IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB
IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
TBC
TBC

Australian Open 2022: జకోవిచ్‌కు 12 నెలల జైలు శిక్ష తప్పదా! కొవిడ్‌ వచ్చినా బయట తిరిగిన ప్రపంచ నం.1

జకోవిచ్‌ చిక్కుల్లో పడ్డాడు! జైలుకు వెళ్లే పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చాడు. పైగా కొవిడ్‌ సోకినప్పుడు బయట తిరగడమే ఇందుకు కారణం!

FOLLOW US: 

Troubles increasing for Novak Djokovic:  ప్రపంచ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ చిక్కుల్లో పడ్డాడు! స్వీయ తప్పిదాలతో సంవత్సరం పాటు జైలుకు వెళ్లే పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. అంతేకాకుండా భారీ జరిమానా చెల్లించాల్సిన స్థితికి వచ్చేశాడు. ఆస్ట్రేలియా వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా కొవిడ్‌ సోకినప్పుడు బయట తిరగడమే ఇందుకు కారణం! మరికొన్ని రోజుల్లో అతడి భవితవ్యం తెలియనుంది.

అంతర్జాతీయ క్రికెట్లో అందరినీ ఊరిస్తోన్న ఒకే లక్ష్యం '21వ గ్రాండ్‌స్లామ్‌'. దానిని అందుకోవడం కోసమే నొవాక్‌ జకోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌కు సిద్ధమయ్యాడు. రెండు రోజుల క్రితం మెల్‌బోర్న్‌ విమానాశ్రయానికి చేరుకున్నాడు. వీసాలో కొవిడ్‌ టీకా తీసుకోలేదని ఉండటంతో అధికారులను ఆయన్ను అక్కడే నిలిపివేశారు. నిజానికి డిసెంబర్లో అతడికి కరోనా వైరస్‌ సోకింది. ఎలాగూ పాజిటివ్‌ వచ్చింది కాబట్టి ఒంట్లో యాంటీబాడీలు ఉంటాయి. కాబట్టి వ్యాక్సిన్‌ తీసుకోకున్నా ఫర్వాలేదన్నది అతడి ఉద్దేశం.

ఆస్ట్రేలియాలో కొవిడ్‌ ఆంక్షలు కఠినంగా ఉన్నాయి. టీమ్‌ఇండియా సైతం అక్కడ పర్యటించినప్పుడు క్వారంటైన్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అస్సలు మినహాయింపులే ఇవ్వడం లేదు. అయితే పాజిటివ్‌ వచ్చిన వాళ్లు వైద్య ధ్రువీకరణ పత్రం చూపిస్తే దేశంలోని అనుమతి ఇస్తున్నారు. కానీ జకోవిచ్‌ అలాంటి పత్రం ఇవ్వలేదు. అతడికి అవమానం జరిగిందటూ సొంత దేశం సెర్బియా సహా మిగతా ప్రపంచమూ అతడికి వంత పాడింది.

Also Read: IPL New Sponsor: వివో ఔట్‌! ఇకపై 'టాటా ఐపీఎల్‌'! చైనా కంపెనీకి గుడ్‌బై!!

Also Read: IPL Auction 2022 Date: క్రికెటర్లూ కాచుకోండి! ఇక డబ్బుల పండగే!! ఫిబ్రవరి 12, 13న ఐపీఎల్‌ మెగా వేలం

Also Read: Tata Group IPL Sponsor: మైదానంలో సిక్సర్ల వర్షం.. బీసీసీఐకి కాసుల వర్షం..! టాటా రావడంతో బోర్డుకు ఎంత డబ్బు వస్తోందంటే?

