vinayaka chavithi 2022: గడ్డిపోచ(గరిక) అంటే లంబోదరుడికి ఎందుకంత ప్రీతి!
దూర్వా అంటే గడ్డిపోచ అని అర్థం. రెండు పోచలున్న దూర్వారాన్ని గణపతికి సమర్పించడం చూస్తుంటాం. వినాయకుడికి గరిక అంటే ఎందుకు ప్రీతి...
![vinayaka chavithi 2022: గడ్డిపోచ(గరిక) అంటే లంబోదరుడికి ఎందుకంత ప్రీతి! vinayaka chavithi 2022: why we using Garika For lord vinayaka pooja, know in details vinayaka chavithi 2022: గడ్డిపోచ(గరిక) అంటే లంబోదరుడికి ఎందుకంత ప్రీతి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/30/73e7d09ce834e06055b26c5a63eb4d651661847271878217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
vinayaka chavithi 2022: వినాయక చవితి రోజు గరికతో పూజ చేస్తే సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతుంటారు. వినాయకునికి గరిక అంటే ఎంతో ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడి పూజ పూర్తికాదు. ఇంకా చెప్పాలంటే గరిక లేకుండా ఎన్ని పూలు, పత్రి పెట్టినా ఆ పూజ అంతగా ఫలించదంటారు పండితులు. అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు ఇష్టం
Also Read: పార్వతీదేవి వినాయకుడిని దేనితో తయారు చేసింది, ఏనుగు ముఖం పెట్టకముందు వినాయకుడి రూపం ఇదే!
పురాణాల ప్రకారం
అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. లోకాలను పీడించేవాడు. ఆ రాక్షసుడి బాధలు భరించలేక దేవతలంతా వెళ్లి గణపతితో మొరపెట్టుకుంటారు. అప్పుడు వినాయకుడు.. అనలాసురుణ్ని అమాంతం మింగేశాడు. అనలం అంటే అగ్ని. ఆ అసురుణ్ని మింగడంతో వినాయకుడు భరించలేని తాపంతో బాధపడసాగాడు.స్వామికి కలిగిన వేడిని ఉపశమింపజేయడానికి దేవతలు రకరకాల ప్రయత్నాలు చేశారు. పద్మాలను సమర్పించారు, పుష్పార్చనలు చేశారు. ఏకంగా చంద్రుణ్ని తీసుకొచ్చి గణపతి శిరస్సుపై ఉంచారు.
అయినా గణపతికి వేడి తగ్గలేదు. చివరికి పరమశివుడు గరికను తీసుకొని వినాయకుడి శిరస్సుపై ఉంచాడు. దాంతో గణపయ్య తాపం తగ్గింది. అలా వినాయకుడికి, గడ్డిపోచకూ లంకె కుదిరింది. గడ్డిపోచను అందరూ తేలిగ్గా తీసుకుంటారు. కానీ, సృష్టిలో ఏదీ అల్పమైనది కాదని చెబుతూ స్వామి గరికను ఇష్టంగా స్వీకరిస్తాడని కొందరి భావన. అందుకే దూర్వాయుగ్మంతో గణపతిని ఆరాధిస్తే స్వామి ప్రసన్నుడై, శీఘ్ర ఫలితం ఇస్తాడని విశ్వసిస్తారు. అలా గరికకు హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read: వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు!
గ్రహణ సమయంలో కూడా గరికను వినియోగిస్తారు. కేవలం పూజ కోసం మాత్రమే కాకుండా ఔషధంగా కూడా గరికను ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యంలో గరికను ఎంతోకాలంగా వినియోగిస్తున్నారు. గరిక వేర్లను మెత్తగా నూరి అందులో పసుపును కలిపి చర్మానికి లేపనంగా రాసుకోవడం వల్ల దద్దుర్లు, దురదలు, అలర్జీ వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. గరిక ఆకులను పచ్చడిగా చేసుకుని అన్నంతో కలిపి తినడం వల్ల ఒంటి నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. గరికను మెత్తగా నూరి గాయాలపై లేపనంగా రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.
శ్రీ వినాయక దండకం (Vinayaka Dandakam in Telugu)
శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీ నాధ సంజాతస్వామి శివాసిద్ధి విఘ్నేశ, నీ పాద పద్మంబులన్, నిదు కంటంబు నీ బొజ్జ నీ మోము నీ మౌలి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబు నీ కరలంబు నీ పెద్ద వక్త్రంబు నీ పాద హస్తంబు లంబో దరంబున్ సదమూషకాశ్వంబు నీ మంద హాసంబు నీచిన్న తొండంబు నీ గుజ్జ రూపంబు నీ సూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమంబక్ష తాల్జాజులున్ చంపకంబుల్ తగన్ మల్లెలున్మోల్లులు న్ముంఛి చేమంతులున్ దేల్లగాన్నేరులున్ మంకెనలన్ పోన్నలన్ పువ్వులు న్మంచి దూర్వంబులన్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంచేసి విఘ్నేశ్వరా నీకుతేంకాయ పోన్నంటిపండ్లున్ మఱిన్మంచివౌ నిక్షుఖండంబులన్ రేగుబండ్లప్పడాల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోదుమప్పంబులు న్వడల్ పునుగులున్భూరేలున్ న్గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ దేనెయుంజున్ను బాలాజ్యము న్నాను బియ్యంచామ్రంబు బిల్వంబు మేల్ బంగురున్ బల్లెమందుంచి నైవేద్య బంచనీరానంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా! నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్ధనల సేయుటల్ కాంచనం బోల్లకే యిన్ము దాగోరు చందంబుగాదే మహాదేవ ! యోభక్తమందార ! యోసుందరాకారా ! యోభాగ్య గంభీర ! యోదేవ చూడామణీ లోక రక్షా మణీ ! బందు చింతామణీ ! స్వామీ నిన్నెంచ, నేనంత నీ దాసదాసాది దాసుండ శ్రీ దొంతరాజాన్వ వాయుండ రామాబిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునించేసి శ్రీమంతుగన్ జూచి హృత్పద్మ సింహాసనారూడతన్ నిల్పి కాపాడుటేకాడు విన్గోల్చి ప్రార్ధించు భక్తాళికిన్ గోంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ కల్గగాజేసి పోషించు మంటిన్ గృహన్ గావుమంటిన్ మహాత్మా యివే వందనంబుల్ శ్రీ గణేశా ! నమస్తే నమస్తే నమస్తే నమః ||
ఇతి శ్రీ వినాయక దండకం ||
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)