీ కరప్షన్ డ్రైవ్ ను చాలా ఉద్ధృతం చేసింది. అందులో భాగంగా ఆటగాళ్లందరికీ మేండటరీ వర్క్ షాప్స్ కూడా నిర్వహించింది. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో అందరికీ అవగాహన కల్పించింది. అందుకే సిరాజ్ సరిగ్గా ఆలోచించి.... యాంటీ కరప్షన్ యూనిట్ కు వెంటనే సమాచారం అందించాడు.