అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

Spirituality: రోజూ ఉదయాన్నే నిద్రలేస్తూ మీరు పాటించాల్సిన 6 ముఖ్యమైన విధులివే..ఎందుకంటే!

Spirituality: ఈ రోజు ప్రారంభం బావుంది , ప్రశాంతంగా ఉంది..అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తయ్యాయి.. ఈమాట ఎవరినుంచైనా విన్నారా? ఈ మాట చెప్పారంటే..వాళ్లు కొన్ని నియమాలను విధిగా పాటిస్తున్నారని అర్థం..

Spirituality: నిద్రలేచిన వెంటనే కొందరు చేతులు చూసుకుంటారు...మరికొందరు అద్దంలో ముఖం చూసుకుంటారు..ఇంకొందరు దేవుడి ఫొటో చూసి నమస్కరిస్తారు..ఇంకా తల్లిదండ్రుల ముఖం చూసి నిద్రలేచేవారు కొందరు, పిల్లలు ముఖం, జీవిత భాగస్వామి ముఖం చూస్తారు. చాలామందికి అసలు ఇలాంటి సెంటిమెంటే ఉండదు. సెంటిమెంట్ లేనివారిసంగతి సరే..మరి వీటిని అనుసరించేవారి సంగతేంటి? పొద్దున్నే నిద్రలేవడం మాత్రమే కాదు...నిత్యం అనుసరించాల్సిన ముఖ్యమైన విషయాలు 6 ఉన్నాయి...అవేంటో చూద్దాం..

Also Read: ఆగష్టులో పుట్టినవారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, విధేయత అన్నీ ఎక్కువే..ఆ ఒక్క విషయంలో దురదృష్టవంతులు!

1. సూర్యోదయానికి ముందు నిద్రలేవాలి

దీనినే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం అంటారు. సూర్యోదయానికి 90 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ అంటే సరస్వతి దేవి. మనలో బుద్ధి ప్రభోదం చెందే సమయం కాబట్టే దానిని బ్రాహ్మీ ముహూర్తం అని పిలుస్తారు. ఈ ముహూర్తాన్ని పూర్వం ఘడియలలో లెక్కపెట్టేవారు. ఘడియ అంటే 24 నిముషాలు అని అర్థం. ఓ ముహూర్తం అంటే 2 ఘడియలకాలం..అంటే.. 48 నిముషాలు. సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటిది 'బ్రహ్మముహూర్తం'. హిందూ ధర్మశాస్త్రాల్లో ఈ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది. ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్యంగా ఉంటుంది. ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి ఉంటుంది..అందుకే ముహూర్తంలో నిద్రలేచేవారిలో సానుకూల ఆలోచనలు వస్తాయి. ఈ సానుకూలశక్తితో ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తారు. ఈ ముహూర్త సమయంలో వీచేగాలి అమృతంతో సమానంగా భావిస్తారు. 
 
వర్ణా కీర్తి మతిం లక్ష్మీ స్వాస్త్యమాయుశ్ఛ విదంతి|
బ్రహ్మ ముహూర్తే సంజాగ్రచ్ఛివ పంకజ యథా||

బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల  ఈ సమయంలో నిద్రలేవడం వల్ల అందం, బలం, జ్ఞానం, తెలివితేటలు, ఆరోగ్యం వృద్ధి చెందుతాయిని పై శ్లోకానికి అర్థం. 

2. అరచేతులు చూసుకుని నమస్కరించాలి

నిద్రలేచిన వెంటనే చాలామంది చేతులు చూసుకుంటారు. ఇది చాలా మంచి అలవాటు అని చెబుతారు పండితులు.. ఎందుకు అనేది ఈ శ్లోకంలో వివరించారు...
 
"కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి
కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం"

కరాగ్రే వసతే లక్ష్మీ - అరచేయి పైభాగనంలో శ్రీ మహాలక్ష్మి
కర మధ్యే సరస్వతి - చేయి మధ్యభాగంలో సరస్వతి
కర మూలే స్థితా గౌరీ - మణికట్టు వద్ద  గౌరీదేవి కొలువై ఉంటారు.
ప్రాతః కాలంలో ఈ శ్లోకం చదివి అరచేతులను కళ్లకు అద్దుకుని లేవడం ద్వారా..ఆ మూడు శక్తులను స్మరించినట్టు. 

