Usman Khawaja: నాలుగో టెస్టులో ఉస్మాన్ ఖవాజా కొత్త రికార్డు - ఆ ముగ్గురి సరసన!
భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీ సాధించిన ఉస్మాన్ ఖవాజా కొత్త రికార్డును సృష్టించాడు.
Australian Opener Usman Khawaja Hit Century Against India IND vs AUS 2023: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 కోసం భారత్, ఆస్ట్రేలియా మధ్య గత నెల రోజులుగా నాలుగు టెస్టుల యుద్ధం జరుగుతోంది. ఈ సిరీస్‌లోని చివరి టెస్టు మ్యాచ్ మార్చి 9వ తేదీ నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభమైంది. ఈ మొత్తం సిరీస్‌లో బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం చాలా కష్టంగా మారింది. కాగా నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా భారత్‌పై తొలి సెంచరీ సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు.
భారత్‌తో జరుగుతున్న అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా (Australian Opener Usman Khawaja) తొలి రోజు 251 బంతుల్లో 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్‌పై ఉస్మాన్ ఖవాజాకు ఇదే తొలి సెంచరీ. అయితే అతను గత కొంతకాలంగా చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ భారత్‌తో జరిగిన చివరి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో సెంచరీ సాధించలేకపోయాడు. అహ్మదాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఉస్మాన్ ఖవాజా గత 30 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ రికార్డును సమం చేశాడు.
ఉస్మాన్ ఖవాజా ఇప్పటి వరకు గత 30 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం ఆరు సెంచరీలు సాధించాడు. వీరితో పాటు ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్, జానీ బెయిర్‌స్టో, న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ కూడా గత 30 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు సాధించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ స్టార్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ ఇప్పుడు ఈ విషయంలో లిస్ట్‌లోని మిగతా ఆటగాళ్లను సమం చేశాడు.
అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా తన సెంచరీతో ఆస్ట్రేలియా జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ (Australia First Innings)లో ఏకంగా 422 బంతులు ఆడిన ఉస్మాన్ ఖవాజా 21 బౌండరీలతో 180 పరుగులు చేసి అవుటయ్యాడు. ఉస్మాన్ ఖవాజాతో పాటు కామెరాన్ గ్రీన్ కూడా శతకం (Cameron Green hits Century) సాధించాడు. 170 బంతులు ఆడిన కామెరాన్ గ్రీన్ 18 బౌండరీలతో 114 పరుగులు చేసి అవుటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ప్రస్తుతానికి ఎనిమిది వికెట్ల నష్టానికి 463 పరుగులు సాధించింది. టెయిలెండర్లు టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్ తొమ్మిదో వికెట్‌కు ఇప్పటికే 50కి పైగా పరుగులు జోడించి ఆస్ట్రేలియాను మరింత భారీ స్కోరు వైపు తీసుకెళ్తున్నారు.
End of a terrific knock of Usman Khawaja, over 10 hours, 180 runs from just 422 balls.
— Johns. (@CricCrazyJohns) March 10, 2023
A knock to remember in his journey. pic.twitter.com/6B4bCIFOE6
A magnificent performance by Usman Khawaja comes to an end 👏#WTC23 | #INDvAUS | 📝 https://t.co/VJoLfVSeIF pic.twitter.com/Rb68gQ78A1
— ICC (@ICC) March 10, 2023
1⃣0⃣+ Hours
— CricTracker (@Cricketracker) March 10, 2023
1⃣8⃣0⃣ Runs
4⃣2⃣ 2⃣ Balls
Usman Khawaja has played an inning of the decade 🙌#CricTracker #UsmanKhawaja #NDvAUS pic.twitter.com/2obTNqy27M