అన్వేషించండి

ఇంట్లో గోడలకు పసుపు రంగు వేయొచ్చా? ఏ దిక్కున ఏ రంగు వేస్తే బెటర్?

వాస్తు నిర్మాణాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని వివరిస్తుంది. ఏదిక్కులో ఎలాంటి సౌకర్యాలు ఏర్పటు చేసుకోవచ్చు దగ్గర నుంచి ఏ గోడకు ఎలాంటి రంగులు వెయ్యాలో కూడా వివరిస్తుంది.

వాస్తు శాస్త్రంలో దిశలతో పాటు రంగులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం చేసుకున్నపుడు చాలా రకాల అనవసరపు కష్టాల బారిన పడకుండా నివారించవచ్చు. అదీ కాక వాస్తు సరిగ్గా లేని ఇంట్లో నివసించే వారి మీద చాలా రకాల దుష్ప్రభావాలు ఉండే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అనారోగ్యాలు, మానసిక, ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబం సభ్యుల మధ్య స్పర్థలు కూడా ఏర్పవచ్చు. పచ్చని పసుపు రంగు చాలా శుభప్రదమైందిగా భావిస్తారు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్శిస్తుందని అంటారు. దీని వల్ల ఇంట్లో శాంతి, సంతోషాలు నిలిచి ఉంటాయి.

వాస్తు ప్రకారం పని చేసుకునే చోట పసుపు రంగు వేసుకోవడం వల్ల జీవితంలో మంచి పురోగతి ఉంటుందని భావిస్తారు. ఈ రంగు అభివృద్దికి మార్గం సుగమం చేస్తుంది. పసుపు రంగు సానుకూల శక్తి కేంద్రంగా చెప్పవచ్చు.

పచ్చని పువ్వులతో ఇంట్లో అలంకారం చేసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసారం జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. ఇంట్లో శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే ఇంటిలోని అన్ని ప్రదేశాల్లో పసుపు రంగు వెయ్యకూడదు. ఇంట్లోని ఏ భాగంలో పసుపు రంగు వెయ్యడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చో తెలుసుకుందాం.

  • వాస్తు ప్రకారం పడకగదిలో గోడలకు పసుపు రంగు వెస్తే దంపతుల మధ్య అనుబంధం మరింత మధురంగా మారుతుంది. ఇది వైవాహిక జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది.
  • ఆగ్నేయ దిక్కున పసుపు రంగు వెయ్యడం వల్ల ఈ రంగు సంబంధించిన దిక్కుల తత్వాలకు హాని జరగవచ్చు.
  • ఆగ్నేయ దిశల్లో పసుపు రంగు వేయడం వల్ల తల్లికి హాని కలుగుతుందని శాస్త్రం చెబుతుంది.
  • ఈశాన్యానికి కూడా ఈ రంగు పనికి రాదు.
  • అంతే కాదు పసుపు రంగును ఎప్పుడూ ఉపయోగించకూడదు. పసుపుతో పాటు ఎరుపు రంగు వాడకపోవడమే మంచిది.

ప్రతి దిశకు నిర్దిష్ట రంగు వేసుకోవాలని వాస్తు వివరిస్తోంది. అయితే అలాంటి నియమాలు అందరికీ సరిపడకపోవచ్చు.  వాస్తు ప్రకారం రంగులకు సాధారణ మార్గదర్శకాలకు కట్టుబడడం మంచిది.

  • ఈశాన్యం – లేత నీలం
  • తూర్పు – తెలుపు లేదా నీలం
  • ఆగ్నేయం – ఈదిక్కు శక్తి కేంద్రం కనుక ఆరెంజ్, గులాబి లేదా వెండి రంగులు మంచిది
  • ఉత్తరం – ఆకుపచ్చ, పిస్తారంగు
  • వాయవ్యం – ఇది గాలికి సంబంధించింది. కనుక తెలుపు, బూడిద, క్రీమ్ కలర్స్ మంచిది
  • పడమర – ఇది నీటికి సంబంధించింది. నీలం, తెలుపు మంచిది.
  • నైరుతి – పీచ్, మట్టి రంగు, లేదా బిస్కట్ రంగు లేదా లేత గోధుమ రంగు
  • దక్షిణం – ఎరుపు లేదా పసుపు రంగులు వేసుకోవడం మంచిది.

ఎప్పుడైనా ఇంటికి లేత రంగులు వేసుకోవడం మంచిది. ఎరుపు, గోధుమ, బూడిద, నలుపు వంటి రంగులు అందరికీ సరిపడకపోవచ్చు. ఈ ముదురు రంగులు మండుతున్న రాహు, శని, మార్స్, సూర్యుడికి ప్రతీకలు కనుక వీటి వల్ల అంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. ముదురు ఎరుపు, పసుపు రంగులు ఇంట్లోని శక్తి ప్రవాహానికి భంగం కలిగించవచ్చు. కనుక వీటిలో లేత షేడ్స్ ఎంచుకోవడం మంచిదని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

Also Read: ఈ చిన్న చిన్న పొరపాట్లే దురదృష్టానికి, దారిద్య్రానికి కారణం..!

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. 

టాప్ హెడ్ లైన్స్

శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
శ్రావణ మంగళగౌరీ పూజ 2026: పూజా సామగ్రి, సులువైన పూజావిధానం తెలుసుకోండి!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
18-08-2026 మంగళవారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
Embed widget