అన్వేషించండి

Women Wallet Tips: మహిళలు పర్స్/హ్యాండ్‌బ్యాగ్ లో ఈ వస్తువులు ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది!

Women Wallet Money Tips: హ్యాండ్ బ్యాగ్ లో ఫోన్, డబ్బులు మాత్రమే కాదు.. ఇవి కూడా ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుందని చెబుతున్నారు పండితులు...అవేంటో తెలుసుకోండి...

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మహిళలు పర్సులో వెండి నాణెం, గోమతి చక్రం ఉంచాలి.
  • ఎర్ర కాగితంపై కోరిక రాసి పర్సులో పెట్టుకోవాలి.
  • శుద్ధి చేసిన రావి ఆకు, లక్ష్మీదేవి బియ్యం గింజలు ఉంచాలి.
  • పనికిరాని వస్తువులు తీసివేసి, పర్సు శుభ్రంగా ఉంచుకోవాలి.

Women Wallet Tips In Telugu:  వాస్తు,జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని శుభప్రదమైన వస్తువులను మహిళలు తమ పర్సులు లేదా హ్యాండ్ బ్యాగ్స్ లో ఉంచుకోవడం వల్ల శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు మీపై ఉంటాయని చెబుతున్నారు పండితులు. వెండినాణేలు, గోమతిచక్రం సహా ఇతర సులభమైన పరిహారాల గురించి ఇక్కడ తెలుసుకోండి. 

మహిళల పర్సులు కేవలం డబ్బు దాచుకునే చోటు మాత్రమే కాదు.. సంపద పెరుగుదలకు, శ్రేయస్సు, సంతోషానికి చిహ్నం అని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. పర్సులో శుభప్రదమైన వస్తువులు ఉంచడంతో పాటూ ఎప్పటికప్పుడు పనికిరాని పేపర్లు తొలగించి, నోట్లను ఓ క్రమపద్ధతిలో ఉంచితే  లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం. మీరు తప్పనిసరిగా అనుసరించాల్సిన కొన్ని పరిహారాలు ఇక్కడున్నాయి.

ప్రతికూల శక్తి , వాస్తు దోషాలకు లవంగంతో ప్రభావంతమైన 5 సులువైన చిట్కాలు!

ఎర్రటి కాగితంపై మీ కోరికను రాయండి

మీ కోరికను, ఎప్పటినుంచో పెండింగ్ లో ఉండిపోయిన పనిని చిన్న ఎర్రటి కాగితంపై రాసి పర్సులో ఉంచుకుంటే శుభం జరుగుతుందట. పెండింగ్ లో ఉన్న ఆ పని పూర్తవుతుందని, సానుకూల శక్తితో మీ కోర్కెను నెరవేరుస్తుందని నమ్మకం. ఈ పరిహారం ఆర్థిక లాభం , విజయం కోసం కొత్త మార్గాలను తెరవడానికి కూడా సహాయపడుతుంది.

లక్ష్మీదేవి వెండి నాణెం

మీ పర్సులో లక్ష్మీదేవి ఫొటో ఉన్న వెండి నాణెం ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే, లక్ష్మీదేవికి సమర్పించిన 21 బియ్యపు గింజల చిన్న ప్యాకెట్‌ను ఉంచుకోవడం శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ఈ ఆచారం ఆర్థిక స్థిరత్వానికి , సంపద వృద్ధికి చిహ్నంగా పరిగణిస్తారు.

గంగాజలంలో శుద్ధి చేసిన రావి ఆకు

శనివారం రోజున గంగాజలంతో శుద్ధి చేసిన రావి ఆకును మీ పర్సులో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తిని తొలగించి, ఆర్థిక అడ్డంకులను తగ్గిస్తుంది. 

గోమతి చక్రం

గోమతి చక్రాన్ని పర్సులో పెట్టుకుంటే ఆనందం, శ్రేయస్సు మీ సొంతం అవుతుంది.

పనికిరాని వస్తువులు తీసేయండి

మీ పర్సులో పాత నోట్లు, చిరిగిన కాగితాలు , పనికిరాని వస్తువులను ఉంచుకోవడం ప్రతికూలతను పెంచుతుంది, సంపద నిలవకుండా చేస్తుంది. అంతేకాకుండా, మురికి చేతులతో పర్సును తాకడం , నోట్లను చిందరవందరగా ఉంచడం మానుకోవాలి. శుభ్రత ఉండే దగ్గరే అమ్మవారు కొలువై ఉంటుంది

ముల్తానీ మట్టి కేవలం చర్మ సంరక్షణకే కాదు..వాస్తుదోష నివారణకు కూడా!

సానుకూల ఆలోచనలు

సంపద వృద్ధి చెందాలంటే కేవలం పాటించే చర్యలు, పరిహారాలు మాత్రమే కాదు... సానుకూల ఆలోచనలు, డబ్బు పట్ల గౌరవం ఉండడం కూడా ప్రధానం. క్రమశిక్షణ, మంచి అలవాట్లు కూడా ఆనందాన్నిస్తాయి, కెరీర్లో ఉన్నతిని సూచిస్తాయి. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

బంగారం దాచుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తే నష్టమే! వాస్తు ప్రకారం సరైన దిశ, జాగ్రత్తలు తెలుసుకోండి

Frequently Asked Questions

మహిళలు తమ పర్సులో ఏ శుభప్రదమైన వస్తువులు ఉంచుకోవాలి?

మహిళలు తమ పర్సులో వెండి నాణేలు, లక్ష్మీదేవి ఫోటో ఉన్న నాణెం, 21 బియ్యపు గింజల ప్యాకెట్, గంగాజలంతో శుద్ధి చేసిన రావి ఆకు, గోమతి చక్రం వంటివి ఉంచుకోవాలి.

పర్సులో కోరికను రాసుకుని ఉంచుకుంటే ఏమవుతుంది?

ఎర్రటి కాగితంపై కోరికను రాసి పర్సులో ఉంచుకుంటే ఆ పని పూర్తవుతుందని, సానుకూల శక్తితో కోరిక నెరవేరుతుందని నమ్మకం. ఇది ఆర్థిక లాభం, విజయం కోసం కొత్త మార్గాలను తెరుస్తుంది.

పర్సును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలా?

అవును, పర్సులో పాత నోట్లు, చిరిగిన కాగితాలు, పనికిరాని వస్తువులు ఉంచుకోవడం వల్ల ప్రతికూలత పెరుగుతుంది. శుభ్రంగా, క్రమపద్ధతిలో ఉంచుకుంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

సంపద వృద్ధికి పర్సులో ఉంచే వస్తువులు మాత్రమే సరిపోతాయా?

కాదు, సంపద వృద్ధికి సానుకూల ఆలోచనలు, డబ్బు పట్ల గౌరవం, క్రమశిక్షణ, మంచి అలవాట్లు కూడా చాలా ముఖ్యం. ఇవి ఆనందాన్ని, కెరీర్లో ఉన్నతిని సూచిస్తాయి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget