అన్వేషించండి

Anil Kumble-Virat Kohli rift: కుంబ్లే వల్లే డ్రస్సింగ్‌ రూమ్‌లో భయానక వాతావరణం: బీసీసీఐ మాజీ అధికారి వెల్లడి

డ్రస్సింగ్‌ రూమ్‌లో కోచ్‌ అనిల్‌ కుంబ్లేపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీదే పైచేయిగా ఉండేదని బీసీసీఐ మాజీ అధికారి రత్నాకర్‌ శెట్టి అన్నారు. ఆటగాళ్లకు అతడు మద్దతుగా నిలవకపోవడంతో ఆందోళన మొదలైందని పేర్కొన్నారు.

టీమ్‌ఇండియా డ్రస్సింగ్‌ రూమ్‌లో కోచ్‌ అనిల్‌ కుంబ్లేపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీదే పైచేయిగా ఉండేదని బీసీసీఐ మాజీ అధికారి రత్నాకర్‌ శెట్టి అన్నారు. ఆటగాళ్లకు అతడు మద్దతుగా నిలవకపోవడంతో ఆందోళన మొదలైందని పేర్కొన్నారు. అందువల్లే వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని వెల్లడించారు. ఈ సంఘటలన్నీ కుంబ్లే రాజీనామాకు దారితీశాయని వివరించారు. ఇవన్నీ ఆయన పుస్తకం 'ఆన్‌బోర్డ్‌: టెస్టు, ట్రయల్‌, ట్రయంప్‌, మై ఇయర్స్‌ ఇన్ బీసీసీఐ'లో వివరించారు.

'2017 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ చేతిలో టీమ్‌ఇండియా ఘోర పరాజయం తర్వాత అనిల్‌ కుంబ్లే రాజీనామా చేశారు. ఇవన్నీ భారత క్రికెట్లో క్రమంగా పెరుగుతున్న మూర్ఖత్వపు ఛాయలను ఎత్తి చూపించాయి' అని రత్నాకర్‌ శెట్టి అన్నారు. ఆటగాళ్లకు మద్దతుగా నిలవకపోవడం, డ్రస్సింగ్‌ రూమ్‌లో ఆందోళనకర వాతావరణం పెంచడంతో కుంబ్లేపై విరాట్‌ అసంతృప్తిగా ఉన్నాడని తెలిపారు.

'అనిల్‌ కుంబ్లే కోచ్‌గా కొనసాగేందుకు కొందరు ఇష్టపడటం లేదనడంలో సందేహమే లేదు. ఎందుకంటే కెప్టెన్‌, కోచ్‌ ఒకేతాటిపై లేరు. చూస్తుంటే కెప్టెన్‌దే పైచేయిగా అనిపించింది. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ చేతిలో ఓటమికి ముందు లండన్‌లో ఓ సమావేశం జరిగిందని నాకు తెలిసింది. దానికి విరాట్‌, అనిల్‌, జోహ్రీ, అమితాబ్‌ చౌదరి, డాక్టర్‌ శ్రీధర్‌ హాజరయ్యారు. అప్పుడు ఆటగాళ్లకు అండగా నిలవకుండా, డ్రస్సింగ్‌ రూమ్‌లో ఆందోళనకర వాతావరణం సృష్టించినందుకు కుంబ్లేపై విరాట్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు' అని రత్నాకర్‌ శెట్టి రాశారు.

ఆ ఏడాది ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో వరుస విజయాలు సాధించిన టీమ్‌ఇండియా ఫైనల్లో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత భారత క్రికెట్లో అనూహ్య పరిణామాలు మొదలయ్యాయి. అనిల్‌ కుంబ్లే, విరాట్‌ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు బయటకు వచ్చాయి. వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు గంగూలీ, సచిన్‌, లక్ష్మణ్‌ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కోహ్లీతో తనకు అభిప్రాయ బేధాలు ఉన్నాయని కుంబ్లే రాజీనామా చేశాడు. ఆ తర్వాత రవిశాస్త్రి కోచ్‌గా వచ్చాడు.

Read Also: IND vs WI: విరాట్‌ ఊపు తీసుకొస్తే.. రోహిత్‌ ప్రశాంతత తెస్తాడన్న మాజీ ఆల్‌రౌండర్‌

Read Also: Rohit Sharma Captaincy: రోహిత్‌ కెప్టెన్సీలో ఇష్టమైంది అదే! కోహ్లీ సారథ్యంలో ఆడిన యువ పేసర్‌ అభిప్రాయం ఇదీ!

Also Read: Tata Steel Q3 Net Profit: టాటా స్టీల్‌! ఉక్కు కన్నా గట్టిగానే లాభాలు!

Also Read: Tata Nexon EV: అదిరిపోయే కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు.. లాంచ్ త్వరలోనే.. ఒక్కచార్జ్‌తో 500 కిలోమీటర్లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Embed widget