Vastu Tips: కిచెన్లో పాన్ ఎటువైపు పెడుతున్నారు? అలా చేస్తే మీ ఇంటి సంపద పెరుగుతుందట
వంటగదిలో సామాను వాస్తు ప్రకారం సర్దుకుంటే ఇంట్లో సిరి సంపదలు తులతూగుతాయని నమ్ముతారు.
ఇల్లు సర్దుకోవడం కూడా ఒక ఆర్ట్. ఇంట్లోని ప్రతి వస్తువు ఎక్కడ పెట్టాలనేదానికి కూడా వాస్తు ఉంటుంది. జీవితాన్ని సరిదిద్దడంలో, ఇంట్లో శాంతి నెలకొనేలా చేయడంలో వాస్తు శాస్త్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంటికి గుండెలాంటిది వంటగది. అందుకే దాన్ని చక్కగా, శుభ్రంగా ఉంచుకోవాలని అంటారు. కిచెన్ లో సామాను చిందరవందరగా ఉంటే మనసు చికాకుగా ఉంటుంది. వంటగదిలోని కొన్ని పాత్రలు వాస్తు ప్రకారం పెడితే ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. కిచెన్లో సామాను తప్పు దిశలో ఉంచినట్లయితే కుటుంబంపై చెడు ప్రభావం పదే అవకాశం ఉంది.
ఏ వంట పాత్ర ముఖ్యమైనది?
కిచెన్ లో అత్యంత ముఖ్యమైన వంట పాత్ర పాన్ (Tawa) . రోటీ, పరోటా, చీలా వంటి అనేక వంటకాలని ఇందులోనే తయారు చేస్తారు. కానీ దీన్ని తప్పు దిశలో లేదా స్థలంలో ఉంచడం వల్ల ఇంటి ఆర్థిక స్థితిపై నేరుగా ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? ఇంట్లో శ్రేయస్సు కోసం అనుసరించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిలో పాన్ ఎటువైపు ఉంచాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి.
కుడివైపు పెట్టాలి
వాస్తు శాస్త్రం ప్రకారం పాన్ ఎప్పుడు గ్యాస్ కి కుడివైపున పెట్టుకోవాలి. లేదంటే గ్యాస్ కింద లేదా దాని వెనుక వైపు పెట్టాలి. అలా కాకుండా వేరే ప్రదేశాల్లో పెడితే అది ఇంటిపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఆర్థికంగా నష్టపోతారు.
శుభ్రంగా ఉంచాలి
వంట చేసిన తర్వాత చాలా మంది తవా కడగకుండా పెట్టేస్తారు. చపాతీలు కాల్చిన తర్వాత నూనె ఏమి లేదు కదా అని అలాగే పెట్టేస్తారు. కానీ అలా అసలు చేయకూడదు. వంట అయిపోయిన తర్వాత పాన్ ఎప్పుడు శుభ్రం చేసి పెట్టుకోవాలి. సరైన పద్ధతిలో అంతే.. తవాను ముందుగా కాసేపు నానబెట్టి తర్వాత కిల్లన చేసుకోవాలి. తవాపై కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసి నానబెట్టుకోవాలి. వంట చేసిన ప్రతిసారి ఇలా చేయడం వల్ల అది శుభ్రంగా ఉంటుంది. అలాగే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాత్రిపూట తవాను శుభ్రం చేయడం వల్ల ఇంటి రాహువు బాగుంటుందని నమ్ముతారు.
తవా కనిపించకుండా ఉంచాలి
వంటగదిలో అన్ని సామాన్లు చక్కగా కనిపించేలా సర్దుకుంటారు. అలా పాన్ కూడ కనిపించేలా పెడతారు. కానీ అది మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దాన్ని ఎప్పుడు బహిరంగంగా పెట్టకూడదు. అందరి కళ్ళకు దూరంగా ఉంచాలి. బహిరంగ ప్రదేశంలో పాన్ ఉంచడం అశుభకరంగా పరిగణిస్తారు.
స్టవ్ మీద ఖాళీగా ఉంచకూడదు
తవాని గ్యాస్ పై ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదని నమ్ముతారు. వంట పూర్తి చేసిన తర్వాత దాన్ని షెల్ఫ్ లో లేదా గ్యాస్ దగ్గర ఎక్కడైనా పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తవా ఖాళీగా ఉండటం అంతే ఇంటి సంపద క్షీణించడమేనని అర్థం.
ఇలా చేస్తే మేలు
కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఇంటి సంపద మెరుగుపడాలన్నా రొటీలు వండటానికి ముందు తవాపై కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి. అలాగే రాహువు శాంతపరచడానికి రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల పాలు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి, శ్రేయస్సు ఉంటుందని విశ్వసిస్తారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఆరోగ్యవంతమైన బిడ్డని కనాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఆహారాలు తప్పనిసరిగా తినాల్సిందే