News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Weekly Horoscope 2 May to 8 May 2022: ఈ రాశివారు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 
Share:

మే 2 నుంచి మే 8 వరకూ వారఫలాలు

మేషం
ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరత్వం ఉంటుంది. కార్యాలయంలో పెద్ద బాధ్యతను పొందుతారు. బంధువులను కలుస్తారు. వివాదాలను పరిష్కరించుకోవడంలో విజయం సాధిస్తారు. వ్యాపారులు లాభం పొందుతారు.  మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి.  ప్రమాదకర పెట్టుబడులకు తొందరపడకండి. మాటలు అదుపుచేయండి. చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవద్దు. ఖర్చులు పెరుగుతాయి. 

వృషభం
 మీ ఖర్చులను నియంత్రించగులుగుతారు.  మీ శ్రేయోభిలాషులు మిమ్మల్ని అభినందిస్తారు. సామాజిక హోదా పెరుగుతుంది. చిన్న ప్రయత్నంతో చాలా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.  ఉద్యోగాలు చేసే వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పర్యాటక ప్రదేశాన్ని సందర్శించడానికి వెళ్ళొచ్చు.  తప్పుడు విషయాన్ని సమర్ధించవద్దు. విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాలపై రాజీ పడొద్దు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. కళ్లకు సంబంధించిన ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఇతరుల ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవద్దు. బంధువుల నుంచి ఒత్తిడి తొలగిపోతుంది.  

మిథునం
మంచి వ్యక్తుల పరిచయ ప్రభావం మీకు కనిపిస్తుంది. ఈ వారం కొత్తగా ఏదైనా ప్రారంభించవచ్చు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే కలిసొస్తుంది.  మీ ప్రవర్తన ప్రభావం ఇతరులపై పడుతుంది.  అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. శుభ కార్యాలకు ఈ వారం అనుకూల సమయం. అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఉద్యోగం మారాలనుకుంటే తొందరపడకూడదు. అప్పులు చేయడం వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ఆఫీసులో పని ఒత్తిడి ఉంటుంది. 

Also Read: ఈ రోజు నుంచి శుక్రసంచారం ఈ రాశులవారికి ఎంతో అదృష్టం, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

కర్కాటకం 
పూర్వీకుల నుంచి వస్తోన్న వివాదాలు పరిష్కారమవుతాయి. దూరప్రాంత ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. కస్టమర్‌లతో మీ సంబంధాలు వ్యాపారంలో బలపడతాయి. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. మీరు వైవాహిక జీవితానికి చాలా విలువ ఇస్తారు. మీ మనసులో ప్రేమను తెలిపేందుకు ఇదే మంచిసమయం. వారంలో మొదటి మూడు రోజులు మీకు అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో-కార్యాలయంలో ఎవ్వరితోనూ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోండి. అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. పనికిరాని పనుల్లో పడి సమయం వృధా చేయకండి. భారీ వస్తువులు వాడేటప్పుడు జాగ్రత్త. 

సింహం 
ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ  నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాను.  ఉద్యోగ మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారంలో కష్టపడాల్సి వస్తుంది. ఆఫీసులో మీ పనితీరు చాలా బాగుంటుంది. ఆర్థికంగా ఉత్సాహంగా ఉంటారు. మీరు వ్యాపారం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. భాగస్వామ్య పనుల్లో సహోద్యోగులతో సమన్వయం కోసం కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉంటాయి. ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. ఈ వారం ప్రయాణాలకు అంత అనుకూలంగా లేదు. కెరీర్ విషయంలో అనిశ్చితి ఉంటుంది. కుటుంబ సభ్యులు మీపై కోపంగా ఉండొచ్చు.  మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉండదు. సామాజిక స్థితి బలంగా ఉంటుంది.

కన్య
ఈ వారం ఈ రాశివారు మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో పురోగతి చూసి ఉత్సాహంగా ఉంటారు. పాత కలలను నెరవేర్చుకోవడంలో సక్సెస్ అవుతారు.  కుటుంబానికి సమయం కేటాయించండి. ప్రమాదకరమైన పనులు చేయకండి. ఈ వారంలో గాయపడే ప్రమాదం ఉంది. వ్యక్తిగత,  వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం గురించి గందరగోళంగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి..
 
తుల 
మీ ఆర్థిక స్థితి బావుంటుంది. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిర్దేశించిన లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటారు. మీడియాకు సంబంధించిన వృత్తిలో ఉన్నవారు లాభపడతారు.  మీరు మీ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీ నాయకత్వ సామర్థ్యంతో పెద్ద సమస్యలను పరిష్కరిస్తారు. ఉద్యోగంలో కోరుకున్న బదిలీ పొందుతారు. మీ వైఖరిని స్పష్టంగా ,సానుకూలంగా ఉంచండి. మీరు ఇంటి పనుల్లో చాలా శ్రద్ధ వహిస్తారు. తొందరగా  అలసిపోయినట్లు అనిపిస్తుంది. మందులు తీసుకోవడంలో అజాగ్రత్తగా ఉండకండి.

