అన్వేషించండి

Basant Panchami : మహా విష్ణువుకు, సరస్వతి దేవికి మధ్య యుద్దం ఎందుకు జరిగిందో తెలుసా.. అందుకే పాతాళానికి వెళ్లిందా..?

Basant Panchami : వసంత పంచమి పండుగను ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున జరుపుకుంటారు. అదే సమయంలో, సరస్వతీ దేవికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి.

Basant Panchami : హిందూ మతంలో వసంత పంచమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ముఖ్యంగా చదువుల తల్లి సరస్వతి దేవిని అత్యంత పూజా, వేడుకలతో ప్రార్థిస్తారు. గ్రంథాల ప్రకారం, వసంత పంచమిని ఋషి పంచమి అని కూడా అంటారు.  హిందూ క్యాలెండర్ ప్రకారం, వసంత పంచమిని ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున జరుపుకుంటారు. అదే సమయంలో, మాతా సరస్వతికి సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి విష్ణువు, సరస్వతి దేవి మధ్య జరిగిన యుద్దం. అసలు ఇది ఎందుకు జరిగిందన్న విషయాన్ని సత్యార్థ్ నాయక్ పుస్తకం 'మహాగాథ' నుంచి ఇప్పుడు తెలుసుకుందాం.  

ఒకసారి సరస్వతి మాత బ్రహ్మదేవుడిని అడిగిందట.. లక్ష్మి, పార్వతీ దేవీ.. తమ ముగ్గురిలో అత్యంత శక్తివంతులు, ప్రత్యేకమైనవారు ఎవరు అని. దానికి బ్రహ్మా బదులిస్తూ.. "మీ ముగ్గురూ శక్తికి భిన్నమైన కోణాలు. ప్రకృతి తల్లికి, సృష్టికి జ్ఞానం కావాలి అందుకే నువ్వు నా భార్యవయ్యావు. రక్షణ కోసం సాధనాలు అవసరం, అందుచేత లక్ష్మీ మాత  శ్రీహరికి భార్య అయింది. నాశనాకి శక్తి అవసరం అందుకే మహాదేవ్ కి పార్వతి భార్య అయిందని" చెప్పాడు. మీ ముగ్గురూ పవిత్ర స్త్రీలు.  మీ వల్లే మేం దైవత్వాన్ని పొందాం. ఇందులో ఎలాంటి పోటీ లేదు. అందరూ సమానులే అని చెప్పాడు. కానీ సరస్వతి దేవీ ఆ మాట నమ్మలేదు. నేను అడగ్గానే మీ మనసులో ఓ పేరు మెదిలిందని తనకు తెలుసని, ఆ పేరు చెప్పాలని అడగడంతో.. దానికి బదులుగా, నేను ఒకవేళ చెప్పాల్సి వస్తే లక్ష్మీ దేవి పేరు చెబుతానని అన్నాడు. అవి విన్న సరస్వతి దేవీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత రోజు ఆమెను ఎక్కడ వెతికినా కనిపించలేదు. ఈ సమయంలోనే బ్రహ్మ లోక కల్యాణం కోసం యాగం తలపెట్టాడు. ఇందులో పాల్గొనేందుకు సకల దేవతలూ తరలివచ్చారు. గంగా నది నుంచి నీరు, ఇంద్రుని ఉద్యానవనం నుంచి పువ్వులు తెచ్చారు. అలా యాగాన్ని ప్రారంభించగానే.. అందరికీ వీణ శబ్ధం వినిపించింది. అంతకుముందు చూడని విధంగా సరస్వతి దేవీ దర్శనమిచ్చింది. బాధతో వీణ వాయిస్తోన్న సరస్వతి దేవీ వేళ్ల నుంచి రక్తం కారుతోంది. కళ్లు మండుతున్నట్టు కనిపించాయి. ఆ వీణ ప్రకంపనలకు ముల్లోకాలు వణికిపోయాయి. అలా వాయిస్తూ వాయిస్తూండగా వీణలోని ఓ తీగ తెగిపోయింది.

అప్పుడే బ్రహ్మదేవుడు కూడా సరస్వతి దేవిని వీణ వాయించడం ఆపమని కోరతాడు. దానికి 'నేను మీ మాట వినాలి, మీరు నన్ను అవమానిస్తారా? మొదట ఎవరూ లేనప్పుడు ఆపై బహిరంగంగా.. ఇక్కడ శ్రీ హరి, లక్ష్మీ మాత సమేతంగా, పార్వతి మాత మహాదేవునితో, ఇంద్రుడు ఇంద్రాణితో కలిసి ఉన్నారు. కానీ మీకు మీ భార్యను అంగీకరించడం ఇష్టం లేదని సరస్వతి చెప్పింది. దీనికి సమాధానంగా,  'నేను నీ కోసం అన్నిచోట్లా వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. నువ్వు ఖచ్చితంగా ఈ రోజు తిరిగి వస్తారని నేను ఆశించాను. అనుకున్నట్టుగానే వచ్చావు. రా.. వచ్చి నాతో చేతులు కలిపి యాగంలో పాల్గొను అని బ్రహ్మ చెప్పాడు. తామంతా లోక కల్యాణం కోసం యాగం చేస్తున్నామని, నువ్వు కూడా ఇదే కోరుకుంటున్నావని అనుకుంటున్నానని చెప్పాడు. నాపై ఉన్న కోపాన్ని ఈ యాగంపై చూపించొద్దని సూచించాడు. అప్పుడు సరస్వతి.. లక్షీ దేవివైపుకు చూస్తూ.. "నువ్వు నా కంటే ముందు ఆమెను ఎన్నుకున్నావు.. జ్ఞానం కంటే సంపద, సృజనాత్మకత కంటే శ్రేయస్సు గొప్పదని చూపించారని, అవి ఈ యాగాన్ని పూర్తి చేయగలవా" అని అడిగింది. అంతలోనే నేను ఉన్నంతవరకు వారి అవసరం ఉండదు అంటూ ఓ గొంతు వినిపించింది. అది విష్ణువు స్వరం. 'నీవు వీణలో గందరగోళానికి చోటు కల్పించావు, దానివల్ల నీ రాగాలు అపవిత్రం అయ్యాయి. ఇది సృష్టిలోని మాధుర్యాన్ని పాడు చేసింది. మీలో ఉన్న జ్ఞాన సాగరం కలుషితమైంది. మీరు కల్యాణ యజ్ఞాన్ని ప్రమాదంలో పడేస్తుంటే, నేను దాన్ని చూస్తూ ఊరుకోను. ఈ యాగాన్ని నాశనం చేసే ముందు నువ్వు నన్ను నాశనం చేయాలి' అని చెప్పాడు.

అది విన్న సరస్వతికి విపరీతమైన కోపం వచ్చింది. అగ్నిపర్వతంలా బద్దలైంది. దీంతో అంతా చీకటిగా మారిపోయింది. కమలం, హంస అన్నీ నలుపు రంగులోకి మారాయి. ఆమె తన రూపాన్ని మార్చుకుని భారీ నరకాగ్ని రూపంలో మారడంతో విష్ణువు దాన్ని వెంటనే చల్లార్చాడు. దీంతో సరస్వతి కపాలిక శక్తిని చూపించింది. దాన్నీ విష్ణువు నాశనం చేశాడు. ఆ తర్వాత వచ్చిన కాళికా శక్తి కూడా విష్ణువు ముందు విఫలమైంది. దీంతో దేవి కోపంతో రగిలిపోయింది. కళ్లు రక్తంలా ఎర్రబడింది. హంస అరవడం ప్రారంభించింది, కమలం ఎండిపోయింది. అందరూ అందరూ చూస్తుండగానే సరస్వతీమాత రూపం మారడం మొదలైంది. ఆమె ద్రవంగా మారుతోంది. ఆమె శరీరం కరిగిపోతోంది. తల్లి సరస్వతి ఒక పెద్ద సుడిగుండం రూపంలో అవతరించి.. భూమిలో ఓ పెద్ద కొలనును సృష్టించింది. యాగాన్ని ఆపలేక.. సరస్వతి దేవి అలా చేస్తోందని, ఆ నీటితో ముంచెత్తాలని చూస్తోందని బ్రహ్మ దేవుడు చెబుతున్న సమయంలో.. సరస్వతి కోపంతో భీకరంగా ప్రవహించడం మొదలెట్టింది. అప్పుడు లక్మీ దేవి.. శ్రీహరి ఆమెను శాంతింపజేయగలడా అని అడిగింది.. దానికి శివుడు.. అవును అని తల ఊపాను.. తాను ఎలా అయితే గంగంను, కాళిని శాంతింపజేశాడో అలానే అని చెప్పాడు.

సరస్వతి నదీ ఉదృతంగా ప్రవహిస్తుండగా.. నది అడ్డంగా విష్ణువు పడుకున్నాడు. శాశ్వతమైన నిద్ర భంగిమలో కనిపించాడు. నీటి ప్రవాహాన్ని ఆపేందుకు సాయ శక్తులా ప్రయత్నిస్తున్నాడు. అంతకంతకూ పెరుగుతూ సరస్వతి, విష్ణువు దగ్గరికి సమీపిస్తోంది. అది చూసిన లక్ష్మీ దేవి నివ్వెరపోయింది. ఇది దేవతలందరికీ ఇబ్బందిగా అనిపించింది. అప్పుడు ఆ నది అకస్మాత్తుగా మలుపు తీసుకుని వేరే వైపుకు ప్రవహించడం ప్రారంభించింది. దీని వల్ల భూమిలో ఒక రంధ్రం ఏర్పడింది. అలా ఆమె పాతాళానికి వెళ్లింది. ఆ విధంగా సరస్వతి కనిపించకుండా, విష్ణువు ముందు లొంగిపోయింది. అప్పుడు పార్వతి శివుడిని చూస్తూ దేవుడు దేవిపై మరోసారి పట్టు సాధించాడు అని చెప్పింది. అందుకు శివుడు పార్వతికి పువ్వులు సమర్పిస్తూ.. 'దేవత మహిషాసురుడిని, రక్తబీజ్‌ని కూడా నియంత్రించింది. నేను శరభ రూపంలో నృసింహుడిని శాంతింపజేశాను. శ్రీ హరి నా రుద్ర తాండవమును శాంతపరిచాడు. ఇక్కడ దేవుడా, దేవుతా అనేది విషయం కాదు, ప్రపంచాన్ని భయపెడుతున్న విషాన్ని ఎదుర్కోవడమే, విషానికి లింగం అవసరం లేదు' అని శివుడు చెప్పాడు.

Also Read : Vasant Panchami Special 2025 : వసంత పంచమి సరస్వతీ పూజ.. పిల్లలతో చదివించాల్సిన శ్లోకాలు ఇవే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget