New Year 2026: నూతన సంవత్సరంలో మొదటి రోజు అద్భుతం జరగబోతోందా! 2026 జనవరి 1న 9 శుభ యోగాలు!
New Year 2026 Shubh Sanyog: 2026 నూతన సంవత్సరంలో 9 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. కొత్త సంవత్సరం ప్రారంభానికి ఇది సానుకూల మార్పులు, అభివృద్ధి, అవకాశాలు, పురోగతిని సూచిస్తుంది.

New Year 2026: నూతన సంవత్సరం 2026ను స్వాగతించడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మంచి విషయం ఏమిటంటే, ఈసారి సంవత్సరం ప్రారంభం చాలా శుభంగా ఉంటుంది. ముఖ్యంగా జ్యోతిష్య , మతపరమైన దృష్ట్యా జనవరి 1, 2026న శుభంగా పరిగణిస్తున్నారు. కారణం ఏంటంటే సంవత్సరం మొదటి రోజునే తొమ్మిది శుభ యోగాలు ఏర్పడుతున్నాయి, ఇవి ఈ రోజు శుభత్వాన్ని పెంచుతాయి. మతపరంగా, సంవత్సరం ప్రారంభంలో ముఖ్యమైన వ్రతాలు , పండుగలు ఉంటాయి. అదే సమయంలో, న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) ప్రకారం సంవత్సరం 2026కి అధిపతి సూర్యుడు. కాబట్టి, సంవత్సరం ప్రారంభం సూర్యుని బలమైన స్థితి .. శుభ యోగాలతో ఉండబోతోంది. ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభ సూచనగా పరిగణిస్తారు. జనవరి 1, 2026న ఏర్పడే 9 యోగాల గురించి తెలుసుకుందాం.
జనవరి 1, 2026న 9 మహాసంయోగాలు (1st January New Year 2026 Shubh Sanyog)
తిథి యోగం
జనవరి 1, 2026న పంచాంగం ప్రకారం పుష్య మాసం శుక్ల పక్ష త్రయోదశి తిథి ఉంటుంది. త్రయోదశి తిథి శివుని పూజకు అత్యంత విశిష్ఠమైనది. అందుకే ఈ ఏడాది శివుని కృపతో ప్రారంభం కావడం శుభ సూచన.
ప్రదోష వ్రతంతో నూతన సంవత్సరం ప్రారంభం
జనవరి 1, 2026న గురువారం , త్రయోదశి తిథి ఉంటుంది. కాబట్టి సంవత్సరం మొదటి రోజున గురు ప్రదోష వ్రతం వస్తుంది, ఇది 2026 సంవత్సరంలో మొదటి ప్రదోష వ్రతం అవుతుంది.
గురువారం
హిందూ మతంలో గురువారాన్ని అత్యంత శుభ దినంగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీ-నారాయణులను పూజిస్తారు.
శుభ యోగం
జనవరి 1, 2026న శుభ యోగం కూడా ఏర్పడుతోంది. ఈ రోజున శుభ యోగం ఉదయం నుంతి సాయంత్రం 05:12 వరకు ఉంటుంది.
శుక్ల యోగం
శుభ యోగం ముగిసిన తర్వాత శుక్ల యోగం సాయంత్రం 05:12 నుంచి రాత్రి వరకు ఉంటుంది. శుక్ల యోగం కూడా కొత్త పనులు, పెట్టుబడులు మరియు శుభ ప్రారంభానికి చాలా అనుకూలం అని చెబుతారు పండితులు
శుభ నక్షత్రం
సంవత్సరం మొదటి రోజున నక్షత్రాల శుభ ప్రభావం కూడా ఉంటుంది. జనవరి 1, 2026న ఉదయం నుంచి రాత్రి వరకు రోహిణి నక్షత్రం ఉంటుంది. తర్వాత రాత్రి 10:48 నుంచి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది.
రవి యోగం
నూతన సంవత్సరం ప్రారంభంలో రవి యోగం కూడా ఏర్పడుతోంది. రవి యోగంలో సూర్య పూజ చేయడం వల్ల అన్ని దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
నందిపై శివవాసం
సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1, 2026న, శివుడు తన ప్రియమైన గణమైన నందిపై ఉంటాడు. ఈ రోజున శివునికి రుద్రాభిషేకం చేయడం చాలా ఫలవంతమైనదిగా చెబుతారు
చంద్రుడు ఉన్నత రాశిలో సంచారం
సంవత్సరం మొదటి రోజున చంద్రుడు తన ఉన్నత రాశి అయిన వృషభంలో ఉంటాడు. వృషభ రాశిలో చంద్రుడు ఉండటం మానసిక శాంతి, ఆనందం నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే. ఇక్కడ ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















