Ashes Series 2021-22: యాషెస్ సిరిస్ కు ఆరు వికెట్ల దూరంలో కంగారూలు.. కష్టాల్లో ఇంగ్లీష్ జట్టు
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ మరో పరాభావం ముంగిట నిలిచింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.
మూడో టెస్టు తొలి ఇన్నింగ్సులో ఆసీస్ ను తక్కువ స్కోరుకే కట్టడిచేసినా.. ఆ ఆనందం ఇంగ్లండ్ కు ఎక్కువ సేపు ఉండకుండా.. చేయడంలో కంగారూలు సఫలమయ్యారు. బాక్సింగ్ డే టెస్టులో విజయం సంగతి అటుంచితే ఇంగ్లండ్ జట్టు.. డ్రా చేసిన చాలు అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు యాషెస్ సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయింది ఆ జట్టు. ఇప్పుడు మరో ఓటమికి దగ్గరలో ఉంది. మ్యాచ్‌లో రెండో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 31 పరుగులకే చేసింది. యాషెస్ ను నిలబెట్టుకునేందుకు.. ఆసీస్ కు మరో ఆరు వికెట్లు మాత్రమే చాలు. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతోంది.
ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు.. రెండు టెస్టుల్లో ఓడిపోయి.. ఒత్తిడిలో ఉంది. మూడో టెస్టులోనూ ఓటమికి అతి దగ్గరలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 185 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ 267 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టుకు 82 పరుగుల ఆధిక్యం లభించింది. మార్కస్ హారిస్ (76) అర్ధశతకంతో రాణించాడు.
ఇక రెండు రోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది ఇంగ్లీష్ జట్టు. హమీద్ (7), క్రాలే (5), మలన్ (0), జాక్ లీచ్ (0) దారుణంగా ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు. 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్ రూట్ (12)తో కలిసి ఆల్‌రౌండర్ స్టోక్స్ (2) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. ఈ కారణంగా 31/4తో రెండో రోజును ముగించింది ఇంగ్లాండ్. ప్రస్తుతానికి ఆసీస్ 51 పరుగుల ఆధిక్యంలో ఉంది.
మూడో టెస్టులో మరో మూడు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది. అయితే ఓటమిని తప్పించుకోవాలంటే.. ఇంగ్లండ్ జట్టు చాలా పోరాడాల్సి ఉంటుంది. ఓటమిని నుంచి బయటపడాలి అంటే.. కనీసం ఇంకో రోజున్నరైనా ఇంగ్లాండ్ నిలవాలి. అన్ని కుదిరి.. క్రీజులో ఉండి ఆసీస్ ముందు భారీ టార్గెట్ ను పెట్టాలి. మళ్లీ ఆ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానిస్తే ఇంగ్లాండ్ కు కనీసం టెస్టును డ్రా చేసుకునే ఛాన్స్ అయినా ఉంటుంది. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ఇంగ్లాండ్ కు ఆ అవకాశం కూడా అనుమానమే. కెప్టెన్ రూట్, ఆల్ రౌండర్ స్టోక్స్ మూడో రోజు ఎలా ఆడతారనేది ఆసక్తికర విషయం.
Also Read: Sreesanth, Ranji Trophy: జెర్సీలో నానీ అరిచినట్టే..! శ్రీశాంత్ భావోద్వేగం
Also Read: IND vs SA, Hanuma Vihari left: మా తెలుగు ఆటగాడు చేసిన తప్పేంటి? టీమ్‌ఇండియాపై విమర్శల వర్షం!!
Also Read: England Ducks 2021: అమ్మబాబోయ్.. అన్ని డకౌట్లా.. అత్యంత చెత్త రికార్డు సాధించిన ఇంగ్లండ్!