Weekly Horoscope, 26 December 2021 to 1st January 2022: 2021 ఆఖరి వారం..2022 ఆరంభం ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
డిసెంబరు 26 నుంచి జనవరి 1, 2022 వరకూ వార ఫలాలు
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం)
ఈ వారం లౌక్యంతో నెట్టుకొస్తారు. వారం ఆరంభంలో మామూలుగా ప్రారంభమైనా మధ్యలో శుభవార్త వింటారు. ముఖ్య వ్యవహారాల్లో పట్టువిడుపు ధోరణి మంచిది. ఆస్తి తగాదాల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రారంభించిన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. వాహనం జాగ్రత్తగా నడపండి.. ప్రమాద సూచన ఉంది. వ్యాపారులు తమ వ్యాపారాలపై మరింత దృష్టి సారించాలి. ఉద్యోగులు పని విషయంలో రాజీ పడొద్దు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాలు)
ఈ వారం ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వారం చివరిలో కొంత చికాకుగా ఉంటుంది.
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాలు)
ఈ వారమంతా ఏ పనిచేసినా విజయం సాధిస్తారు. ఎలాంటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తిచేయగలుగుతారు. అంచనాలు నిజమవుతాయి. ఇంటా-బయటా మీ ఆధిక్యత చాటుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. వావ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు, ఉద్యోగులు పదోన్నతి సమచారం పొందుతారు. అష్టమ శని ప్రభావంతో వారం మొదట్లో కొంత చికాకుగా ఉంటారు.
కర్కాటకం ( పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
మీ మాటతీరు, ప్రవర్తనతో అందరి ప్రశంసలు అందుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగయత్నాలు కలిసొస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపారులు, ఉద్యోగులు, పారిశ్రామిక వర్గాల వారికి శుభసమయం. వారం చివర్లో ధనవ్యయం ఉంటుంది. .
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం)
ఈ వారం ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం తథ్యం. కొన్ని కారణాలతో దూరమైన సన్నిహితులు, స్నేహితులు మళ్లీ దగ్గరవుతారు. దీర్ఘకాలంగా నెలకొన్న ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేయాలేనే ప్రయత్నాలు కలిసొస్తాయి. శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాల్లో లాభం పొందుతారు. వారం మధ్యలో ఖర్చులు అధికంగా ఉంటాయి జాగ్రత్త.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)
ఈ వారం మీకు కలిసొస్తుంది. దూరమైన కొందరు మిత్రులు తిరిగి దగ్గరకు చేరతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. తెలివితేటలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొచ్చే సమయం. వారం ప్రారంభంలో ఎవరితోనైనా చికాకు ఉండొచ్చు.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)
ఈ వారం మీరు వేసుకున్న ప్రణాళిక ప్రకారం దూసుకెళతారు. చేపట్టిన పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులున్నా అధిగమించి విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణాలు, వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసొస్తాయి. అవివాహితులకు సంబంధం కుదిలే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొద్దిపాటి చికాకులు ఉండొచ్చు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు బదిలీలు ఉండొచ్చు. వారం ప్రారంభంలో ఫలితాలు కాస్త అటు ఇటుగా ఉంటాయి.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట)
ఈ వారం ధైర్యంగా దూసుకుపోతారు. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. తీర్థయాత్రలు చేస్తారు. గడిచిన వారంతో పోలిస్తే ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో తీర్పులు అనుకూలంగా ఉంటాయి. వివాహం, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు కలిసొచ్చే వారం ఇది. వారం మధ్యలో అనారోగ్య సూచనలున్నాయి.
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)
ఈ వారం మీ శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేయొచ్చు. ఉద్యోగస్తులు ప్రమోషన్ సంబంధిత సమాచారం పొందుతారు. వారం కొన్ని వివాదాలు జరిగే అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు)
ఈ వారం ఆర్థిక లావాదేవీల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అప్పులు తీరిపోతాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. వారం మధ్యలో అదనపు ఖర్చులు, ఇంట్లో కొన్ని చికాకులు బాధపెడతాయి.
Also Read: ఈ రాశుల వారిని ప్రేమిస్తే నెత్తిన గుడ్డేసుకుని కూర్చోవడమే..
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
కుంభ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థికంగా అంతగా కలసిరాదు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలుండొచ్చు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. కష్టానికి తగిన ఫలితం అందుకోలేరు. ఉద్యోగులుకు అనుకూల ఫలితాలు లేవు. వ్యాపారులు రిస్క్ చేయకండి. వారం మధ్యలో పరిస్థితి కాస్త అనుకూలంగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో మీపై గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగులను ఇన్నాళ్లుగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. వారం చివర్లో దూర ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఖర్చులు పెరుగుతాయి..కాస్త నియంత్రించుకునే ప్రయత్నం చేయండి.
Also Read: ఈ రాశుల్లో పుట్టిన పిల్లలు గాడ్ గిఫ్టే... మీ పిల్లలు ఉన్నారా ఇందులో ఇక్కడ తెలుసుకోండి..
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి