Ramayana: రామాయణం ఎలా చదవాలో తెలుసా? చదివేటప్పుడు ఈ తప్పులు చేయకండి!
Ramayana: సరైన సంస్కారాలు, పద్ధతుల ప్రకారమే రామాయణాన్ని చదవాలి. రామాయణాన్ని సరైన పద్ధతిలో చదవడం ఎలా..? రామాయణం చదివేటప్పుడు ఈ నియమాలు తప్పక పాటించాలి.
Ramayana: రామాయణం అంటే... రాముని చరిత్ర అని ఎవరైనా చెబుతారు. కానీ అది నిజం కాదు. రామాయణం అంటే రాముని మార్గం అని అర్థం. రామాయణం చదువుకోవాల్సింది రాముడి కథ విని ఆనందించడానికి కాదు.. రాముడు నడిచిన మార్గం తెలుసుకుని ఆచరించడానికి చదువుకోవాలి. న్యాయం అంటే ఏమిటి? ధర్మం అంటే ఏమిటి? వాటిని ఎలా ఆచరణలో పెట్టాలి? మాటకు కట్టుబడి ఎలా బతకాలి? ఎలాంటి కష్టమొచ్చినా మాటతప్పకుండా ఎలా బతకాలి? వంటి అనేక అంశాలు తెలుసుకోవడానికి రామాయణం చదువుకోవాలి.
Also Read : నిజమైన ఆదిపురుషుడు ఎవరో తెలుసా!
సాధారణంగా హిందువుల ఇళ్లలో రామాయణ పారాయణ చేస్తుంటారు. రామాయణం పఠించడం వల్ల మన శరీరంతో పాటు మనస్సు కూడా శుద్ధి అవుతుందని నమ్ముతారు. రామాయణం చదివేటప్పుడు లేదా పారాయణం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. సరైన సంస్కారాలు, పద్ధతుల ప్రకారం చదివినప్పుడే రామాయణ పఠనం వల్ల కలిగే ప్రయోజనం సిద్ధిస్తుంది. రామాయణాన్ని సరైన పద్ధతిలో చదవడం ఎలా..? రామాయణం చదివేటప్పుడు ఈ నియమాలు తప్పక పాటించాలి.
ఈ భాగాన్ని మర్చిపోకుండా చదవండి
ప్రతిరోజూ రామాయణం చదువుతున్నప్పుడు యుద్ధకాండ చివరి భాగమైన రామాయణ మహాత్మ్యం తప్పకుండా చదవాలి. అప్పుడే రామాయణం మొత్తం పఠించినంత పుణ్యఫలం లభిస్తుంది.
ఈ నియమం తప్పనిసరి
రామాయణం పారాయణం చేసేటప్పుడు మీరు పాత రామాయణ పుస్తకాన్ని ఉపయోగించకూడదు. బదులుగా, పాడైపోని పుస్తకాన్ని ఉపయోగించాలి. రామాయణం చదివేటప్పుడు చిరిగిన లేదా పాడైపోయిన పుస్తకాన్ని ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.
స్పష్టంగా ఉచ్ఛరించాలి
రామాయణం చదివేటప్పుడు అందులో అన్ని పదాలను సరిగ్గా చదవాలి, ప్రతిదీ స్పష్టంగా చదవాలి. రామాయణాన్ని ఏకాగ్రతతో చదవాలి. ఉత్తరాభిముఖంగా రామాయణం చదవడం మంచిది.
రామ నామాన్ని పఠిస్తూ ప్రారంభించండి
బాలకాండలోని ఏదైనా భాగాన్ని పఠించే ముందు శ్రీరామ రామ రామ అని పఠించాలి. ఒక రోజు పారాయణాన్ని ముగించడానికి మంచి విషయాలతో ప్రారంభించి, మంచి విషయాలతో ముగించండి. యుద్ధం, కలహాలు, మరణం వంటి వివరణాత్మక అంశాలతో పారాయణం ప్రారంభించకూడదు.
సంధ్యా సమయంలో చదవవద్దు
మరుసటి రోజు పఠనం ముందురోజు అధ్యాయాన్ని చదవడం ద్వారా ప్రారంభించాలి. సాయంత్రం పూట రామాయణం చదవడం అరిష్టమని ఒక నమ్మకం. దీని వల్ల హనుమంతుడికి కోపం వస్తుందని కూడా నమ్ముతారు. అయితే ఇది నిజం కాదు. రామాయణం పఠించేటప్పుడు, హనుమంతుడితో పాటు దేవతలందరూ దానిని వింటారని అందువల్ల ఈ కారణంగా ఆలయాల్లో సాయంత్రం పూజలు ఆగిపోతాయని నమ్ముతారు. అందుకే సంధ్యా సమయంలో రామాయణం చదవకూడదని అంటారు.
Also Read : వివిధ రూపాల్లోని హనుమంతుడిని పూజిస్తే వచ్చే ఫలితాలివే
రామాయణం పఠించే ముందు ఇలా చేయండి
సాయంత్రం తప్ప ఎప్పుడైనా రామాయణం చదవవచ్చు. అయితే రామాయణం చదివే ముందు భగవంతుడి ముందు దీపం వెలిగించి, రామనామాన్ని స్మరించుకుని రామాయణం పఠించాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.