Dhanurmasam 2025 : ధనుర్మాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు? పెళ్లి ముహూర్తాలు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయి!
Dhanurmasam simple pooja vidhanam: ధనుర్మాసం 2025 డిసెంబర్ 16 న ప్రారంభమైంది...2026 జనవరి 14 వరకు ఉంటుంది. ఈ నెలరోజులు ఏం చేయాలి? ఏం చేయకూడదు? పూర్తి వివరాలు తెలుసుకోండి

Dhanurmasam 2025 Dates: సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరంలో జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితో ఖర్మాస్ ముగుస్తుంది, అయితే జనవరిలో శుక్రుడు ఉదయించడు. దీని కారణంగా, వివాహానికి ముహూర్తం ఫిబ్రవరి మొదటి వారంలో ఉంది. గురుడు, శుక్రుడు ఉదయించిన తర్వాతే వివాహ ముహూర్తాలు ఏర్పడతాయి.
పాల్ బాలాజీ జ్యోతిష్య సంస్థాన్ జైపూర్-జోధ్‌పూర్ డైరెక్టర్ జ్యోతిష్యుడు డాక్టర్ అనీష్ వ్యాస్ ప్రకారం. ధనుర్మాసంలో శుభ కార్యాలు జరగవు. కానీ పూజలు, దానధర్మాలు, కొనుగోళ్లు చేయవచ్చు.
డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభం
డిసెంబర్ 16న సూర్యుడు వృశ్చికం నుంచి బయలుదేరి గురువు రాశి అయిన ధనుస్సులోకి ప్రవేశించాడు. జనవరి 14న సూర్యుడు మకర రాశిలోకి రాగానే ధనుర్మాసం ముగుస్తుంది. ఈ నెల రోజులలో శుభ కార్యాలు చేయలేరు. ధనుర్మాసంలో వివాహం, గృహ ప్రవేశం, ముండనం వంటి శుభ కార్యాలకు శుభ ముహూర్తాలు ఉండవు. ఈ రోజుల్లో మంత్ర జపం, దానం, నదీ స్నానం, తీర్థయాత్రలు చేసే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం కారణంగా, ఈ రోజుల్లో చాలా మంది పవిత్ర నదులలో స్నానం చేయడానికి వస్తారు. అలాగే పురాణ ప్రాముఖ్యత కలిగిన దేవాలయాలలో భక్తుల సంఖ్య పెరుగుతుంది.
సూర్యుడు సంవత్సరంలో రెండుసార్లు బృహస్పతి రాశులలో ఒక్కొక్క నెల పాటు ఉంటాడు. వీటిలో డిసెంబర్ 15 నుంచి జనవరి 14 వరకు ధనుస్సు .. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు మీన రాశిలో. కాబట్టి, ఈ 2 నెలల్లో సూర్యుడు- బృహస్పతి కలయిక ఏర్పడినప్పుడు, ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు.
సూర్యుని వల్ల వాతావరణ మార్పులు
సూర్యుని రాశి మార్పుతో రుతువులు మారుతాయి. ధనుర్మాసం సమయంలో హేమంత ఋతువు ఉంటుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే పగలు చిన్నవిగాను, రాత్రులు పెద్దవిగాను మారడం ప్రారంభమవుతుంది. అలాగే వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. గురువు రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల వాతావరణంలో అకస్మాత్తుగా అనవసరమైన మార్పులు కూడా వస్తాయి. అందుకే చాలాసార్లు ధనుర్మాస సమయంలో మేఘాలు, పొగమంచు, వర్షం , మంచు కూడా కురుస్తాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం
ధనుస్సు, మీన రాశికి అధిపతి బృహస్పతి. ఈ రాశులలో సూర్యుడు ప్రవేశించినప్పుడు ఖర్మాస్ దోషం ఏర్పడుతుంది. జ్యోతిష్య తత్వ వివేక్ అనే గ్రంథంలో సూర్యుని రాశిలో గురువు ఉన్నప్పుడు , గురువు రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ఆ కాలాన్ని గురువాదిత్య అంటారు. ఇది అన్ని శుభ కార్యాలకు నిషేధం
ధనుర్మాసంలో భాగవతం పఠించండి
ధనుర్మాసంలో శ్రీరామ కథ, భాగవత కథ, శివ పురాణం పఠించండి. ప్రతిరోజూ మీ సమయం ప్రకారం గ్రంథాలను పఠించండి. ఈ నెలలో కనీసం ఒక గ్రంథాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ధర్మ లాభంతో పాటు సుఖమయ జీవితాన్ని గడిపే సూత్రాలు కూడా లభిస్తాయి. గ్రంథాలలో చెప్పిన సూత్రాలను జీవితంలో పాటిస్తే అన్ని సమస్యలు తొలగిపోవచ్చు.