తీరా దర్యాప్తు చేస్తే విస్తుపోయే విషయాలు తెలిశాయి! గతేడాది డిసెంబర్‌ 16న జకోవిచ్‌కు కొవిడ్‌ సోకింది. దాంతో 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్లాడు. అక్కడే అతడు తప్పు  (ఉద్దేశపూర్వకమా!) చేశాడు. ఐసోలేషన్లో ఉంటే ఎవరినీ కలవొద్దు. అలాంటిది అతడు ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఓ విలేకరినీ కలిసి ఇంటర్వ్యూ ఇచ్చాడని తెలిసింది. దాంతో అతడు కొవిడ్‌ ఆంక్షలను ఉల్లంఘించాడని అర్థమైంది. ఇదిప్పుడు చినికి చినికి గాలివానగా మారింది. దాంతో 'మానవ తప్పిదం' సహజమేనంటూ నొవాక్‌ కొత్త పాట అందుకున్నాడు.

ఆస్ట్రేలియా చట్టాలు కఠినంగా ఉంటాయి. వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇవ్వడం నేరం. ఇందుకు గరిష్ఠంగా 12 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా వీసాను రద్దు చేసి 4,730 డాలర్లు జరిమానా విధిస్తారు. ఇప్పుడు సొంత దేశం సెర్బియా సైతం అతడు తప్పు చేశాడని అంటోంది. ఫైన్‌ కట్టించేలా కనిపిస్తోంది. మరో విషయం ఏంటంటే.. ఆస్ట్రేలియాకు వచ్చే ముందే జకోవిచ్‌ స్పెయిన్‌కు వెళ్లాడు. విషయం తెలియడంతో వారూ భారీ జరిమానా వడ్డించేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళో, రేపో అతడు ఆస్ట్రేలియా నుంచి సెర్బియా రావడం గ్యారంటీ!!

View this post on Instagram
 
A post shared by Novak Djokovic (@djokernole)

Published at : 13 Jan 2022 07:25 AM (IST) Tags: corona virus Novak Djokovic covid 19 Australian Open 2022 tennis

సంబంధిత కథనాలు

LSG vs RCB, Eliminator: ఎలిమినేటర్లో అందరి కళ్లూ కోహ్లీ, రాహుల్‌ పైనే! RCB, LSGలో అప్పర్‌ హ్యాండ్‌ ఎవరిదంటే?

LSG vs RCB, Eliminator: ఎలిమినేటర్లో అందరి కళ్లూ కోహ్లీ, రాహుల్‌ పైనే! RCB, LSGలో అప్పర్‌ హ్యాండ్‌ ఎవరిదంటే?

GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్‌ 'కిల్లర్‌' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్‌

GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్‌ 'కిల్లర్‌' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్‌

GT vs RR, Qualifier 1: జోస్‌ ది బాస్‌ - నాకౌట్‌లో బట్లర్‌ 89 - GT ముందు భారీ టార్గెట్‌ !

GT vs RR, Qualifier 1: జోస్‌ ది బాస్‌ - నాకౌట్‌లో బట్లర్‌ 89 - GT ముందు భారీ టార్గెట్‌ !

Maya Sonawane: మాయా! ఇదేం మాయ బౌలింగ్‌! వుమెన్స్‌ టీ20 ఛాలెంజ్‌లో వైరలైన బౌలింగ్‌ యాక్షన్‌

Maya Sonawane: మాయా! ఇదేం మాయ బౌలింగ్‌! వుమెన్స్‌ టీ20 ఛాలెంజ్‌లో వైరలైన బౌలింగ్‌ యాక్షన్‌

WT20 Challenge 2022: లేడీ సెహ్వాగ్‌ థండర్స్‌ ముందు సాగని హర్మన్‌ మెరుపుల్‌!

WT20 Challenge 2022: లేడీ సెహ్వాగ్‌ థండర్స్‌ ముందు సాగని హర్మన్‌ మెరుపుల్‌!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా

Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణ‌కు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు

Vegetable Rates: ఏపీలో కూరగాయల రేట్ల నియంత్రణ‌కు ప్రత్యేక యాప్, సీఎస్ ఆదేశాలు

Baramulla Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్- ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం

Baramulla Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్- ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం

Ananya Nagalla Latest Pics: జిల్ జిల్ జిగేల్ అనేలా జిమ్‌లో అనన్యా నాగళ్ళ

Ananya Nagalla Latest Pics: జిల్ జిల్ జిగేల్ అనేలా జిమ్‌లో అనన్యా నాగళ్ళ