By: ABP Desam | Updated at : 28 Apr 2022 02:58 PM (IST)
Edited By: RamaLakshmibai
2022 ఏప్రిల్ 29 శుక్రవారం రాశిఫలాలు
మేషం
ఆర్థిక పరిస్థితి మార్పు ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. సానుకూలంగా ఉండండి. ప్రేమ సంబంధాల్లో కొన్ని విభేదాలు ఉండొచ్చు. మీ సహోద్యోగుల్లో మీకు చెడుచేసేవారున్నారు అప్రమత్తంగా ఉండండి.
వృషభం
మీరు పనిచేస్తున్న రంగంలో కొత్త వ్యక్తులను కలుస్తారు. మీరు పిల్లల చదువుల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రేమ సంబంధాల గురించి మీరు భావోద్వేగానికి లోనవుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మిథునం
వంకర వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రణాళికలు వేస్తారు. పాత సమస్యలు పరిష్కరించుకుంటారు. మీరు పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. కొత్త పనులపై ఆసక్తి ఉంటుంది.
Also Read: ఇంట్లో కనక వర్షం కురిపించే స్త్రోత్రం, నిత్యం చదివితే ఆర్థిక సమస్యలే ఉండవు
కర్కాటకం
ఈ రోజు మీరు ఒక పెద్ద బాధ్యతను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంటారు. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. అసంపూర్తిగా ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పరిస్థితులను తెలివిగా ఎదుర్కొంటారు. వ్యాపారంలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది.
సింహం
విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.ఈ రోజు సంతోషం, బాధ అన్నీ హెచ్చుతగ్గుల్లో ఉంటాయి. సోమరితనం వీడండి. సమయాన్ని వృథా చేయకండి. ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎవర్నీ అగౌరవచ పరచొద్దు.
కన్యా
వ్యాపారులకు ఈ రోజు చాలా మంచిరోజు.స్నేహితులను కలవడంతో సంతోషంగా ఉంటారు. మీ ఖర్చులను కొంచెం తగ్గించుకోండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో గౌరవం లభిస్తుంది. ఓ వివాహ వేడుకలో పాల్గొంటారు.
తులా
ఈ రోజు సాధారణంగా ఉంటుంది.డైలీ వర్క్స్ మారుతాయ్. ఇతరుల సలహాలు ఎక్కువగా తీసుకోకండి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకండి.ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అనుకూల సమయం.
Also Read: సింహాద్రిలో కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే కోరికలు ఎందుకు నెరవేరుతాయ్, అక్కడున్న ప్రత్యేకత ఏంటి
వృశ్చికం
ప్రేమికులు వివాహానికి ప్రణాళికలు వేసుకోవచ్చు.ఆఫీసులో మీపై చాలా పని ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు దూషించే పదాలు ఉపయోగించవద్దు. వ్యవహారాల్లో పారదర్శకంగా ఉండండి. కుటుంబ సంతోషం పెరుగుతుంది.
ధనుస్సు
ఆరోగ్యం విషయంలో ఇబ్బందుల్లో పడతారు. ఉద్యోగులకు అనుకూల సమయం. రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎవరితోనైనా వివాదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త.ఆవేశపూరిత చర్యల వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. రిస్క్ తీసుకోకండి.
మకరం
మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది.మీ ప్రతిభను చక్కగా ఉపయోగించుకుంటారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు బావుంటాయి. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతారు.
Also Read:మహాభారత యుద్ధంలో ఏరోజు ఎంతమంది చనిపోతారో ముందు రోజు రాత్రే క్లారిటీ ఇచ్చేసిన కృష్ణుడు
కుంభం
అధిక పని అలసటకు కారణమవుతుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తుల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చు. వ్యాపారం ముందుకు సాగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
మీనం
మీ ప్రవర్తన ఎవరికైనా బాధ కలిగించవచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. పనిపై విశ్వాసం పెరుగుతుంది. ఉన్నతాధికారులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు.
Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం
Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 22 May 2022: భానుసప్తమి ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం, మీరున్నారా ఇందులో ఇక్కడె తెలుసుకోండి
Panakala Swamy Temple :ప్రసాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం
Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పదం
Bindu Madhavi vs Nataraj: నటరాజ్తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