X

Novak Djokovic Visa: జకోవిచ్‌కు మళ్లీ షాక్‌! రెండోసారీ వీసా రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

జకోవిచ్‌కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి! ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ గెలవాలన్న అతడి కల నెరవేరేలా కనిపించడం లేదు. ఆసీస్‌ ప్రభుత్వం రెండోసారీ అతడి వీసాను రద్దు చేసింది.

FOLLOW US: 

ప్రపంచ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి! ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ గెలవాలన్న అతడి కల నెరవేరేలా కనిపించడం లేదు. ఆసీస్‌ ప్రభుత్వం రెండోసారీ అతడి వీసాను రద్దు చేసింది.

అతడు మరోసారి కోర్టు తలుపులు తట్టే అవకాశం ఉన్నప్పటికీ తీర్పు అనుకూలంగా రాదని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. టీకా తీసుకోని జకోవిచ్‌ సమాజంలో కొవిడ్‌ వ్యాప్తికి కారకుడయ్యే అవకాశం ఉందంటూ అక్కడి విదేశాంగ మంత్రి అలెక్స్‌ హాక్‌ ప్రత్యేక అధికారాలను ఉపయోగించి అతడి వీసాను రద్దు చేశారు. అంటే అతడికి మరో మూడేళ్ల వరకు ఆస్ట్రేలియాలో ప్రవేశం లేనట్టే! కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వం అనుమతించొచ్చు.

సోమవారమే ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు జకోవిచ్‌ను విమానాశ్రమంలో నిలిపివేశారు. అతడికి మద్దతుగా అభిమానులు, సెర్బియా ప్రభుత్వం నిలిచింది. ప్రపంచ నంబర్‌ వన్‌ను అవమానిస్తారా అంటూ విమర్శించింది. ఈ లోపు జకోవిచ్‌ కోర్టుకు వెళ్లి ఊరట తెచ్చుకున్నాడు. అయినప్పటికీ ఆసీస్‌ విదేశాంగ మంత్రి అలెక్స్‌ ఊరుకోలేదు. ప్రత్యేక అధికారంతో రెండోసారి వీసా రద్దు చేసేశారు.

Also Read: Australian Open 2022: జకోవిచ్‌కు 12 నెలల జైలు శిక్ష తప్పదా! కొవిడ్‌ వచ్చినా బయట తిరిగిన ప్రపంచ నం.1

Also Read: IND vs SA Test: అరెరె.. ఒకే జట్టులో 20 బ్యాటర్లు క్యాచ్‌ ఔట్‌! చరిత్రలో ఇదే తొలిసారి తెలుసా!!

Also Read: Ind vs SA, Rishabh pant century: ధోనీ ఇన్నేళ్లలో చేయలేనిది.. పంత్‌ రెండేళ్లలో చేసేశాడు..! ఆసియా ఆవల రిషభ్ రికార్డు

'వలస చట్టంలోని 133C(3) సెక్షన్‌ ప్రకారం నేనీ రోజు ప్రత్యేక అధికారాలను ఉపయోగించాను. ప్రజా ప్రయోజనార్థం నొవాక్‌ జకోవిచ్‌ వీసాను రద్దు చేశాను. మొదటి వీసా రద్దును ఫెడరల్‌ కోర్టు కొట్టివేసిన తర్వాత నేనీ నిర్ణయం తీసుకున్నా. జకోవిచ్‌, ఆస్ట్రేలియా సరిహద్దు దళం, హోం మంత్రిత్వ శాఖ సమాచారం పరిగణనలోకి తీసుకున్నా. కొవిడ్‌ విషయంలో మోరిసన్‌ ప్రభుత్వం కఠినంగా ఉంది' అని హాక్‌ తెలిపారు.

ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఓపెన్‌ను జకోవిచ్‌ తొమ్మిదిసార్లు గెలిచాడు. మరోసారి గ్రాండ్‌స్లామ్‌ గెలిచి అత్యధిక సార్లు గెలిచిన వీరుడిగా నిలుద్దామనుకున్నాడు. అంతేకాకుండా చాలా కాలంగా ఊరిస్తున్న 21వ గ్రాండ్‌స్లామ్‌ సాధించాలని కలలు కన్నాడు. తన ప్రవర్తన వల్లే జకోవిచ్‌ ఇప్పుడీ స్థితికి వచ్చాడు.