వృశ్చికం
మీ వ్యాపారం పెరుగుతుంది. బంధువులు, స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో, మీరు శ్రమకు అనుగుణంగా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఉన్నత పదవుల్లో ఉండేవారికి  పదోన్నతి లభించే అవకాశాలున్నాయి. యువత ఆకస్మిక విజయాన్ని పొందుతారు. ప్రేమికులకు అనుకూల సమయం. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ శరీర తత్వానికి ఎండలో తిరగడం వల్ల తొందరగా సిక్ అవుతారు.  కార్యాలయంలో లక్ష్యాన్ని పూర్తి చేయాలనే ఒత్తిడి ఉంటుంది. ఇతరుల పనుల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది.స్నేహితునితో వాగ్వాదం ఉండొచ్చు.  వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి.

Also Read: సింహాద్రిలో కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే కోరికలు ఎందుకు నెరవేరుతాయ్, అక్కడున్న ప్రత్యేకత ఏంటి

ధనుస్సు 
కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఈ వారం అనుకూలంగా ఉంది. పాత మిత్రులను కలుస్తారు. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా నిర్ణయం రావచ్చు. ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. పని ప్రదేశంలో ప్రశాంతత ఉంటుంది. మీ దినచర్య చాలా క్రమశిక్షణగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్త వింటారు. వారం ప్రారంభంలో ప్రేమికుల మధ్య విభేదాలు రావొచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి.  కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూల సమయం కాదు.

మకరం
ఈ రాశివారు అపరిచితులపట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు. శత్రువుల వల్ల నష్టపోతారు.  ఈ వారం ఆధ్యాత్మిక యాత్రకు వెళతారు. దినచర్యలో మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. మీరు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. ముఖ్యమైనదాన్ని కోల్పోతామనే భయం ఉంటుంది. ప్రణాళికలు అమలు చేయడంలో ఇబ్బంది ఉంటుంది. మీరు చెడ్డ వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండాలి. దుర్మార్గులకు దూరంగా ఉండండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం బాగా సాగుతుంది.

కుంభం 
విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి అడుగు ముందుకేస్తారు.  మీరు సామాజిక సేవలో పాల్గొంటారు. ఈ వారం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది.  వ్యాపారులకు శుభసమయం. ఆది, శుక్రవారాలు శుభప్రదంగా ఉంటాయి. వెంటనే ఎవరినీ నమ్మకూడదు. వివాహ సంబంధాల్లో పరస్పర విశ్వాసం తగ్గుతుంది.  అడగకుండా సలహా ఇవ్వకండి.  స్థిరాస్తి విషయంలో మీకు అనుకూలంగా నిర్ణయం రావచ్చు. వృత్తిలో పురోగతి ఉంటుంది.

మీనం 
ఈ రాశి నిరుద్యోగులు ఈ వారం ఇంటర్యూల్లో విజయం సాధిస్తారు. వారం ప్రారంభం చాలా బాగుంటుంది. వ్యాపారం విస్తరిస్తారు. స్నేహితులతో సంతోషంగా స్పెండ్ చేస్తారు.  బంధువులతో చర్చలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీ మాటతీరు మార్చుకోండి.  పనిలో బిజీగా ఉండటం వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేరు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ చుట్టూ కొందరు మిమ్మల్ని ముంచేవారుంటారు జాగ్రత్త. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. భూమి, ఆస్తి సంబంధిత పనుల్లో ఆటంకాలు ఉండొచ్చు.  మీకు విధేయత చూపమని ఎవరినీ బలవంతం చేయవద్దు.

Also Read: బుధుడి సంచారం ఈ రాశులవారికి అద్భుతంగా ఉంటుంది

Published at : 02 May 2022 06:31 AM (IST) Tags: Horoscope Today Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries Weekly Horoscope 2 May to 8 May 2022

ఇవి కూడా చూడండి

ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు

ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం, సెప్టెంబరు 28 రాశిఫలాలు

Gachibowli Laddu Price: భారీ ధర పలికిన నల్లగొండలోని పాతబస్తీ లడ్డు, ధర ఎంతంటే??

Gachibowli Laddu Price: భారీ ధర పలికిన నల్లగొండలోని పాతబస్తీ లడ్డు, ధర ఎంతంటే??

మీ బాత్రూమ్‌లో ఈ ఆరు వస్తువులు ఉన్నాయా? అయితే, ఈ సమస్యలు తప్పవు

మీ బాత్రూమ్‌లో ఈ ఆరు వస్తువులు ఉన్నాయా? అయితే, ఈ సమస్యలు తప్పవు

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి