Vastu Tips: మీ వంటగదిలో చేట, వెదురు బుట్ట ఉందా! మాడ్యులర్ కిచెన్ అందం పోదూ.. అంటారా? అయితే ఇది మీకోసమే!
Vastu Tips: మీరు బాగా డబ్బున్నోళ్లు అయినా కానీ, మీది మాడ్యులర్ కిచెన్ అయినా కానీ.. మీ వంటగదిలోచేట, వెదురుబుట్ట ఉండాల్సిందే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు..ఎందుకో ఏంటో తెలుసుకుందాం

Vastu Tips In Telugu: మారుతున్న కాలంతో పాటు ఇంటి నిర్మాణం, నిర్వహణలో కూడా చాలా మార్పులు వచ్చాయి. వంటగదిని చాలామంది గుడితో సమానంగా భావిస్తారు, ఎందుకంటే వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. అయితే మారుతున్న కాలంతో పాటూ కిచెన్ స్వరూపం కూడా వేగంగా మారిపోయింది. ఈ రోజుల్లో చాలా ఇళ్లలో ఆధునిక మాడ్యులర్ కిచెన్ల ట్రెండ్ నడుస్తోంది. మెరిసే చిమ్నీలు, గ్రానైట్ స్లాబ్‌లు, హై-టెక్ గాడ్జెట్‌లు, ప్లాస్టిక్, నాన్ స్టిక్ పాత్రలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. మారుతున్న కాలంలో ఈ విషయాలను స్వీకరించడం తప్పు కానప్పటికీ, దాని అర్థం మనం మన మూలాలను, సంప్రదాయ విషయాలను వదిలివేయాలని కాదు. ఈ విషయం గురించి జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు అనీష్ వ్యాస్ ఏం చెప్పారో చూద్దాం
కొన్నిసార్లు సంప్రదాయ, దేశీయ వస్తువులు కూడా ఆధునిక సమతుల్యతకు చిహ్నంగా మారతాయి. మీ వంటగది ఆధునిక సౌకర్యాలతో నిండి ఉన్నప్పటికీ, వాస్తు, భారతీయ సంప్రదాయం ప్రకారం కొన్ని దేశీయ వస్తువులు ఇంట్లో సానుకూల శక్తిని కొనసాగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటిలో ఒకటి వెదురు బుట్ట .
వాస్తు శాస్త్రం, జానపద విశ్వాసాల ప్రకారం వంటగదిలో వెదురు బుట్టను ఉంచడం వల్ల ఇంట్లో సుఖం, శ్రేయస్సు, సానుకూల శక్తి ప్రసరిస్తుంది.
తరచుగా పాత్రలు పగిలిపోవడం - అస్తవ్యస్తంగా ఉండడం- పాలు ఉప్పు లాంటివి పడిపోవడం ఇలాంటివి జరిగితే వంటగదిలో ప్రతికూల శక్తి ఉన్నట్టేనట. దీనివల్ల మానసిక అశాంతి, కుటుంబంలో కలహాలు పెరుగుతాయని..అలాంటప్పుడు కిచెన్లో వెదురు బుట్టను లేదా చేటను ఉంచితే వాతావరణం సానుకూలంగా మారుతుందట
వంటగదిలో పనిచేసేటప్పుడు పనికి మించిన అలసట అనిపిస్తున్నా..మానసిక ప్రశాంతత కోల్పోయినా..కానీ వెదురుకి సంబంధించిన వస్తువు కిచెన్లో ఉంచితో ఉపశమనం ఉంటుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు
వెదురుతో చేసిన బుట్టలు, చేటలు..మన ముందు తరాల వాళ్లు వినియోగించేవారు. ధాన్యం బాగుచేసేందుకు జల్లెడ, బియ్యం పప్పులు బాగుచేసేందుకు చేటలు, ధాన్యం నిల్వచేసేందుకు వెదురుబుట్టలు వినియోగించేవారు. అయితే ఇప్పుడంతా ట్రెండ్ మారడంతో సరికొత్త వస్తువు మార్కెట్లో ఆకర్షిస్తున్నాయ్. ట్రెండ్ ను ఫాలో అవొద్దని కాదు..వాటితో పాటూ వెదురు బుట్ట, చేట వాడితే కిచెన్లో ప్రతికూల శక్తి తొలగిపోతుందని చెబుతారు. చేట, జల్లెడ, బుట్టలు..దాన్యం, పప్పుల నుంచి రాళ్లు-దుమ్మును వేరుచేసినట్టే ప్రతికూలతను బయటకు పంపిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు

వాస్తు ప్రకారం వెదురు బుట్ట స్థానం
వాస్తు శాస్త్రం ప్రకారం, వెదురు బుట్టను వంటగదిలో ఆగ్నేయ దిశలో (అగ్ని కోణం) లేదా ధాన్యం నిల్వ చేసే ప్రదేశానికి సమీపంలో ఉంచవచ్చు. వంటగదిలో దీనిని ఉంచడం వల్ల ధాన్యం, ధనానికి వృద్ధి కలుగుతుంది. గ్రామాలు, పట్టణాలలో ఇప్పటికీ వెదురు బుట్టను ఉపయోగించేవారున్నారు. మీరు కూడా మీ ఆధునిక మాడ్యులర్ కిచెన్‌లో వెదురు బుట్టను ఉంచవచ్చు. మీరు దానిని షెల్ఫ్‌లో ఉంచవచ్చు, బుట్టలో పండ్లు, కూరగాయలను అలంకరించి ఫ్రూట్ బాస్కెట్‌లా ఉపయోగించవచ్చు, పూజా సామాగ్రిని ఉంచడానికి ఉపయోగించవచ్చు లేదా గోడకు అలంకారంగా వేలాడదీయవచ్చు. వంటగదిలో వెదురు వాడకం కృత్రిమ ప్లాస్టిక్‌తో పోలిస్తే చాలా ఎక్కువ సానుకూలతను, స్వచ్ఛతను ఇస్తుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి
వంటగదిలో విరిగిపోయిన బుట్టను ఉంచవద్దని గుర్తుంచుకోండి. మురికిగా ఉన్న లేదా పనికిరాని బుట్టను కూడా వంటగదిలో ఉంచవద్దు, ఇది వాస్తు దోషాన్ని పెంచుతుంది. బుట్ట, చేటను ఎప్పుడూ నేలపై ఉంచవద్దు. దానిని ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే నేలపై ఉంచవచ్చు. ఉపయోగించిన తర్వాత వాటిని శుభ్రం చేసి ఎత్తైన ప్రదేశంలో ఉంచండి లేదా గోడకు వేలాడదీయండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















