BCCI on IPL: కొత్త జట్ల వేలం..! టెండర్ల ప్రక్రియపై బీసీసీఐ తాజా నిర్ణయం తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగులో కొత్త జట్ల వేలం ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఫ్రాంచైజీలను విక్రయించేందుకు బీసీసీఐ టెండర్లకు ఆహ్వానించింది. తుది గడువును 2021,అక్టోబర్ 20కి పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగు కొత్త జట్ల వేలం ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఫ్రాంచైజీలను విక్రయించేందుకు బీసీసీఐ టెండర్లకు ఆహ్వానించింది. టెండర్ పత్రాలు కొనుగోలు చేసేందుకు చివరి తేదీ అక్టోబర్ 10న ముగిసింది. మరిన్ని సంస్థలు మరికొంత గడువు ఇవ్వాలని కోరడంతో.. తుది గడువును 2021, అక్టోబర్ 20కి పెంచుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్నే తాజాగా ప్రకటించింది.
Also Read: విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ఆర్సీబీ ప్లేయర్ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
కొత్త జట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు ముందుగా ఐటీటీ (ఇన్విటేషన్ టు టెండర్) పత్రాలు తీసుకోవాలి. ఇందుకు రూ.10 లక్షలు చెల్లించాలి. ఐటీటీ పత్రాలు తీసుకొనేందుకు మొదట 2021, ఆగస్టు 31ని తుదిగడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత అక్టోబర్ 10కి పొడగించారు. గడువు ముగిసినా మరింత మంది ఆసక్తి చూపిస్తుండటంతో తాజాగా దానిని అక్టోబర్ 20కి సవరించింది.
Also Read: ధోనీ ది గ్రేట్! పారితోషికం తీసుకోకుండానే మెంటార్‌గా సేవలు
ఐటీటీ పత్రాలు కావాల్సిన వారు ittipl2021@bcci.tvకి మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్టులో “ITT for the Right to Own and Operate One of Two Proposed New IPL Teams” అని రాయాలి. ఆసక్తిగల అందరికీ ఐటీటీ పత్రాలను బీసీసీఐ ఇవ్వడం లేదు. సంబంధిత సంస్థ, వ్యక్తులకు ఫ్రాంచైజీ నడపగలరా లేదా అని పరిశీలించాకే పత్రాలు ఇస్తుంది.
Also Read: 15-20శాతం తగ్గిన ఐపీఎల్ రేటింగ్.. స్టార్ సతమతం.. ఆందోళనలో అడ్వర్టైజర్లు!
ప్రస్తుతం ఐపీఎల్‌ను ఎనిమిది జట్లతోనే నిర్వహిస్తున్నారు. గతంలో ఒకసారి పది జట్లతో నిర్వహించినా ఆ తర్వాత రెండు జట్లను తొలగించారు. గంగూలీ, జేషా వచ్చాక లీగును విస్తరించాలని నిర్ణయించుకున్నారు. మరో రెండు ఫ్రాంచైజీలను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాదిలోపే విక్రయ ప్రక్రియను పూర్తి చేయాలని బీసీసీఐ గడువు పెట్టుకుంది. వచ్చే ఏడాది నుంచి పది జట్ల ఐపీఎల్‌ను నిర్వహించనుంది. ఎక్కువ జట్లు ఉండటంతో వచ్చే ఏడాదికి ఆటగాళ్ల వేలాన్ని భారీ స్థాయిలో నిర్వహించనుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
🚨 NEWS 🚨: BCCI announces release of tender to own and operate an Indian Premier League team.
— IndianPremierLeague (@IPL) October 13, 2021
More Details 🔽