Rath Yatra 2025: జగన్నాథ రథ యాత్ర మధ్యలో వదిలేస్తే ఏమవుతుంది?
Jagannath Rath Yatra 2025: జగన్నాథ రథ యాత్రకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. అయితే ఈ యాత్రను మధ్యలోనే వదిలేస్తే ఏమవుతుందో తెలుసా..

Jagannath Rath Yatra 2025: జగన్నాథ రథయాత్ర హిందువలకు అత్యంత పవిత్రమైన పండుగ. ఇది ఏటా ఒడిశా పూరిలో ఘనంగా నిర్వహిస్తారు. భారతదేశంలోనే కాదు ఇతర రాష్ట్రాలు, నగరాల్లోనూ రథయాత్ర నిర్వహిస్తారు.
జగన్నాథుడు రథంపై నగరం మొత్తం విహరిస్తాడు. భక్తులంతా ఉత్సాహంగా రథయాత్రలో పాల్గొంటారు. భక్తుల నమ్మకం ప్రకారం ఒక వ్యక్తి రథయాత్రలో పాల్గొంటే ఆ వ్యక్తి చెడు రోజులు త్వరగా ముగుస్తాయని, మోక్షానికి మార్గం తెరుచుకుంటుంది.
జగన్నాథ రథయాత్ర 10 రోజుల పాటు జరుగుతుంది. ఈ యాత్రలో పది రోజులు పాల్గొనాలని అనుకుంటారు. అయితే ఏవైనా కారణాలతో యాత్ర మధ్యలోనే వదిలేసి వెళ్లాల్సివచ్చినా, సగమే చేసినా ఏదైనా లోపం ఉంటుందా?
ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర జూన్ 27 న ప్రారంభమవుతుంది. ఈ సమయంలో బలభద్ర, సుభద్ర దేవి, భగవాన్ జగన్నాథుడు గుండిచా ఆలయానికి వెళతారు. తిరిగి పది రోజులకు ఆలయానికి చేరుకుంటారు.
జగన్నాథ రథయాత్రను సగం వదిలివేస్తే ఏమవుతుంది?
మతపరమైన నమ్మకాల ప్రకారం, మీరు జగన్నాథ రథయాత్రకు వెళుతుంటే.. ఆకస్మికంగా వచ్చినా ప్రత్యేక పరిస్థితి కారణంగా మీరు యాత్రను మధ్యలో వదిలివేయవలసి వస్తే, దానివల్ల ఎలాంటి చెడు జరిగిపోదు. భగవాన్ జగన్నాథుడు భక్తులకు ఏమివ్వాలో తెలుసు..మీరు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు నిజమైన యాత్రలో పాల్గొంటే చాలు..దానివల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి.
జగన్నాథుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా?
జగన్నాథుని విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చినట్టైతే దానిని సరైన స్థలంలో ఉంచాలని గుర్తుంచుకోండి. విగ్రహాన్ని ఎల్లప్పుడూ కొన్ని మూలల్లో కాకుండా, కేంద్రీకృత స్థలంలో ఉంచడం మంచిది. పూజా గదిలో పెట్టుకోవచ్చు. ఇంట్లో భగవాన్ జగన్నాథుని పూజించడానికి మీరు మొదట విగ్రహాన్ని పువ్వులతో అలంకరించాలి దానిపై చందనం పూయాలి. పూలతో పూజించాలి.
కృష్ణాష్టకం
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ ।
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ ।
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ ।
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ ।
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ ।
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ ।
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ ।
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.
జగన్నాథ రథయాత్ర వెనుక రహస్యం.. సగం చెక్కిన విగ్రహాల కథ, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఇది...పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Jagannath Rath Yatra 2025 : పూరీ జగన్నాథ రథయాత్ర పూర్తి షెడ్యూల్ ..ఆ 10 రోజుల్లో ఏ రోజు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















