IND Vs AUS: ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు తుది జట్టు ఇదే - సూర్యకు ఛాన్స్!
బోర్డర్ - గవాస్కర్ టెస్టు సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
Indian Squad: ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించారు. ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో జరగనుంది. ప్రస్తుతానికి మొదటి రెండు టెస్టులకు మాత్రమే బీసీసీఐ టీమ్ ఇండియాను ప్రకటించింది.
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి అశ్విన్ , అక్షర్ పటేల్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్.
తొలిసారి టెస్టు జట్టులోకి ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్
భారత జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిలకడగా అద్భుత ప్రదర్శన చేస్తున్న ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లు కూడా తొలిసారిగా టెస్టు జట్టులోకి వచ్చారు. ఇషాన్ కిషన్‌కు గతంలో బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించిన రికార్డు ఉంది.
ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ ఎంత విధ్వంసకరంగా ఆడుతున్నాడో మనకు తెలియనది కాదు. సూర్యకుమార్ యాదవ్ ఒకే సంవత్సరం వ్యవధిలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో మూడు సార్లు సెంచరీ మార్కును దాటాడు.
టెస్ట్ సిరీస్ షెడ్యూల్
భారత పర్యటనలో ఆస్ట్రేలియా జట్టు నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు, రెండో టెస్టు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు, మూడో టెస్టు మార్చి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు, నాలుగో టెస్టు మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతాయి. దీని తర్వాత తొలి వన్డే మార్చి 17వ తేదీనన, రెండో వన్డే మార్చి 19వ తేదీన, మూడో వన్డే మార్చి 22వ తేదీన నిర్వహించనున్నారు.
India’s squad for first 2 Tests vs Australia:
— BCCI (@BCCI) January 13, 2023
Rohit Sharma (C), KL Rahul (vc), Shubman Gill, C Pujara, V Kohli, S Iyer, KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, Axar Patel, Kuldeep Yadav, Ravindra Jadeja, Mohd. Shami, Mohd. Siraj, Umesh Yadav, Jaydev Unadkat, Suryakumar Yadav
𝗡𝗢𝗧𝗘: Ravindra Jadeja’s inclusion in the squad is subject to fitness.#TeamIndia | #INDvAUS
— BCCI (@BCCI) January 13, 2023