ధనుర్మాసంలో దానానికి ప్రాముఖ్యత
ధనుర్మాసంలో దానం చేయడం వల్ల తీర్థ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ నెలలో నిష్కామ భావంతో భగవంతునికి దగ్గరవ్వడానికి చేసే వ్రతాలకు అక్షయ ఫలం లభిస్తుంది మరియు వ్రతం చేసేవారి దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో పేదలకు, సాధువులకు మరియు బాధిత ప్రజలకు సేవ చేయడం ముఖ్యం. ఇంటి దగ్గరలోని ఏదైనా ఆలయంలో పూజా సామాగ్రిని సమర్పించండి. పూజా సామాగ్రి అంటే కుంకుమ, నెయ్యి, నూనె, అబీర్, గులాల్, పూలమాలలు, దీపాలు, ధూప్‌బత్తి మొదలైనవి.
ధనుర్మాసంలో ఎందుకు శుభ ముహూర్తాలు ఉండవు?
జాతక విశ్లేషకుడు డాక్టర్ అనీష్ వ్యాస్ మాట్లాడుతూ సూర్యుడు ప్రత్యక్ష దేవుడు, పంచదేవతలలో ఒకడు. ఏదైనా శుభకార్యం ప్రారంభంలో గణేష్ , శివ , విష్ణు , దుర్గ , సూర్యదేవుడిని పూజిస్తారు. సూర్యుడు తన గురువు సేవలో ఉన్నప్పుడు, ఈ గ్రహం శక్తి తగ్గుతుంది. సూర్యుని కారణంగా గురు గ్రహం బలం కూడా తగ్గుతుంది. ఈ రెండు గ్రహాల బలహీన స్థితి కారణంగా శుభ కార్యాలు చేయవద్దని సలహా ఇస్తారు. వివాహం సమయంలో సూర్యుడు గురు గ్రహం మంచి స్థితిలో ఉంటేనే..ఆ జంట ఎప్పటికీ సంతోషంగా ఉంటారని నమ్మకం
సూర్య పూజ చేయండి
ధనుర్మాసంలో ప్రతిరోజూ సూర్య గ్రహానికి పూజ చేయాలి. తెల్లవారుజామున లేచి స్నానం చేసిన తర్వాత రాగి పాత్రతో సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. నీటిలో కుంకుమ, పువ్వులు , బియ్యం కూడా వేయాలి. సూర్య మంత్రం ఓం సూర్యాయ నమః జపించండి.
మకర సంక్రాంతి నాడు ధనుర్మాసం ముగుస్తుంది
డిసెంబర్ రెండో వారాంతంలో ప్రారంభమయ్యే ధనుర్మాసం జనవరి రెండోవారాంతం సంక్రాంతి సమయానికి పూర్తవుతుంది. పంచాంగం ప్రకారం, సూర్యుడు ధనుస్సు రాశి నుంచి బయలుదేరి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి వస్తుంది. ఇది ప్రారంభం కాగానే ధనుర్మాసం ముగుస్తుంది.
పురాణాల ప్రకారం, సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథంపై కూర్చుని నిరంతరం విశ్వాన్ని చుట్టుముడతారు. సూర్య భగవానుడిని ఎక్కడా ఆగడానికి అనుమతించరు, కాని రథానికి కట్టిన గుర్రాలు నిరంతరం నడవటం వల్ల అలసిపోతాయి. గుర్రాల పరిస్థితిని చూసి సూర్యదేవుడు చలించిపోయాడు గుర్రాలను ఒక చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు, కాని రథం ఆగిపోతే అనర్థం జరుగుతుందని గ్రహించాడు. చెరువు దగ్గర రెండు గాడిదలు ఉన్నాయి. నమ్మకం ప్రకారం, సూర్యదేవుడు గుర్రాలను నీరు త్రాగడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి వదిలి, గాడిదలను రథానికి కట్టాడు. గాడిదలు సూర్యదేవుని రథాన్ని లాగడానికి చాలా కష్టపడటం వల్ల రథం వేగం తగ్గింది ..ఎలాగోలా సూర్యదేవుడు ఈ ఒక నెల చక్రాన్ని పూర్తి చేశాడు. గుర్రాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత సూర్యుని రథం మళ్ళీ దాని వేగానికి చేరుకుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ క్రమం కొనసాగుతుంది. అందుకే ప్రతి సంవత్సరం ఖర్మాస్ వస్తుందని ఓ పురాణ కథనం.
సంవత్సరం 2026 లో శుభ వివాహ తేదీలు ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభమవుతాయి. ప్రధాన వివాహ సీజన్ ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉంటుంది.
ఫిబ్రవరి 2026 - 5, 6, 8, 10, 12, 14, 19, 20, 21, 24, 25 ,26 ఫిబ్రవరి
మార్చి 2026 - 1, 3, 4, 7, 8, 9, 11 , 12 మార్చి
ఏప్రిల్ 2026 - 15, 20, 21, 25, 26, 27, 28 , 29 ఏప్రిల్
మే 2026 - 1, 3, 5, 6, 7, 8, 13, 14 మే
జూన్ 2026 - 21, 22, 23, 24, 25, 26, 27, 29 జూన్
జూలై 2026 - 1, 6, 7, 11 జూలై
నవంబర్ 2026 - 21, 24, 25, 26 నవంబర్
డిసెంబర్ 2026 - 2, 3, 4, 5, 6, 11 , 12 డిసెంబర్
(కొన్ని పంచాంగాలలో తేడాలు ఉండటం వల్ల తేదీలు మారవచ్చు)
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















