మీ ఇంటి గోడలపై ఈ చిత్రాలు ఉంటే - సంపద మీ వెంటే!
కొంతమంది కొత్త పెయింటింగ్స్‌తో ఇంటిని అందంగా అలంకరించుకోవాలని అనుకుంటారు. ఈ మేరకు వాస్తు పండితులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు.
ఇల్లు అందంగా, ఆకర్షనీయంగా కనిపించాలంటే రకరకాల వస్తువులు, బొమ్మలు అలంకరిస్తాం. గోడలకు వివిధ రకాల అందమైన పెయింటింగ్స్‌ను ఏర్పాటు చేస్తాం. అయితే, అవి మీ భవిష్యత్తును శాసిస్తాయనే సంగతి మీకు తెలుసా? కొత్త ఏడాదిలో మీ జాతకం మారిపోవాలంటే.. ఈ చిత్రాలను మీ ఇంటి గోడలకు అలంకరించండి.
ఏడు గుర్రాల చిత్రం
ఇంట్లో ఏడు గుర్రాల చిత్రాన్ని ఉంచడం చాలా శుభప్రదమని వాస్తు చెబుతోంది. ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీనీ ఆకర్షిస్తుంది. ఇంట్లో నివసించే అందరి జీవితాలు అభివృద్ధి వైపు సాగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఇంట్లో ఏడు గుర్రాల పెయింటింగ్ ఉంచితే లక్ష్మీ కటాక్షం దొరికి ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి. కొత్త సంవత్సరంలో మీ ఇంటికి అదృష్టాన్ని తేవాలని అనుకుంటే తప్పకుండా ఏడు గుర్రాల చిత్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలి.
ఈ నియమాలు తప్పనిసరి
ఏడుగుర్రాల పెయింటింగ్ ఇంట్లో పెట్టుకోవాలనుకున్నపుడు కొన్ని నియమాలను పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
- గుర్రాలన్నీ స్పష్టంగా కనిపించాలి.
- గుర్రాలను పగ్గాలతో బంధించి ఉంచకూడదు.
- గుర్రాల ముఖాలు ప్రసన్నంగా కనిపించాలి.
- అన్ని గుర్రాలు ఒకే దిశలో పరుగెడుతున్నట్టు ఉండాలి.
- ఈ చిత్రాన్ని ఇంట్లో తూర్పువైపు ఉన్న గోడకు అలంకరించాలి.
- ఆఫీస్ లేదా వ్యాపార స్థలాల్లో దక్షిణం వైపు గోడకు పెట్టుకోవడం మంచిది.
- ఇలాంటి చిత్రం పెట్టుకోకూడదు.
- ఇంట్లో ఏడు గుర్రాల పెయింటింగ్ శుభప్రదం. అయితే ఈ గుర్రాలు వేర్వేరు దిశల్లో పరుగెడుతున్నట్టు ఉండకూడదు.
- ఒక్క గుర్రం ఉండే పోస్టర్ ఇంట్లో అసలు పెట్టుకోకూడదు.
- రథం లాగుతున్న గుర్రం ఫోటోలు కూడా పెట్ట కూడదు.
- యుద్ధ భూమిలో పోరాటంలో ఉన్న గుర్రం చిత్రం కూడా ఇంట్లో పెట్టుకోవడానికి పనికి రాదు.
- ఇలాంటి గుర్రాల ఫోటోలు ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. సంపద నశించి, దారిద్య్రం చేరుతుంది.
- కోపంతో ఉన్న గుర్రం బొమ్మ ఇంట్లో పెట్టుకోకూడదు. ఈ చిత్రం వల్ల ఇంట్లో అశాంతి ప్రభలుతుంది.
- చిత్రంలో ఉండే ఏడు గుర్రాలు ఒకే రంగులో ఉండాలి.
- గుర్రాలు నిలబడి లేదా, కూర్చుని ఉన్న చిత్రాలు కూడా ఇంటికి అంత మంచిది కాదు. దీని వల్ల ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. ఇంట్లో గొడవలు పెరుగుతాయి.
కృష్ణుడి చిత్రాలు ఉండొచ్చా?
చాలా మంది మహాభారతంలోని కురుక్షేత్ర చిత్రాన్ని గుర్రాలు ఉన్నాయి కదా అని పెట్టుకుంటుంటారు. కానీ ఇది అంత మంచిది కాదు. ఈ చిత్రం ఇంట్లో అశాంతికి, యుద్ధ వాతావరణానికి కారణం కాగలదు. ఆగ్నేయ దిశలో శ్రీ కృష్ణుడి చిత్ర పటం పెట్టుకుంటే ఇంట్లోకి దివ్య శక్తి ధారాళంగా వస్తుంది. దక్షిణాన కృష్ణుడు గోవర్థన గిరి ఎత్తిన చిత్రాన్ని పెట్టుకుంటే సమస్యలు దూరమవుతాయి. ప్రమాదాలను నివారించబడుతాయి. నైరుతిలో శ్రీకృష్ణుడి చిత్ర పటాన్ని పెట్టుకుంటే దుష్టశక్తులు దరిచేరవు.
Also Read: వంటింట్లో ఈ వస్తువులను పొరపాటున కూడా ఉంచొద్దు, కష్టాలు పీడిస్తాయ్!