ఆస్ట్రేలియాలో కొవిడ్‌ ఆంక్షలు కఠినంగా ఉన్నాయి. టీమ్‌ఇండియా సైతం అక్కడ పర్యటించినప్పుడు క్వారంటైన్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అస్సలు మినహాయింపులే ఇవ్వడం లేదు. అయితే పాజిటివ్‌ వచ్చిన వాళ్లు వైద్య ధ్రువీకరణ పత్రం చూపిస్తే దేశంలోని అనుమతి ఇస్తున్నారు. కానీ జకోవిచ్‌ అలాంటి పత్రం ఇవ్వలేదు. అతడికి అవమానం జరిగిందటూ సొంత దేశం సెర్బియా సహా మిగతా ప్రపంచమూ అతడికి వంత పాడింది.

తీరా దర్యాప్తు చేస్తే విస్తుపోయే విషయాలు తెలిశాయి! గతేడాది డిసెంబర్‌ 16న జకోవిచ్‌కు కొవిడ్‌ సోకింది. దాంతో 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్లాడు. అక్కడే అతడు తప్పు  (ఉద్దేశపూర్వకమా!) చేశాడు. ఐసోలేషన్లో ఉంటే ఎవరినీ కలవొద్దు. అలాంటిది అతడు ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఓ విలేకరినీ కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడని తెలిసింది. దాంతో అతడు కొవిడ్‌ ఆంక్షలను ఉల్లంఘించాడని అర్థమైంది. ఇదిప్పుడు చినికి చినికి గాలివానగా మారింది. దాంతో 'మానవ తప్పిదం' సహజమేనంటూ నొవాక్‌ కొత్త పాట అందుకున్నాడు.

Tags: Novak Djokovic Australia visa Australian Open tennis 20222 Australia open Alex Hawke

సంబంధిత కథనాలు

IPL 2022: అబ్బో.. స్టాయినిస్‌ ఎంపిక వెనక ఇంత పెద్ద వ్యూహం ఉందా?

IPL 2022: అబ్బో.. స్టాయినిస్‌ ఎంపిక వెనక ఇంత పెద్ద వ్యూహం ఉందా?

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

IPL 2022: గుడ్‌ న్యూస్‌! ఇండియాలోనే ఐపీఎల్‌ వేడుక.. మ్యాచులన్నీ ముంబయిలోనే!!

IPL 2022: గుడ్‌ న్యూస్‌! ఇండియాలోనే ఐపీఎల్‌ వేడుక.. మ్యాచులన్నీ ముంబయిలోనే!!

IND vs SA: అతి విశ్వాసానికి పోయి భంగపడ్డ టీమ్‌ఇండియా.. తాహిర్‌ విమర్శలు!

IND vs SA: అతి విశ్వాసానికి పోయి భంగపడ్డ టీమ్‌ఇండియా.. తాహిర్‌ విమర్శలు!

IPL 2022: ఈ సారి ఐపీఎల్‌ వేదిక దుబాయ్‌ నై.. దక్షిణాఫ్రికాకు సై! మరి భారత్‌ సంగతేంటి?

IPL 2022: ఈ సారి ఐపీఎల్‌ వేదిక దుబాయ్‌ నై.. దక్షిణాఫ్రికాకు సై! మరి భారత్‌ సంగతేంటి?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

Konda Murali : కొండా మురళి తల్లిదండ్రుల స్థూపాల ధ్వంసం.. పరకాలలో తీవ్ర ఉద్రిక్తత !

Konda Murali :  కొండా మురళి తల్లిదండ్రుల స్థూపాల ధ్వంసం..  పరకాలలో తీవ్ర ఉద్రిక్తత !

Maruthi About Prabhas Movie: ప్ర‌భాస్‌తో సినిమా... కాదని చెప్పలేదు! అలాగని, కన్ఫర్మ్ చేయలేదు!

Maruthi  About Prabhas Movie: ప్ర‌భాస్‌తో సినిమా... కాదని చెప్పలేదు! అలాగని, కన్ఫర్మ్ చేయలేదు!