చాణక్య నీతి: మేం తెలివైనవారం అనుకునే మూర్ఖులు 7 రకాలు! మీలో కూడా ఈ లక్షణాలున్నాయా? | Chanakya Neeti
Chanakya Neeti In Telugu: చాణక్య నీతి ప్రకారం, జ్ఞానం కేవలం చదువుతో రాదు. నేర్చుకునే కోరిక, ప్రవర్తన, క్రమశిక్షణ, మంచి స్నేహం, ఓర్పు కూడా ముఖ్యం అని శిష్యులకు బోధించారు ఆచార్య చాణక్యుడు

Chanakya Neeti: చాణక్య నీతిలో జీవితం, డబ్బు, మంచి విలువలు , సమాజంలో ప్రజలు ఎలా పని చేస్తారు? అనే దాని గురించి సామాజిక సలహాలు చాలా ఉన్నాయి. చాణక్య నీతి ప్రకారం విద్యను పొందిన తర్వాత కూడా తెలివిగలవారు కాని 7 మంది వ్యక్తులు ఉన్నారు.
చాణక్య నీతి..చాణక్యుడి బోధనల సమాహారం. ఇది జీవితం, డబ్బు, నైతిక విలువలు, సమాజ వ్యవహారాలు , మానవుల స్వభావం గురించి లోతైన సలహాలు ఇస్తుంది. చాణక్యుడి బోధనల ప్రకారం విద్య అనేది కేవలం జ్ఞానం సంపాదించేందుకు ముఖ్యమైన సాధనం..కానీ అది అందరకీ సమానంగా ప్రయోజనకరం కాదు. ముఖ్యంగా విద్యను పొందిన తర్వాత కూడా తెలివితక్కువగా మిగిలేవారు ఏడురకాలు. వీరు జ్ఞానాన్ని సరిగ్గా గ్రహించలేకపోవడం, గ్రహించిన జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోవడం, జీవితంలో సమతుల్యత లేకపోవడం వంటి కారణాలపై ఆధారపడి ఉంటాయి.
మొదటిరకం
చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఏం చెప్పారంటే.. విద్య వినగలిగే, అర్థం చేసుకోగలిగే, ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే సహాయపడుతుంది. తెలివి తక్కువగా ఉన్నవారికి విద్య ద్వారా జ్ఞానం లభించదు. తెలివితక్కువవారు ఎంత చదువుకుంటే ఏం లాభం..డిగ్రీలు వచ్చిచేరుతాయి కానీ జ్ఞానం ఉండదు. వీరెప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. తమ వారిని తప్పుడు మార్గంలో నడిపించి కుటుంబానికి, సమాజానికి చెడు చేస్తారు
రెండోరకం
ఒక వ్యక్తి నేర్చుకోవాలనే కోరిక కలిగి ఉన్నప్పుడే ఏదైనా నేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. జ్ఞానం సంపాదించడంలో ఆసక్తి లేని వారికి విద్య వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.తల్లిదండ్రుల ఒత్తిడితో చదివే పిల్లలకు ఆ చదువు ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వదు
మూడోరకం
విద్య అంటే కేవలం జ్ఞానాన్ని కూడబెట్టుకోవడం ద్వారానే కాకుండా, నేర్చుకున్న విషయాలను ఉపయోగించడం ద్వారా కూడా వస్తుందని చాణక్యుడు బోధించారు. ఓ వ్యాపారవేత్తకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ దానిని వ్యాపారంలో ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం ప్రయోజనం?
నాలుగోరకం
చదువులో క్రమశిక్షణ , ఆత్మ నియంత్రణ చాలా అవసరం. ఈ లక్షణాలు లేకుండా ఏ వ్యక్తి అయినా జ్ఞానం పొందడం కష్టం. అతను ఎంత చదువుకున్నా సరే క్రమశిక్షణ లేకపోతే వ్యర్థం. ముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనివారు మంచి ఫలితాలను ఎప్పటికీ సాధించలేరు
ఐదోరకం
చెడు వారితో సమయం గడిపితే, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది. తప్పుడు నిర్ణయం ప్రభావం ఒక వ్యక్తిని నిజమైన జ్ఞానం నుంచి వేరు చేస్తుంది.మంచివారు ఉన్నత మార్గంలో నడిచేందుకు సహకరిస్తే..చెడు స్నేహితులు మీ పతనానికి కారణం అవుతారు
ఆరోరకం
డబ్బు , జ్ఞానాన్ని నెమ్మదిగా పొందాలి. కేవలం డబ్బుపై దృష్టి పెట్టే వ్యక్తులు జ్ఞానాన్ని కోల్పోవచ్చు. డబ్బు సంపాదనే ధ్యేయంగా నైతిక విలువలు వదిలేసి, బంధాలను తుంచేసుకున్నవారికి చివరకు ఆ డబ్బు మాత్రమే మిగులుతుంది..వారి చుట్టూ ఎవ్వరూ ఉండరు. వారు నేర్చుకున్న విద్యకు విలువ ఉండదు
ఏడోరకం
చాణక్య నీతి ప్రకారం విద్య చాలా అవసరం, కానీ జ్ఞానం కోసం సరిపోదు. తెలివి, క్రమశిక్షణ, మంచి సాంగత్యం, జ్ఞానం మరియు ఆధ్యాత్మికతను కొనసాగించడానికి ఇది అవసరం. జ్ఞానం ఆధ్యాత్మికత మధ్య సమతుల్యత అవసరం..లేదంటే మీరు ఎంత తెలివైనవారైనా కానీ మూర్ఖులుగా మిగిలిపోతారు.
చాణక్యుడి బోధనల్లో ఉన్న లోతుని అర్థం చేసుకుని ఆచరిస్తే..మీరు ఎప్పటికీ ఓడిపోరు..
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం.






