ఏ పని చేసినా చేతి చివరిభాగం వేళ్లదే ప్రధాన పాత్ర..అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సరస్వతీ కటాక్షం సిద్ధించాలంటే అరచేతుల్లో పుస్తకాన్నుంచి శ్రద్ధగా చదవాలని అర్థం. పుస్తకం పట్టుకోవడంపై మీకుండే నిబద్ధతే మీ భవిష్యత్ ని నిర్ణయిస్తుంది. పైకి లేచేటప్పుడు చేయి మణికట్టు దగ్గర బలాన్నుంచి నిలబడతాం..ఆ శక్తి స్వరూపమే గౌరీ దేవి. నీ చేతుల ఆధారంగా ఎలా పైకి లేస్తావో.. కష్టం వచ్చినప్పుడు అలాగే పైకి లేచి నిలబడుఅని అర్థం.  చేతులారా చేసుకున్నావ్ అనే మాట వినే ఉంటారు కదా.. అంటే ఏదైనా నీ చేతుల్లోనే ఉందని ఆంతర్యం. అందుకే నిద్రలేస్తూ అరచేతులకు నమస్కరించి లేస్తే అంతా శుభమే అని చెబుతారు.  

 Also Read: ఆగష్టులో రాశిమారుతున్న బుధుడు, శుక్రుడు, కుజుడు, సూర్యుడు.. ఈ 4 రాశులవారికి సంపద, సంతోషం పెరుగుతుంది!

3. భూమికి నమస్కారం చేయాలి

సముద్ర వసనే దేవీ పర్వతస్థన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే

నిద్రలేచిన తర్వాత కాలు కింద మోపే ముందు ఈ శ్లోకం చదవాలి. వాసం అంటే దుస్తులు... సముద్రవసనే దేవీ  అంటే సముద్రాన్ని వాసంగా ధరించిన దేవీ అని అర్థం. భూమి 70 శాతం భూమి నీటితో కప్పి ఉంటుంది. భారతీయులు శరీరాన్ని 70శాతం దుస్తులతో కప్పుకున్నట్టే.. భూమిపై 70శాతం నీరున్న ప్రదేశాన్ని దుస్తులుగా ధరించావమ్మా అని అర్థం. పర్వత స్థన మండలే అంటే పర్వతాలను స్థానాలుగా కలిగిన దేవి... అంటే బిడ్డలు అడగకుండానే ఆకలి తెలుసుకుని పాలిచ్చే తల్లి అని అర్థం. అలాంటి భూదేవిపై కాలుమోపుతున్నందుకు క్షమించమని అడుగుతూ అడుగు నేలపై పెట్టాలి. 

4. సుమంగళ ద్రవ్యాలు చూడాలి

చాలామంది నిద్రలేవగానే వివాహితులు అయితే మంగళసూత్రం తీసి కళ్లకు అద్దుకుంటారు. ఇలా చేస్తే సుమంగళి యోగం అని భావిస్తారు. అయితే నిద్రలేవగానే మంగళద్రవ్యాలు ఏం చూసినా ఆరోజంతా శుభం జరుగుతుంది. మంగళద్రవ్యాలంటే అగ్ని, బంగారం, దేవుడి పటం, అద్దం ...వీటిలో ఏం చూసి నిద్రలేచినా మంచిదే 

5. తల్లిదండ్రులకు నమస్కరించాలి

6. భవిష్యత్ ని ఉన్నతంగా తీర్చిదిద్దే గురువులను తలుచుకుని నమస్కరించాలి 
 
మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ 

Also Read: పేరు మార్చుకుంటే అదృష్టం కలిసొస్తుందా.. ఇందులో నిజమెంత!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
AAA Rangoli Contest: ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
Kurnool News: కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Embed widget