IND vs END: బ్యాడ్ లైట్ కారణంగా... అరగంట ముందుగానే ముగిసిన నాలుగో రోజు ఆట... భారత్ 181/6
భారత్xఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది.
భారత్xఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. వెలుతురు లేమి (బ్యాడ్ లైట్) కారణంగా 30 నిమిషాలు ముందే ఆట ముగిసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 154 పరుగుల ఆధిక్యంలో ఉంది.
AlsoRead: IND vs END: లండన్‌లో కోహ్లీ సేన స్వాతంత్య్ర వేడుకలు... జెండా ఎగురవేసిన కోహ్లీ
It's Stumps on Day 4⃣ of the 2nd #ENGvIND Test at Lord's!#TeamIndia move to 181/6 & lead England by 154 runs.
— BCCI (@BCCI) August 15, 2021
6⃣1⃣ for @ajinkyarahane88
4⃣5⃣ for @cheteshwar1 @RishabhPant17 (14*) & @ImIshant (4*) will resume the proceedings on Day 5.
Scorecard 👉 https://t.co/KGM2YELLde pic.twitter.com/ulY0tJclSl
పంత్ పైనే ఆశలు
ప్రస్తుతం రిషబ్ పంత్(14), ఇషాంత్ శర్మ(4) నాటౌట్‌గా ఉన్నారు. రెండో టెస్టుపై భారత్ ఇక పట్టు కోల్పోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంత్ తప్ప ఇక బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరు. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త ఆదుకున్న జడేజా కూడా ఈ రోజు త్వరగానే ఔటయ్యాడు. ఆటలో ఐదో రోజైన సోమవారం పంత్ చేసే పరుగుల పైనే భారత్ ఆశలు పెట్టుకుంది. అజింక్య రహానె(61), చెతేశ్వర్ పుజారా(45) నాలుగో వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు.
సామ్ కరన్ బౌలింగ్‌లో కోహ్లీ ఔట్
మార్క్‌వుడ్.. రాహుల్(5), రోహిత్ శర్మ(21)ను ఔట్ చేశాడు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ(20) సామ్‌కరన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 55 పరుగులకే ముగ్గురు టాప్ బ్యాట్స్మెన్ల వికెట్లు కోల్పోవడంతో రహానె, పుజారా పైనే భారత ఇన్నింగ్స్ ఆధారపడింది. దీంతో వీరిద్దరూ కూడా ఆచితూచి ఆడుతూ, వికెట్ కాపాడుకుంటూ కీలక సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. ఈ క్రమంలోనే 4వ వికెట్‌కి వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఆ తర్వాత పుజారా... మార్క్‌వుడ్ వేసిన షార్ట్ పిచ్ బంతి అతడి గ్లౌజులకు తగిలి రూట్ చేతిలో పడింది. దాంతో భారత్ 155 పరుగుల వద్ద పుజారా రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ కొద్దిసేపటికే అర్ధ శతకంతో కొనసాగుతున్న రహానె కూడా పెవిలియన్ బాటపట్టాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో కీపర్ చేతికి చిక్కాడు.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మంచి ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజా పైనే భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ, ఈ సారి జడేజా(3) సైతం నిరాశపరిచాడు. అతడిని కూడా అలీ బౌల్డ్ చేయడంతో భారత్ ఆరో వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. స్వల్ప వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. పంత్, ఇషాంత్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే, 82 ఓవర్ల తర్వాత వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ మూడు, మొయిన్ అలీ రెండు, సామ్‌కరన్ ఒక వికెట్ తీశారు.