Vastu Tips in Telugu: మందులను ఇంట్లో ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచకూడదు? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది!
Vastu Tips: వాస్తు ప్రకారం మందులు ఉంచే దిశలు ఉన్నాయి. సరైన దిశలో ఉంచితే అనారోగ్యం నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు..

Vastu Tips: ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో కొన్ని మందులను ఉంచుకుంటారు, ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా లేకపోయినా కానీ అత్యవసర సమయంలో వినియోగించేందుకు కొన్ని మందులు ఉంచుతారు. మందులను చాలామంది మంచానికి సమీపంలో ఉంచుతారు. వాస్తు శాస్త్రంలో ఇది తప్పుగా పరిగణిస్తుంది. వాటిని సరైన స్థలంలో ఉంచడానికి కొన్ని నియమాలున్నాయి..వీటిని కచ్చితంగా పాటించాలి.
వాస్తు నియమాల ప్రకారం మందులను సరైన దిశంలో ఉంచడం వల్ల వ్యక్తి త్వరగా కోలుకుంటాడని నమ్ముతారు.
ఏ దిశలో మందులు ఉంచడం అశుభం?
వాస్తు శాస్త్రం ప్రకారం మందులను సరైన దిశలో ఉంచడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎప్పుడూ ఆగ్నేయ దిశలో మందులు ఉంచకూడదు ,ఇంటి పడమర దిశలో కూడా మందులు ఉంచకూడదు. ఎందుకంటే ఈ దిశలో మందులు ఉంచడం వల్ల వ్యాధులు త్వరగా నయం కావని నమ్ముతారు.
మందులు ఉంచడానికి శుభ స్థలం
వాస్తులో మందులకు ఉత్తర-తూర్పు దిశను సరైనదిగా భావిస్తారు. కాబట్టి, ఔషధాలను ఉత్తర-తూర్పు లేదా ఈశాన్య మూలలో ఉంచాలి. ఈ దిశను శుభంగా భావిస్తారు . ఈ దిశలో మందులు ఉంచడం వల్ల వ్యక్తి యొక్క వ్యాధులు త్వరగా నయం అవుతాయని చెబుతారు.
మంచం దగ్గర మందులు ఉంచడం వల్ల నష్టం
వాస్తు శాస్త్రంలో మందుల స్థానం గురించి కొన్ని ప్రత్యేక నియమాలున్నాయి. మందులను మంచం మీద లేదా సమీపంలో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది . వ్యక్తి మనస్సులో అనారోగ్యం యొక్క భావన ఉంటుంది. దీని కారణంగా, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులుగా, కొత్త వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
మందులను బెడ్‌రూమ్‌లో కాకుండా మూసివున్న , సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం మంచిది, తద్వారా ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది రోగి మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాడు.
దిశలవారీగా మందులు ఎక్కడ ఉంచొచ్చు..మరింత వివరంగా...
అశుభ దిశలు
దక్షిణ దిశ (South) - ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది, త్వరగా అనారోగ్యానికి గురికారు
ఆగ్నేయం (South-East) - అగ్నికి సంబంధించిన దిశ కాబట్టి ఈ దిశలో మందులు ఉంచితే అవి పనిచేసే ప్రభావం తగ్గుతుంది.. పైగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడాల్సి వస్తుందట
పశ్చిమం (West) - పశ్చిమ దిశ కూడా మందులు ఉంచేందుకు సరైన దిశ కాదు.
వంటగది (Kitchen) - మహిళలు ముఖ్యంగా మందులు వంటగదిలో ఉంచుతారు.. కానీ వాస్తు ప్రకారం ఇది చాలా తప్పు
శుభ దిశలు
ఈశాన్యం (North-East / Ishaan Kon)- ఈశాన్యం పరమేశ్వరుడి దిశ..అందుకే ఈ దిశగా మందులు ఉంచడం అత్యంత శుభకరమైన దిశ. ఈ దిశలో మందులు ఉంచి వినియోగిస్తే త్వరగా ఆరోగ్యం మెరుగుపడుతుందట
ఉత్తరం (North) - ఈశాన్యం తర్వాత మరో బెస్ట్ ఆప్షన్ ఆరోగ్యానికి, సానుకూల శక్తికి చాలా మంచిది
తూర్పు (East) - తూర్పు దిశగా మందులు ఉంచొచ్చు ( ముఖ్యంగా లిక్విడ్ మెడిసిన్స్)
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ఊడిపోయిన జుట్టు అమ్ముకుని గిన్నెలు కొనుక్కుంటున్నారా? అయితే ఈ విషయం మీకు తెలియదేమో! పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పురాణాల్లో 10 పెంపుడు జంతువులు! ఇవి దేవతల వాహనాలు మాత్రమే కాదు, జీవిత పాఠాలు కూడా! అవి తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















