అన్వేషించండి

Bad Habits: ఈ దురలవాట్లు ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి

వాస్తు వివరించిన చిన్నచిన్న జాగ్రత్తలతో జీవితంలో ప్రశాంతతను, సంపదను తెస్తాయి. తెలియక లేదా చిన్న నిర్లక్ష్యం వల్ల కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోము. కానీ అవే ఆర్థిక నష్టాలకు కారణం కావచ్చు.

వాస్తు మన చుట్టూ అవరించి ఉన్న శక్తి క్షేత్రాల సమాచారాన్ని అందిస్తుంది. వాస్తు నియమాలకు అనుగుణంగా మన అలవాట్లు, జీవన విధానం ఉన్నపుడు జీవితంలో సంపదకు కొదవ ఉండదని వాస్తు చెబుతోంది. అది జీవితం ప్రశాంతంగా కొనసాగేందుకు దోహదం చేస్తుంది.

పురాతన భారతీయ ఆర్కిటెక్చర్ గా మనం వాస్తును పరిగణించవచ్చు. మన నివాస స్థలాలు మన జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వివరించే శాస్త్ర పరిజ్ఞానం. కొన్ని అలవాట్లు ఎలా మన జీవితంలో ఆర్థిక పరిపుష్టి మీద ప్రభావం చూపుతాయనే విషయంలో వాస్తు సూచనలు ఎలా ఉంటాయో చూద్దాం.

మనం తెలిసి తెలియక చేసే కొన్ని పనులు మన జీవితంలో ఆర్థిక అంశాల మీద ప్రభావం చూపుతాయట.

అనవరసరపు షాపింగ్

చాలా మంది చవకగా వస్తున్నాయనో లేక ఆకర్శణీయంగా ఉన్నాయనో అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు, ముఖ్యంగా వస్త్రాలు కొంటుంటారు. ఈ బలహీనత మనల్ని ఆర్థికంగా బలహీన పరుస్తుంది. డబ్బు వృథా అవుతుంది కూడా. ఇలాంటి బలహీనత మన దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది.

నైరుతిని నిర్లక్ష్యం చెయ్యడం

వాస్తు ప్రకారం నైరుతి దిక్కు సంపదకు, స్థిరత్వానికి ప్రతీక. ఇంటిలోని ఈ భాగంలో చెత్త చేరడం, నిర్లక్ష్యంగా వదిలెయ్యడం వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి. ఖర్చులు కూడా పెరిగిపోతాయి.

వంటిల్లు వాస్తు ప్రకారం లేకపోతే..

వాస్తును అనుసరించి వంటింటి నిర్మాణం జరగకపోతే ఆర్థిక విషయాల మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. లేదా ఆర్థిక పరమైన దస్తావేజులు ఆగ్నేయంలో భద్ర పరచడం వల్ల కూడా ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి.

చెత్త చేరడం

ఇంట్లో లేదా పనిచేసే చోట, వ్యాపారం జరిగే చోట చెత్త, పనికి రాని వస్తువులు చేరడం వల్ల ఆ ప్రదేశాల్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసారానికి ఆటంకాలు ఏర్పడుతాయి. అందుకే ఇంట్లో అయినా వ్యాపార స్థలాలో అయినా సరే ఎప్పటికప్పుడు పనికిరాని వస్తువులను తొలగిస్తూ ఉండాలి. ఇలా చెత్తలేని ప్రదేశాలు సంపదను, ప్రశాంతతను ఆకర్శిస్తాయి.

ఈశాన్యాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు

వాస్తు ప్రకారం ఈశాన్యం పవిత్రమైన భాగం. ఇల్లయినా, వ్యాపార స్థలం, కార్యాలయం ఇలా ఏ స్థలంలో అయినా సరే ఈశాన్యం చాలా ముఖ్యమైన భాగం. ఈ దిక్కున తప్పకుండా పూజ జరిగేట్టు చూసుకుంటే మంచిది. ఈ భాగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యవద్దు. ఈ భాగంలో చెత్తగా ఉండడం, శుభ్రంగా లేకపోవడం వల్ల ఇంట్లోకి వచ్చే సంపదకు ఆటంకాలు ఎదురవుతాయి. త్వరగా నెగెటివిటి చేరుతుంది.

నీటి వృథా

వాస్తును నియమాల ప్రకారం నీటి కుళాయిల్లో లీకేజీలు ఉండడం, నీటి పైపుల్లో లీకేజీలు ఉండడం డబ్బు వృథాకు సంకేతాలుగా చెప్పుకోవాలి. ఇవి మాత్రమే కాదు విరిగిపోయిన కిటికీలు, అద్దాలు కూడా ఇలాంటి సంకేతాలనే ఇస్తాయి. కనుక ఇంట్లో ఇలాంటి స్థితి లేకుండా జాగ్రత్త పడాలి.

Also Read : Vastu Tips in Telugu : లివింగ్ రూమ్ గోడలకు గ్రీన్ కలర్ వెయ్యొచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

Bad Habits: ఈ దురలవాట్లు ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget