అన్వేషించండి
Advertisement
Asian Games 2023: భారత క్రికెట్ జట్టు స్వర్ణ సంబరం
Gold Medal: ఆసియా గేమ్స్ 2023లో టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణకాంతులు విరజిమ్మింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఫైనల్ వర్షం వల్ల రద్దవ్వడంతో టీమిండియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
అంచనాలను నిజం చేస్తూ ఆసియా గేమ్స్ 2023లో టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణకాంతులు విరజిమ్మింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఫైనల్ వర్షం వల్ల రద్దవ్వడంతో టీమిండియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అఫ్గానిస్థాన్ కంటే ర్యాంకింగ్‌లో ముందున్న భారత్.. పసిడి పతకాన్ని ఒడిసిపట్టింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ అఫ్గాన్‌ను బ్యాటింగ్‌కు అహ్వానించింది. పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న టీమిండియా బౌలర్లు.. అఫ్గాన్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు.
ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే అఫ్గాన్ ఓపెనర్ జుబీద్ అక్దారీని పెవిలీయన్‌కు చేర్చిన శివమ్ దూబే.. అఫ్గాన్ పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే మరో ఓపెనర్ మహమ్మద్ షెహజాద్‌ను అర్ష్‌దీప్ అవుట్ చేశాడు. వెంటనే నూర్ అలీ జర్దాన్ రనౌట్ కావడంతో అఫ్గాన్ 3 ఓవర్లలో 12 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత భారత బౌలర్లను అఫ్గాన్ బ్యాటర్లు కాసేపు నిలువరించారు. కానీ 18.2 ఓవర్ల వద్ద అఫ్గాన్ 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసిన దశలో మరోసారి వర్షం పడడంతో మ్యాచ్ రద్దయింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దవ్వడంతో అఫ్గాన్ కంటే ర్యాంకుల పరంగా ముందున్న భారత్‌ను పసిడి పతకం వరించింది. ఆఫ్ఘానిస్థాన్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
భారత్ ఫైనల్ ప్రయాణం
ఈ ఆసియా గేమ్స్‌లో భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్‌లో నేపాల్‌ను 23 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఆ తర్వాత సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 96 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. భారత్ తరఫున రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన చేశారు. తిలక్ వర్మ అజేయ అర్ధసెంచరీతో చెలరేగాడు. ఫైనల్స్‌లోనూ తిలక్ అద్భుతాలు చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. కెప్టెన్ రుతురాజ్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
అగ్ర జట్లకు అఫ్గాన్ షాక్ ఇచ్చిందిలా..
ఆఫ్ఘనిస్థాన్ ఈ ఆసియా గేమ్స్‌లో అద్భుతమే చేసింది. క్వార్టర్ ఫైనల్‌లో ఎనిమిది పరుగుల తేడాతో శ్రీలంకకు షాక్ ఇచ్చిన అఫ్గాన్ జట్టు... సెమీస్‌లో పాకిస్థాన్‌ను 4 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 115 పరుగులు చేయగా... అఫ్గానిస్థాన్ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అఫ్గాన్ తరఫున నూర్ అలీ జద్రాన్ 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ గుల్బాదిన్ 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగే తుదిపోరులోనూ భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నా వర్షం ఆటంకంగా మారింది. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్ సహా ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉన్న వేళ వారిని అడ్డుకోవడం అఫ్గాన్‌కు అంత తేలిగ్గా జరగకపోయేది.
ఆసియా గేమ్స్ ఫైనల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను చూడనందుకు అభిమానులు కొంత నిరాశ చెందారు. ఆసియా గేమ్స్‌లో మహిళల క్రికెట్ జట్టు ఇప్పటికే పసిడిని దక్కించుకోగా ఇప్పుడు పురుషుల హాకీ జట్టు కూడా స్వర్ణాన్ని సాధించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion