By: ABP Desam | Updated at : 14 Mar 2023 06:58 PM (IST)
Edited By: Bhavani
Representational image/pixabay
నిత్య జీవితంలో చేసే పనులు చెయ్యకూడని పనులు అన్నింటిని వాస్తు వివరిస్తుంది. సంపద, జ్ఞానానికి ఆది దేవత లక్ష్మీదేవి. ఆమెను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. కొన్ని చెడు అలవాట్లు వదిలెయ్యాలి. కొన్ని మంచి పనులు తప్పక చెయ్యాలి. లక్ష్మీ కటాక్షం లేకపోతే జీవితం సమస్యల పాలవుతుంది. ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వాస్తు పండితులు చెప్పిన ఈ సూచనలు తప్పకుండా తెలుసుకోండి.
రాత్రి సమయాల్లో జుట్టు విరబోసుకోవద్దు. విరబోసిన జుట్టుతో నిద్రపోకూడదు. రాత్రి పూట తలస్నానం చెయ్యకూడదు. జుట్టు దువ్వెనతో దువ్వకూడు. సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో దుష్టశక్తులు తిరుగుతుంటాయని నమ్మకం. జుట్టు విరబోసుకుని ఉండే స్త్రీలు ఆ శక్తులను ఆకర్షిస్తారట. అందుకే జుట్టు విరబోసుకుని నిద్రించడం అంత మంచిది కాదు.
రాత్రి భోజనం తర్వాత వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచకూడదు. మురికి వంటగది వాతావరణం లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. వంటగది ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకోవాలి. రాత్రి నిద్రకు ముందే వంటగది శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ నియమం గురించి చాలా మందికి తెలియదు. కానీ లక్ష్మీ కటాక్షం కావాలని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా వంటిల్లు శుభ్రంగా పెట్టుకోవడం అవసరం.
పాలు, పెరుగు, ఉప్పు, పంచదార వంటి తెల్లని పదార్థాలు చీకటి పడిన తర్వాత దానం చెయ్యకూడదు. పాలు, పసుపు, పుల్లని పదార్థాలు కూడా చీకటి పడిన తర్వాత వేరొకరికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే లక్ష్మి అలిగి వెళ్లిపోతుందట. అదే జరిగితే జీవితంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.
చీకటి పడిన తర్వాత గోర్లు, జుట్టు కత్తిరించ కూడదు. రాత్రిపూట ఇలా చెయ్యడం దరిద్రం అని కూడా అంటుంటారు. రాత్రి వేళలో లక్ష్మీ ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అలాంటి సమయంలో జుట్టు, గోర్లు కత్తిరించడం వల్ల ఇల్లు మురికి కావచ్చు. ఇది లక్ష్మీ గౌరవానికి భంగం కలిగిస్తుంది. అందువల్ల ఆమె అలిగి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక చీకటి పడిన తర్వాత గోళ్లు, జుట్టు కత్తిరించకూడదు.
చీకటి పడిన తర్వాత చీపురుతో ఇల్లు ఊడ్చకూడదు. మధ్యాహ్నం ఏ సమయంలో ఇల్లు చీపురుతో శుభ్రం చేసుకున్నా ఫర్వాలేదు కానీ సూర్యాస్తమయం తర్వాత చీపురు ఉపయోగించకూడదు. ఇది ఇంట్లోకి దరిద్ర దేవతకు ఆహ్వానం పలుకుతుందట. రాత్రి పూట ఇల్లు ఊడ్చే వారి ఇంట్లో అనారోగ్యం, అశాంతి, దు:ఖం తాండవిస్తాయని నమ్మకం.
సాయంత్రం బట్టలు ఉతికితే తడి బట్టలు దుష్ట శక్తులను సులభంగా ఆకర్షిస్తాయట. వాటిని ధరించినపుడు ఆ ప్రభావం మన మీద ఉంటుందని శాస్త్రం చెబుతోంది. ఎండలో ఆరిన వస్త్రాలలో ప్రతికూల శక్తి నశించి అనుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్మకం. సైన్స్ కూడా ఎండలో ఆరిన బట్టల్లో సూక్ష్మ జీవులు నశిస్తాయని చెబుతుంది. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతికి ఆరబెట్టకూడదు.
Also Read: లవంగాలను ఇలా ఉపయోగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట
పండుగలు, శుభకార్యాలకు మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
ఇంట్లో అద్దం ఇక్కడ పొరపాటున పెట్టినా సమస్యలు తప్పవు
అద్దె ఇంట్లో ఉంటున్నారా? ఈ పరిహారాలతో సొంతింటి కల నెరవేరుతుంది
Vastu Tips: మీ వ్యాపారం లేదా సంస్థలో లాభాలు రావాలంటే ఈ దిక్కున కూర్చొండి
లవంగాలను ఇలా ఉపయోగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా