అన్వేషించండి

Vastu Tips in Telugu: మీ ఇంట్లో ఇలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయా? వాస్తు దోషం ఉన్నట్లే!

Vastu Dosha Home: ఇంట్లో వాస్తు దోషం ఉంటే సంతోషం, మనశ్శాంతి కరువైతుంది. సానుకూల శక్తి ఉండాలంటే వాస్తుపరమైన దోషాలను గుర్తించడం ముఖ్యం. ఇంటికి సంబంధించి వాస్తు దోషాలు ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

Vastu Dosha Home: ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో ప్రశాంతత, ఆనందం ఉండాలంటే ఆ ఇంట్లో సానుకూల శక్తి ఉండాలి. ఎందుకంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉండగలుగుతుంది. జీవితంలో అన్ని మంచి విషయాలు ఆకర్షిస్తాయి. కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు. ఇది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఉన్న వ్యక్తులు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇంటి ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుంది. దీనంతటికి కారణం ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కారణమని చెబుతున్నారు వాస్తు పండితులు. ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి వస్తే అది మీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంట్లో వాస్తు దోషాలతోపాటు నెగెటివ్ ఎనర్జీని పారద్రోలే కొన్ని అంశాలు. అవేంటో తెలుసుకునే ముందు అసలు వాస్తు దోషం అంటే ఏమిటో తెలుసుకుందాం. 

వాస్తు దోషం అంటే ఏమిటి?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణానికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటించి మాత్రమే ఇల్లు కట్టుకోవాలి. సానుకూల, ప్రతికూల శక్తులు కూడా ఈ నియమాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఇల్లు కట్టేటప్పుడు మనం ఏ దిశను దృష్టిలో ఉంచుకోకపోతే భవిష్యత్తులో వాస్తు దోషాలు తలెత్తవచ్చు. ఉదాహరణకు, వాస్తు శాస్త్రం ప్రకారం, దక్షిణ దిశలో ప్రధాన ద్వారం ఉండటం శుభపరిణామం కాదు. అదే సమయంలో తూర్పు దిశలో మరుగుదొడ్డి నిర్మించకూడదు. ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉండడం శుభప్రదంగా భావిస్తారు.

ఈ విషయాలతో వాస్తు దోషాలను గుర్తించండి:

⦿ బయటి నుంచి ఇంట్లోకి రాగానే.. ఇంటి తలుపు తీయగానే ఏదో తెలియని భయం మొదలైందంటే.. ఇంట్లో కొంత నెగెటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోండి.

⦿ మీ ఇంట్లో ఎప్పుడూ వింత వాసన వస్తూ, ఈ వాసనకు కారణాన్ని కనుక్కోలేకపోతే, వాస్తు దోషాలను తొలగించుకోవడానికి వాస్తు నిపుణులతో మాట్లాడండి. 

⦿ గృహోపకరణాలను సరైన స్థలంలో ఉంచినప్పటికీ, తలుపు తెరిచిన వెంటనే చెల్లాచెదురుగా ఉన్న వస్తువులు కనిపిస్తే, మీ ఇంట్లో వాస్తు దోషం ఉండవచ్చు.

⦿ మీరు ఇంట్లో ఒక మూల నుంచి శబ్దం విన్నట్లయితే, అది ప్రతికూల శక్తితో ముడిపడి ఉంటుంది.

⦿ వాస్తు దోషానికి మరో సంకేతం ఏమిటంటే ఇంట్లోకి గబ్బిలాలు రావడం, వెళ్లడం. అటువంటి పరిస్థితిలో, మీరు ఎల్లప్పుడూ ఇంటి తలుపులు, కిటికీలను మూసివేయడానికి ప్రయత్నించాలి.

⦿ వాస్తుశాస్త్రం ప్రకారం ముఖ్యంగా మీ ఇంటి తలుపు, కిటికీలు తెరిచినప్పుడు, మూసినప్పుడు ధ్వని వస్తుంటే సాధ్యమైనంత తొందరగా వాటిని రిపేర్ చేయించండి. 

⦿ వాస్తుదోషాన్ని తొలగించడానికి ఆగ్నేయ దిశను సద్వినియోగం చేసుకోవాలి. వంటగది ఆగ్నేయ దిశలో లేనట్లయితే గ్యాస్ స్టవ్‌ను ఈ దిశలో ఉంచడం ద్వారా వాస్తు దోషాన్ని తొలగించవచ్చు. 

⦿ ఒకవేళ మీరు దీన్ని చేయలేకపోయినా ఈ దోషాన్ని జీరో వాట్ బల్బును వెలిగిస్తే వాస్తు దోషం తగ్గుతుంది. 

Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు ⦿ చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
WhatsApp GhostPairing scam: వాట్సాప్‌లో కొత్త రకం మోసం... ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటి? ఎలా తప్పించుకోవాలి
వాట్సాప్‌లో కొత్త రకం మోసం... ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటి? ఎలా తప్పించుకోవాలి
Shambhala Trailer : సైన్స్ Vs శాస్త్రం - ఆ ఊరిలో దెయ్యాలున్నాయా?... ఆసక్తికరంగా 'శంబాల' ట్రైలర్
సైన్స్ Vs శాస్త్రం - ఆ ఊరిలో దెయ్యాలున్నాయా?... ఆసక్తికరంగా 'శంబాల' ట్రైలర్
Shubman Gill: శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!
శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!

వీడియోలు

Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే
Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
వైఎస్ జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, షర్మిల సహా పలువురు ప్రముఖులు
WhatsApp GhostPairing scam: వాట్సాప్‌లో కొత్త రకం మోసం... ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటి? ఎలా తప్పించుకోవాలి
వాట్సాప్‌లో కొత్త రకం మోసం... ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏంటి? ఎలా తప్పించుకోవాలి
Shambhala Trailer : సైన్స్ Vs శాస్త్రం - ఆ ఊరిలో దెయ్యాలున్నాయా?... ఆసక్తికరంగా 'శంబాల' ట్రైలర్
సైన్స్ Vs శాస్త్రం - ఆ ఊరిలో దెయ్యాలున్నాయా?... ఆసక్తికరంగా 'శంబాల' ట్రైలర్
Shubman Gill: శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!
శుభమన్ గిల్‌ను డ్రాప్ చేయడంపై బిగ్ అప్డేట్.. షాకింగ్ విషయం వెలుగులోకి!
World Bank Loan For Pakistan: పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 104 రివ్యూ... బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీల సందడి... కళ్యాణ్ తలకు గాయం... చివర్లో సీజన్ 10 ట్విస్ట్
బిగ్‌బాస్ డే 104 రివ్యూ... బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీల సందడి... కళ్యాణ్ తలకు గాయం... చివర్లో సీజన్ 10 ట్విస్ట్
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
TVS తొలి అడ్వెంచర్‌ బైక్‌ Apache RTX 300: నిజ జీవితంలో ఎంత మైలేజ్‌ ఇస్తుందంటే?
TVS Apache RTX 300 మైలేజ్‌ టెస్ట్‌: సిటీలో, హైవేపైనా అదరగొట్టిన తొలి అడ్వెంచర్‌ బైక్‌
Embed widget